|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Chennai Love Story: ‘బేబి’ డైరెక్టర్‌ సినిమాలో కిరణ్ అబ్బవరం.. గ్లింప్స్ రిలీజ్

Published: 02-06-2025, 9:50 AM
Chennai Love Story: 'బేబి' డైరెక్టర్‌ సినిమాలో కిరణ్ అబ్బవరం.. గ్లింప్స్ రిలీజ్

‘బేబి’ చిత్ర దర్శకుడు సాయి రాజేశ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రం గ్లింప్స్ విడుదలైంది. కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియ జంటగా నటిస్తున్న ఈ చిత్రం చెన్నై నేపథ్యంలో సాగుతుంది. రెండు నిమిషాల గ్లింప్స్ ద్వారా కథను పరిచయం చేశారు.

Key Points

1

'బేబి' డైరెక్టర్ సాయి రాజేశ్ నిర్మాణంలో కొత్త ప్రేమకథ.

2

కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియ జంటగా నటన.

4

గ్లింప్స్ విడుదలై, ప్రేక్షకుల ఆసక్తిని రేకెత్తిస్తోంది.

‘బేబి’ డైరెక్టర్ కొత్త ప్రేమకథ

‘బేబి’ దర్శకుడు సాయి రాజేశ్.. మరో ప్రేమకథతో వచ్చేందుకు రెడీ అయ్యాడు. కాకపోతే ఈసారి స్టోరీ అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించాడు. కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు ‘చెన్నై లవ్ స్టోరీ’ అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. దాదాపు రెండు నిమిషాలున్న వీడియోతో స్టోరీ ఏంటనేది చూచాయిగా చెప్పేశారు.

కిరణ్ అబ్బవరం-గౌరీ ప్రియ జంట

హీరోయిన్ తొలి ప్రేమ ఎంత గొప్పదో చెబుతుంది. హీరోకి మాత్రం తొలిప్రేమపై నమ్మకం ఉండదు. తొలిప్రేమ అంత తోపేం కాదు అనే టైప్. అలాంటి వీళ్లిద్దరూ ప్రేమలో ఎలా పడ్డారు? ఈ మజిలీలో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు? అనేదే స్టోరీలా అనిపిస్తుంది. రెగ్యులర్‌గా హైదరాబాద్‌లో కాకుండా ఈసారి స్టోరీ సెటప్ అంతా చెన్నైలో ఉండనుంది.

అంటే ‘ప్రేమలు’ అనే మలయాళ సినిమాలో హైదరాబాద్‌ని చూపించినట్లు.. ‘చెన్నై లవ్ స్టోరీ’లో చెన్నైని చూపించబోతున్నారు. గ్లింప్స్‌లో మెరీనా బీచ్, లైట్ హౌస్ చూపించారు. ఇకపోతే ఈ చిత్రానికి ఎస్కేఎన్, సాయి రాజేశ్ నిర్మాతలు కాగా.. రవి నంబూరి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మణిశర్మ సంగీతమందిస్తున్నారు. త్వరలో రిలీజ్ వివరాలు ప్రకటించనున్నారు.

చెన్నై నేపథ్యంలో ప్రేమకథ

చివరగా, ‘చెన్నై లవ్ స్టోరీ’ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియల నటన, చెన్నై నగర అందాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించనున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.