|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కిరణ్, గౌరిల ‘చెన్నై లవ్ స్టోరీ’: మణిశర్మ మ్యూజిక్ మ్యాజిక్ మొదలు!

Published: 25-03-2026, 2:35 PM
కిరణ్, గౌరిల 'చెన్నై లవ్ స్టోరీ': మణిశర్మ మ్యూజిక్ మ్యాజిక్ మొదలు!
  • కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రం.
  • మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది.
  • ఈ సినిమా ఆడియో హక్కులను టీ సిరీస్ సౌత్ సొంతం చేసుకుంది.
  • చిత్రానికి సాయి రాజేశ్ కథను అందించగా, రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు.

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. ఆడియో హక్కులను టీ సిరీస్ సౌత్ దక్కించుకుంది.

మణిశర్మ సంగీతంతో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story: ‘కె-ర్యాంప్’ తర్వాత మినిమమ్ గ్యారంటీ హీరోగా కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) మారిపోయారు. ప్రస్తుతం ఆయన హీరోగా, శ్రీ గౌరి ప్రియ (Sri Gouri Priya) హీరోయిన్‌గా.. ‘కలర్ ఫొటో’, ‘బేబి’ వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్‌ని ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్‌కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్‌లో ‘చెన్నై లవ్ స్టోరీ’ (Chennai Love Story) అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే బిజినెస్ పరంగా మంచి క్రేజ్ ఏర్పడుతోంది. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తుండగా, రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన సినిమా గ్లింప్స్‌ మంచి స్పందనను రాబట్టుకుని, సినిమాపై మంచి అంచనాలు ఏర్పడేలా చేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి రెండు అప్డేట్స్‌ని మేకర్స్ తెలియజేశారు.

ఫస్ట్ సింగిల్ ‘గుర్తుందా గుర్తుందా’ విడుదల

అందులో మొదటిది.. మెలొడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా నుంచి ‘గుర్తుందా గుర్తుందా’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ని ఈ వారంలోనే విడుదల చేయబోతున్నారట. ఆల్రెడీ మణిశర్మ సైడ్ నుంచి అంతా రెడీ అయిందని, సాంగ్ అద్భుతంగా వచ్చిందని అంటున్నారు. ఈ సినిమాలోని పాటలన్నీ మణిశర్మ ఈజ్ బ్యాక్ అనేలా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. ఇప్పుడు రాబోయే ఫస్ట్ సింగిల్ ‘గుర్తుందా గుర్తుందా’.. ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుందని, ఇదొక మంచి లవ్ సాంగ్ అని మేకర్స్ సైడ్ నుంచి తెలుస్తోంది. మణిశర్మ అనగానే ఒక వైబ్ వస్తుంది. అందులోనూ లవ్ స్టోరీ కాబట్టి.. ఆయన ఈ సినిమాకు మాములుగా డ్యూటీ చేసి ఉండరని ఫిక్సై పోవచ్చు. ఆయన నుంచి వచ్చిన మెలోడీ సాంగ్స్ ఇప్పటికీ వినబడుతూనే ఉంటాయంటే, మణిశర్మ మ్యాజిక్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

టీ సిరీస్ సౌత్ చేతికి ఆడియో హక్కులు

ఇక రెండవ అప్డేట్‌కు వస్తే.. ఈ సినిమా ఆడియో హక్కులను టీ సిరీస్ సౌత్ మ్యూజిక్ లేబుల్ సొంతం చేసుకుంది. మిడ్ రేంజ్ చిత్రాల్లో మరే సినిమాకు లేనంత ఫ్యాన్సీ రేట్‌కు టీ సిరీస్ సౌత్ ఈ చిత్ర ఆడియో రైట్స్ దక్కించుకుందని మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం చిన్న సినిమాలకే కాదు, పెద్ద సినిమాలకు కూడా ఆడియో రైట్స్ విషయంలో వేచి చూడక తప్పడం లేదు. ఇదివరకటిలా అంత ఈజీగా ఏది జరగడం లేదు. అలాంటిది ఈ సినిమా, ఇంకా సెట్స్‌పై ఉండగానే, ఒక్క సాంగ్ కూడా విడుదల కాకుండానే ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడవడం నిజంగా విశేషమనే చెప్పుకోవాలి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్‌ని త్వరలోనే విడుదల చేస్తామని ఈ సందర్భంగా మేకర్స్ తెలిపారు.

‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రం మణిశర్మ సంగీతంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఫస్ట్ సింగిల్ విడుదల కోసం ఎదురుచూద్దాం. టీ సిరీస్ సౌత్ ఆడియో హక్కులను సొంతం చేసుకోవడం విశేషం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.