|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మీ ఫొటోను చిబిగా మార్చండి! ChatGPT, Gemini AIతో క్షణాల్లో వైరల్ అవతార్!

Published: 16-05-2026, 5:45 AM
మీ ఫొటోను చిబిగా మార్చండి! ChatGPT, Gemini AIతో క్షణాల్లో వైరల్ అవతార్!
  • ప్రస్తుతం సోషల్ మీడియాలో చిబి కార్టూన్ ఏఐ ట్రెండ్ నడుస్తోంది.
  • చాట్ జీపీటీతో ప్రాంప్ట్ తయారుచేసి, జెమిని ఏఐలో ఇమేజ్ జనరేట్ చేయొచ్చు.
  • మీ సెల్ఫీ ఫొటోలను చిబి కార్టూన్‌లుగా మార్చుకోవడం చాలా సులువు.
  • క్రియేట్ చేసిన చిబి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ చేయండి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిబి కార్టూన్ ఏఐ ట్రెండ్‌ను మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? చాట్ జీపీటీ, జెమిని ఏఐ టూల్స్ ఉపయోగించి మీ ఫొటోలను క్షణాల్లో అట్రాక్టివ్ చిబి అవతార్‌లుగా ఎలా మార్చవచ్చో ఈ కథనం వివరిస్తుంది. సులభమైన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌తో మీరూ వైరల్ అవ్వండి.

ఏఐ కార్టూన్ ట్రెండ్ అంటే ఏమిటి?

Chibi Cartoon AI ( Image Credit : AI ChatGPT )

Chibi Cartoon AI : ఇప్పుడంతా ఏఐదే ఆధిపత్యం.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఏఐ ఫొటోలే తెగ వైరల్ అవుతున్నాయి. యూజర్లు కూడా ఈ ఏఐ టూల్స్ ద్వారా అట్రాక్టివ్ ఇమేజ్ జనరేట్ చేసి పోస్టు చేస్తున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో చిబి కార్టూన్ ఏఐ ట్రెండ్ నడుస్తోంది. ప్రతిఒక్కరూ తమ సెల్ఫీ ఫొటోలు, ఫ్యామిలీ ఫొటోలతో చిబి కార్టూన్ ఏఐ ఫొటోలను జనరేట్ చేస్తున్నారు. ఆ ఫొటోలను కొద్దిగా ఎడిట్ చేసి ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లలో పోస్టు చేస్తున్నారు. ఇలాంటి ఏఐ కార్టూన్ ఫొటోలు ఎక్కువగా వైరల్ అవుతాయి.

మీరు కూడా డిజిటల్ ప్రపంచంలో వైరల్ అవుతున్న (Chibi Cartoon AI) ఇమేజ్ ట్రెండ్ ట్రై చేయాలని అనుకుంటున్నారా? ఈ ప్రాసెస్ చాలా సింపుల్‌గా ఉంటుంది. మీరు చాట్ జీపీటీ, గూగుల్ జెమిని ఏఐ టూల్స్ ద్వారా చేయొచ్చు.

ఫస్ట్ యూజర్లు మీకు కావాల్సిన ఐడియాను ఎంచుకోండి. ఉదాహరణకు.. మీ ఫొటోను చిబి కార్టూన్‌గా మార్చుకోవడం లేదా ఫన్నీ స్టైల్ క్యారెక్టర్ జనరేట్ చేయడం.. ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. మీ కాన్సెప్ట్ బాగుంటే రిజల్ట్ కూడా అంతే బాగుంటుంది.

చాట్ జీపీటీ, జెమినితో చిబి అవతార్ ఎలా?

చాట్ జీపీటీ టూల్ ద్వారా ఫస్ట్ మీరు మంచి ఏఐ ప్రాంప్ట్ రెడీ చేసుకోవాలి. ఏఐ టూల్స్ వాడే యూజర్లు ముందుగా గూగుల్ జెమినిలోకి వెళ్లి ‘Generate Image’ ఆప్షన్‌ ఎంచుకోవాలి. చాట్ జీపీటీ ఇచ్చిన ప్రాంప్ట్ జెమిని ఏఐ ఓపెన్ చేసి అక్కడ పేస్ట్ చేయాలి.

Chibi Cartoon AI ( Image Credit : AI ChatGPT )

ఒక్క క్లిక్‌తో జెమిని ఆ సమ్మరీ ఆధారంగా చిబి కార్టూన్ ఇమేజ్‌ను జనరేట్ చేస్తుంది. అవసరమైతే బ్యాక్‌గ్రౌండ్, కలర్స్ లేదా స్టైల్ మార్చి మరిన్ని వెర్షన్లు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫైనల్ ఇమేజ్‌ను మీకు కావాల్సిన విధంగా ఎడిట్ చేసి మరింత అట్రాక్టివ్ మార్చుకోవచ్చు.

Read Also : Personal Data After Death : ఒక వ్యక్తి చనిపోతే వాళ్ల పర్సనల్ డేటా మీద హక్కు ఎవరిది?

ఆపై ఇన్‌స్టాగ్రామ్ లేదా వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో షేర్ చేయొచ్చు. మీ ఫొటో ఫాస్ట్ వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాట్ జీపీటీ, గూగుల్ జెమిని కలిపి వాడితే ఈజీగా ట్రెండింగ్ (Chibi AI) ఇమేజ్‌లు క్రియేట్ చేసుకోవచ్చు.

మీ చిబి ఫొటోను వైరల్ చేయండి!

మీ సొంతంగా వైరల్ చిబి ఏఐ ఫొటో క్రియేట్ చేయడం ఇప్పుడు చాలా ఈజీ. మీ సెల్ఫీకి ‘కార్టూన్ రీబూట్’ అని చెప్పొచ్చు. ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసి చూద్దాం..

ఫస్ట్ మీరు చేయాల్సింది ఒకటే.. :

“Turn my selfie into a glossy 3D Chibi cartoon with oversized expressive eyes, pastel pink and blue lighting, floating hearts, sparkles, Korean Instagram aesthetic, handwritten doodles, soft glow, and tiny animated mini versions of me around the frame. Keep my face and hairstyle realistic and recognisable. 4K quality, vertical 4:5 ratio.”

ఇప్పుడు మీరు ఇమేజ్ రేషియో (image ratio) ఎంచుకోవాలి. ఎక్కువగా వైరల్ కంటెంట్ కోసం 1:1 లేదా 4:5 (portrait ratio) బాగా వర్క్ అవుతుంది.

చివరగా, ‘Generate’ బటన్ క్లిక్ చేస్తే.. ఏఐ మీ ఫొటోను అద్భుతమైన చిబి కార్టూన్ హై క్వాలిటీ ఇమేజ్‌గా మార్చి ఇస్తుంది. అవసరమైతే కొన్ని వెర్షన్స్ ట్రై చేసి బెస్ట్ వన్ కూడా ఎంచుకోవచ్చు. ఇలా ChatGPT, Gemini ఏఐ టూల్స్ వాడి ఎవరికైనా ఈజీగా వైరల్ (Chibi AI) ఫొటో క్రియేట్ చేసి ఇవ్వొచ్చు.

చివరగా, చాట్ జీపీటీ, జెమిని ఏఐల సాయంతో చిబి కార్టూన్ ఫొటోలను క్రియేట్ చేయడం చాలా సులువు. ఈ స్టెప్స్ ఫాలో అయ్యి మీ ఫొటోలను వైరల్ చేయండి. డిజిటల్ ప్రపంచంలో మీ సృజనాత్మకతను ప్రదర్శించడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.