
📌 Key Points
- శివాజీ ‘సామాన్ల’ కామెంట్స్‌తో మొదలైన దుమారం ‘చికిరి చికిరి’ సాంగ్ మెడకు చుట్టుకుంది.
- “సరుకు, సామాను” పదాలపై అభ్యంతరాలు, రామ్ చరణ్ సాంగ్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్.
- పెద్ది టీం ట్రోల్స్‌ను పట్టించుకోమని, ప్రస్తుతం సినిమాపైనే తమ ఫోకస్ అని స్పష్టం చేసింది.
- ఢిల్లీలో షూటింగ్ పూర్తి చేసుకున్న పెద్ది, వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
శివాజీ ‘సామాన్ల’ కామెంట్స్‌తో మొదలైన వివాదం ఇప్పుడు రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా ‘చికిరి చికిరి’ సాంగ్ మెడకు చుట్టుకుంది. ఈ సాంగ్‌లోని కొన్ని పదాలపై వస్తున్న ట్రోల్స్‌పై పెద్ది టీం తాజాగా స్పందించింది. ట్రోల్స్‌ను పట్టించుకోకుండా సినిమాపైనే ఫోకస్ చేస్తున్నట్లు వెల్లడించింది.
శివాజీ కామెంట్స్‌తో మొదలైన ‘సామాన్ల’ రచ్చ
Peddi Chikiri Chikiri Song : ఇండస్ట్రీ మొత్తం ‘సామన్ల’ పంచాయితీపై పడింది. దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అమ్మాయిలు, హీరోయిన్ల బట్టల గురించి శివాజీ చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్నే లేపాయి. సామాన్లు అనే పదాన్ని శివాజీ వాడటంపై చాలా మంది ప్రముఖులు తప్పుబట్టారు. దీనిపై పెద్ద చర్చ కూడా జరిగింది. ఈ క్రమంలో.. సినిమాల్లో ఈ పదాన్ని వాడిన సందర్భాలను బయటికి తీశారు. అలా…. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా నుంచి వచ్చిన చికిరి చికిరి సాంగ్‌ను కూడా బయటికి తెచ్చారు. అలా… శివాజీ స్టార్ట్ చేసిన రచ్చ… రామ్ చరణ్ మూవీ మెడకు చుట్టుకుంది.
ఇటీవల రిలీజ్ అయిన ఈ చికిరి చికిరి సాంగ్ లిరిక్స్‌లో… “సరుకు సామాను చూసి.. మీసం లేచి వేసే కేక.. చికిరి చికిరి గుండె.. సురకేట్టేసాక” అంటూ ఉంటుంది. ఇందులో సరుకు, సామాను అనే పదాలపై ఇప్పుడు అభ్యంతరాలు వస్తున్నాయి. సాంగ్ బయటికి వచ్చిన తర్వాత 24 గంటల్లోనే 46 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇప్పటి వరకు ఈ చికిరి చికిరి సాంగ్‌కు కేవలం తెలుగులో 119 మిలియన్లు.. అన్ని భాషల్లో కలిపి 175 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
చికిరి చికిరి సాంగ్ ట్రోల్స్‌పై పెద్ది టీం రియాక్షన్
అయితే, శివాజీ కామెంట్స్ తర్వాత ఈ సాంగ్‌పై ట్రోల్స్ వచ్చాయి. రామ్ చరణ్ సాంగ్ కూడా అమ్మాయిలను కించపరిచేలా ఉంది అంటూ కొంత మంది సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్ మెగా ఫ్యాన్స్, రామ్ చరణ్ అభిమానులు కౌంటర్ ఇస్తూనే ఉన్నారు.
తాజాగా పెద్ది మూవీ టీం కూడా ఈ సరుకు, సామాను ట్రోల్స్‌పై రెస్పాండ్ అయింది. ఆ ట్రోల్స్ గురించి ఆలోచించే సమయం తమకు లేదని, ప్రస్తుతం ఫోకస్ మొత్తం సినిమాపైనే ఉందని మేకర్స్ తమ సన్నిహితులతో అన్నారట. అలాగే, ఆ ట్రోల్స్ అన్నింటినీ తాము లైట్ తీసుకుంటున్నట్టు చెప్పారట. పెద్ది సినిమా రిలీజ్‌కి ఇంకా చాలా టైం ఉందని, ఇప్పుడు వీటిపై స్పందిస్తూ టైం వృథా చేయలేమని అన్నారట.
పెద్ది సినిమా షూటింగ్, రిలీజ్ అప్‌డేట్స్
కాగా, పెద్ది టీం ఇటీవలే ఢిల్లీలో షెడ్యూల్‌ను కంప్లీట్ చేసుకుంది. అరుణ్ జైట్లీ స్టేడియం, తెలంగాణ, ఏపీ భవన్‌తో పాటు ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం అండ్ లైబ్రరీలో షూటింగ్ చేశారు. అలాగే ప్రతిష్టాత్మక ప్రైమ్ మినిస్టర్ కార్యాలయంలో కూడా పెద్ది మూవీ షూటింగ్ జరిగింది. ఈ సినిమాకు సంబంధించి ఇంకా 30 నుంచి 40 శాతం షూటింగ్ చేయాల్సి ఉంది. కాగా, ఈ సినిమాను వచ్చే ఏడాది రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఇదిలా ఉండగా, ప్రస్తుతం పెద్ది టీం రెస్పాన్స్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. ఇప్పుడున్న టైంలో సామాను, సరుకు ట్రోల్స్‌పై స్పందించకపోవడమే బెటర్ ఆప్షన్ అని చెబుతున్నారు.
మొత్తంగా, ‘సామాన్ల’ పదంపై మొదలైన వివాదం ‘చికిరి చికిరి’ సాంగ్‌ను చుట్టుముట్టినా, పెద్ది టీం మాత్రం దీన్ని తేలికగా తీసుకుంటూ తమ సినిమా విజయంపైనే దృష్టి పెట్టింది. రామ్ చరణ్ అభిమానులు కూడా టీం నిర్ణయానికి మద్దతుగా నిలుస్తున్నారు.

