
📌 Key Points
- సింగర్ చిన్మయి మార్ఫింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
- ఈ ఫోటోలపై స్పందించిన చిన్మయి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
- డబ్బుల కోసమే తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని చిన్మయి ఆరోపించారు.
- మార్ఫింగ్ ఫోటోల విషయంలో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన చిన్మయి.
సింగర్ చిన్మయికి సంబంధించిన కొన్ని మార్ఫింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. ఈ ఫోటోలపై స్పందించిన చిన్మయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బుల కోసమే తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఇలా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ విషయంపై చిన్మయి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
చిన్మయి: వివాదాలతో కొత్తేమీ కాదు
Chinmayi: సింగర్ చిన్మయి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సౌత్ సినీ ఇండస్ట్రీలో సింగర్ గా కొనసాగుతూ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.. కెరీర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న చిన్మయి నిత్యం వివాదాలలో నిలుస్తూ ఉంటారు.. ఈమె మహిళలకు ఎంతో మద్దతుగా నిలుస్తూ మహిళల గురించి ఎవరైనా ఏదైనా తప్పుగా మాట్లాడితే అవతల వైపు ఎవరు ఉన్నారనే విషయాన్ని కూడా గమనించకుండా తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే చిన్మయి కూడా వివాదాలలో నిలుస్తుంటారు.
ఇలా చిన్మయి తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పిన నేపథ్యంలో ఈమె కూడా చాలా మందికి టార్గెట్ అవ్వటమే కాకుండా తనపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. ఇటీవల కొంతమంది తన గురించి తన పిల్లల గురించి సోషల్ మీడియా వేదికగా దారుణమైన విమర్శలు చేయడంతో ఈమె ఏకంగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా చిన్మయికి సంబంధించిన కొన్ని బోల్డ్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే చిన్మయి ఈ ఫోటోలపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా చిన్మయి తన బోల్డ్ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్.. ఈరోజు నాకు ఒక పేజీ నుంచి ఈ మార్ఫింగ్ ఫోటో వచ్చింది వెంటనే నేను దీనిని పోలీసులకు ట్యాగ్ చేశానని తెలిపారు. ఇక ఈ విషయంపై పోలీసులు చర్యలు తీసుకుంటారా లేదా అన్న సంగతి పక్కన పెడితే గత కొద్దిరోజులుగా నా కుటుంబంపై చాలామంది ఎన్నో రకాలుగా విమర్శలు చేస్తున్నారు. ఒక సినిమా వేడుకలో తన భర్త మంగళసూత్రం వేసుకోవడం గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి అప్పటినుంచి నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్నారని చిన్మయి తెలిపారు.
మార్ఫింగ్ ఫోటోలపై సింగర్ ఆగ్రహం
I got a morphed image from a page today and tagged the cops – whether legal action happen will happen or not is not the issue
But I made this video for girls and their families to safeguard against the ‘Lanja Munda’ spewing people here who have been paid to do this for the past… pic.twitter.com/unjeJANNHP
డబ్బులు కోసమే టార్గెట్ చేస్తున్నారా?
— Chinmayi Sripaada (@Chinmayi) December 10, 2025
ఇలా గత కొద్దిరోజులుగా నా కుటుంబాన్ని అసభ్యకరమైన పదాలతో దూషించడం కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం కొంతమంది డబ్బులు తీసుకుంటున్నారని, డబ్బులు తీసుకుని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎవరైతే డబ్బులు తీసుకుని నా గురించి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారో అలాంటి వారి నుంచి అమ్మాయిలను కాపాడటానికి తాను ఈ వీడియో చేస్తున్నానని ఈమె తెలియజేశారు.. ఇలా ఒక మహిళను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఈ విధమైనటువంటి ఇబ్బందులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఎంతోమంది ఈమెకు మద్దతుగా నిలిచారు. మరి ఈ విషయంపై పోలీసులు చర్యలు తీసుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది. గత కొద్ది రోజుల క్రితం చిన్మయి స్వయంగా సజ్జనార్ ను కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
మార్ఫింగ్ ఫోటోల వ్యవహారంపై చిన్మయి స్పందన ఆమె నిస్వార్ధ వైఖరిని తెలియజేస్తుంది. తన కుటుంబాన్ని టార్గెట్ చేసే ప్రయత్నాలను ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.


