
తెలుగు సినీ రంగంలో 47 ఏళ్లుగా రాణిస్తున్న మెగాస్టార్ చిరంజీవి, తన తొలి సినిమా ‘ప్రాణం ఖరీదు’ గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన సినీ జీవితంపై, అభిమానుల ప్రేమపై ఆయన పంచుకున్న ఆలోచనలు చాలా ప్రేరేపకంగా ఉన్నాయి.
Key Points
చిరంజీవి గారి 47వ సినీ జయంతి వేడుకలు.
'ప్రాణం ఖరీదు' సినిమాతో తెలుగు తెరకు పరిచయం.
అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు.
47 ఏళ్ల సినీ జర్నీ
సినీ రంగంలో స్టార్ అనే హోదా చాలామందికి వస్తుంది. కానీ ఆ గుర్తింపును కెరీర్ మొత్తం కొనసాగించాలంటే అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఇక ఇండస్ట్రీలో మెగాస్టార్ అనిపించుకునే అదృష్టం కొందరికే ఉంటుంది. మన తెలుగు సినీరంగంలో అలాంటి ఘనత సొంతం చేసుకున్న హీరో ఆయనొక్కరే. మన టాలీవుడ్‌లో ఇప్పటికీ.. ఎప్పటికీ ఆయనే మెగాస్టార్. ఆయనే మన కొణిదెల శివ శంకర వరప్రసాద్ అలియాస్ చిరంజీవి.
చిరంజీవి తన కెరీర్ మొదలుపెట్టి 47 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. 22 సెప్టెంబర్ 1978న ప్రాణం ఖరీదు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యానని ట్వీట్ చేశారు. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి మీ ముందు మెగాస్టార్‌గా నిలబెట్టిందన్నారు. అనుక్షణం నన్ను ఆదరించి, అభిమానించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటానని పోస్ట్ చేశారు.
‘ప్రాణం ఖరీదు’ సినిమా ప్రస్తావన
చిరంజీవి తన ట్వీట్‌లో రాస్తూ..’22 సెప్టెంబర్ 1978 ‘కొణిదెల శివ శంకర వరప్రసాద్’ అనబడే నేను.. ప్రాణం ఖరీదు.. చిత్రం ద్వారా ‘చిరంజీవిగా’ మీకు పరిచయం అయ్యి నేటితో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి.. మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా , ఒక మెగాస్టార్‌గా.. అనుక్షణం నన్ను ఆదరించి, అభిమానించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను. నేటికి 155 సినిమాలను నేను పూర్తి చేసుకున్నాను అంటే… అందుకు కారణం నిస్వార్ధమైన మీ ప్రేమే కారణం. ఈ 47 ఏళ్లలో నేను పొందిన ఎన్నో అవార్డులు, గౌరవమర్యాదలు నావీ కావు, మీ అందరివీ, మీరందించినవి. మనందరి మధ్య ఈ ప్రేమానుబంధం ఎల్లప్పటికీ ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటూ… కృతజ్ఞతలతో మీ చిరంజీవి’ అంటూ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
అభిమానులకు కృతజ్ఞతలు
కాగా.. మెగాస్టార్‌గా అభిమానుల గుండెల్లో పేరు సంపాదించుకున్న చిరంజీవి.. ప్రస్తుతం విశ్వంభర, మనశివశంకర వరప్రసాద్ గారు అనే సినిమాలు చేస్తున్నారు. 70 ఏళ్ల వయసులో తన యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా రాణిస్తున్నారు. ఇవాళ తన తొలి సినిమా పూర్తై 47 ఏళ్లు కావడంతో ఆ సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు.
చిరంజీవి తన సినీ ప్రయాణంలో అభిమానుల ప్రేమకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడని తెలిపారు. భవిష్యత్తులోనూ అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని ఆశిద్దాం.


