|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అనిల్‌ రావిపూడి స్పీడ్‌కు చిరంజీవి బ్రేకులు.. కారణం ఇదేనా?

Published: 25-05-2025, 11:21 PM
అనిల్‌ రావిపూడి స్పీడ్‌కు చిరంజీవి బ్రేకులు.. కారణం ఇదేనా?

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిరంజీవి సినిమా MEGA157 ప్రమోషన్స్‌లో అతని దూకుడుకు చిరంజీవి బ్రేక్ వేశారట. ఇందుకు కారణం చిరంజీవి తదుపరి చిత్రం ‘విశ్వంభర’ ప్రమోషన్స్‌పై ప్రభావం పడకుండా ఉండటమేనని తెలుస్తోంది.

Key Points

1

అనిల్ రావిపూడి చిరంజీవి సినిమా (MEGA157) ప్రమోషన్స్‌లో చాలా యాక్టివ్‌గా ఉన్నారు.

2

చిరంజీవి తన తదుపరి సినిమా 'విశ్వంభర' ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

4

చిరంజీవి అనిల్ రావిపూడికి ప్రమోషన్స్‌పై కొంత బ్రేక్ తీసుకోమని సూచించారు.

MEGA157 ప్రమోషన్స్‌లో అనిల్ రావిపూడి యాక్టివిటీ

సినిమాను ప్రేక్షకుల వద్దకు చేర్చడంలో  దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) శైలి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన సినిమా ప్రకటన నుంచే అదిరిపోయే ప్రమోషన్స్‌లతో ప్రేక్షకుల అభిరుచిని పట్టేస్తాడు. ఈ క్రమంలో నటీనటులతో ఆయన కూడా ప్రమోషన్స్‌లో పాల్గొని, నవ్వులు పంచుతూ ఆయా చిత్రాలపై ఆసక్తి రేకెత్తిస్తుంటారు. అలాంటి మ్యాజిక్‌ చేసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాను మారుమూల ప్రాంతం వారికి కూడా కనెక్ట్‌ అయ్యేలా చేశాడు. అయితే, తాజాగా ఆయన మెగాస్టార్‌ చిరంజీవితో (MEGA157) సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్స్‌ విషయంలో అనిల్‌ దూకుడుతో అదరగొడుతున్నాడు. అయితే, దానికి కాస్త బ్రేక్‌ ఇవ్వాలని చిరు కోరారట. కావాలంటే కొంత గ్యాప్‌ ఇచ్చి మళ్లీ మొదలు పెట్టమని సూచించారట.

చిరంజీవి ఆందోళన: ‘విశ్వంభర’ ప్రమోషన్స్‌పై ప్రభావం?

అనిల్‌ రావిపూడి స్పీడ్‌కు చిరు బ్రేకులు వేయడం వెనుక కూడా కారణం ఉందని తెలుస్తోంది. చిరు కొత్త సినిమా విశ్వంభర( Vishwambhara) త్వరలో విడుదల కానుంది. ఈ మూవీ పట్ల మొదట్లో భారీ అంచనాలే ఉండేవి. కానీ, ప్రస్తుతం చిరు అభిమానుల్లో కూడా సినిమాపై అంతగా ఆసక్తి లేదని చెప్పవచ్చు. అనిల్‌ రావిపూడి తన సినిమా కోసం చేస్తున్న ప్రమోషన్స్‌ వల్ల విశ్వంభర మీద ప్రభావం పడుతుంది. అందరూ మెగా157 ప్రాజెక్ట్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. నయనతారతో ప్రమోషన్స్‌ ఆపై సినిమా షూటింగ్‌ ప్రారంభ సమయంలో చిరు కళ్ళమీద క్లాప్ కొట్టి దాని చిన్న క్లిప్ రూపంలో వదలడం.. ఇలాంటివి అన్నీ మెగా ఫ్యాన్స్‌లో జోష్‌ నింపుతున్నాయి. కానీ, విశ్వంభరపై అలాంటి జోష్‌ కనిపించడం లేదు. అందుకే అనిల్‌ను కాస్త బ్రేక్‌ తీసుకోవాలని చిరు సూచించారట.

చిరంజీవి సూచన: ప్రమోషన్స్‌కు బ్రేక్‌

విశ్వంభర టీజర్ తర్వాత ఎలాంటి పబ్లిసిటీని ఆ మూవీ మేకర్స్‌ చయలేదు. అయితే, ఈ సినిమా దర్శకుడు వశిష్ఠపై ఫ్యాన్స్‌ నమ్మకం పెట్టుకున్నారు. తప్పకుండా హిట్‌ అవుతుందని సాధారణ ప్రేక్షకులలో కూడా అంచనాలు ఉన్నాయి. కానీ, ప్రమోషన్స్‌ విషయంలో స్పీడ్‌ పెంచితేనే మార్కెట్‌ పెరిగే ఛాన్స్‌ ఉంటుంది. రీసెంట్‌గా కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో నిర్మాత విక్రమ్ రెడ్డి ఒక బుక్ లాంచ్ చేసి ఫోటోలు విడుదల చేశారు. కానీ, అందులో ఉన్న సారాంశం ఎంటి..? దాని ప్రత్యేకత ఏంటి అనేది మాత్రం చెప్పలేదు. ఇలా అయితే ఎలా అంటూ విశ్వంభర ప్రమోషన్స్‌లో వేగం పెరగాలని అభిమానులు కూడా కోరుతున్నారు. సినిమా విడుదల విషయంలో కూడా ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. జులైలో విడుదల కావచ్చు అనే టాక్‌ అయితే వస్తుంది.

చిరంజీవి తన సినిమా ‘విశ్వంభర’ విజయం కోసం అనిల్ రావిపూడికి ప్రమోషన్స్‌పై కొంత విరామం ఇవ్వమని సూచించడం ఆసక్తికరంగా ఉంది. రెండు సినిమాల విజయానికి ఈ నిర్ణయం ఎంతవరకు సహాయపడుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.