|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Chiranjeevi: సౌందర్య సినిమా చూసి చేతులు కాల్చుకున్న చిరంజీవి, ఇదెక్కడి గొడవరా అని తలపట్టుకున్న డైరెక్టర్

Published: 14-12-2025, 5:08 AM
Chiranjeevi: సౌందర్య సినిమా చూసి చేతులు కాల్చుకున్న చిరంజీవి, ఇదెక్కడి గొడవరా అని తలపట్టుకున్న డైరెక్టర్
  • దర్శకుడు కోడి రామకృష్ణ అమ్మోరు, అంజి వంటి గ్రాఫిక్స్ చిత్రాలకు పేరు పొందారు.
  • సౌందర్య నటించిన ‘అమ్మోరు’ చిత్రం చిరంజీవికి చాలా బాగా నచ్చింది.
  • కోడి రామకృష్ణ అభ్యంతరాలున్నా, చిరంజీవి గ్రాఫిక్స్ మూవీ ‘అంజి’ చేయడానికి అంగీకరించారు.
  • ‘అంజి’ ప్రొడక్షన్ ఆలస్యం, ప్లానింగ్ లోపాలతో భారీగా నిరాశపరిచింది.

దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన చిరంజీవి ‘అంజి’ సినిమా వైఫల్యంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సౌందర్య ‘అమ్మోరు’ విజయం తర్వాత చిరంజీవి గ్రాఫిక్స్ చిత్రం చేయడానికి ఎలా అంగీకరించారు, అలాగే ఆ చిత్రం నిరాశపరచడానికి గల కారణాలను ఆయన వివరించారు.

కోడి రామకృష్ణ గ్రాఫిక్స్ చిత్రాల పంథా

తెలుగు సినిమా చరిత్రలో దర్శకుడు కోడి రామకృష్ణది సరికొత్త పంథా. కోడి రామకృష్ణ ఫ్యామిలీ చిత్రాలు చేసినా, కమర్షియల్ సినిమాలు చేసినా అందులో వైవిధ్యం ఉంటుంది. తన కెరీర్ రెండవ దశలో కోడి రామకృష్ణ గ్రాఫిక్స్ మాయాజాలం చేశారు. ఆయన తెరకెక్కించిన గ్రాఫిక్స్ చిత్రాలు టాలీవుడ్ లో సరికొత్త స్టాండర్డ్స్ సెట్ చేశాయి.

అమ్మోరు, అంజి, దేవి, అరుంధతి లాంటి అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించారు. ఈ చిత్రాల్లో ఉండే గ్రాఫిక్స్ ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. అయితే వీటిలో చిరంజీవితో చేసిన అంజి చిత్రం మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. కంటెంట్ బ్యాడ్ గా ఏమీ లేదు. చాలా అద్భుతమైన కథ. టేకింగ్ కూడా బావుంది. గ్రాఫిక్స్ అయితే వండర్ అనిపించేలా ఉంటాయి. కానీ పూర్తిగా ప్లానింగ్ ఫెయిల్యూర్. ఏళ్ళ తరబడి షూటింగ్ ఆలస్యం కావడంతో ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయింది. అంజి రిలీజయ్యే సమయానికి ఈ మూవీపై అంచనాలు అంతగా లేవు. అందుకే ఈ చిత్రం నిరాశ పరిచింది.

అమ్మోరు విజయం, చిరంజీవి అంజి ఎంపిక

దీని గురించి డైరెక్టర్ కోడి రామకృష్ణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సౌందర్యతో తెరకెక్కించిన అమ్మోరు రిలీజ్ అయ్యాక చిరంజీవితో సినిమా గురించి చర్చలు మొదలయ్యాయి. అమ్మోరు చిత్రం అద్భుత విజయం సాధించింది. ఇది కూడా గ్రాఫిక్స్ బేస్డ్ చిత్రమే. ఒళ్ళు గగుర్పొడిచే సీన్లతో కోడి రామకృష్ణ ఈ చిత్రాన్ని మెమొరబుల్ మూవీగా మలిచారు. ఈ మూవీ చిరంజీవికి చాలా బాగా నచ్చింది.

నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి వెళ్లి చిరంజీవిని డేట్లు అడిగారు. ఆయన డేట్లు ఇవ్వడానికి అంగీకరించారు. కోడి రామకృష్ణతో గ్రాఫిక్స్ మూవీ ప్లాన్ చేస్తాను అని శ్యామ్ ప్రసాద్ రెడ్డి చిరంజీవికి చెప్పారు. దానికి కూడా చిరంజీవి అంగీకారం చెప్పారు. ఇదే విషయాన్ని శ్యామ్ ప్రసాద్ రెడ్డి నాకు చెప్పారు. చిరంజీవితో గ్రాఫిక్స్ మూవీనా ? ఇదెక్కడి గోడవరా అని అనుకున్నా. చిరంజీవితో సినిమా చేస్తే మంచి కమర్షియల్ అంశాలు ఉండే సినిమా తీయాలి.

అంజి వైఫల్యానికి అసలు కారణాలు

అప్పటికి చిరంజీవి కోసం డ్యూయెల్ రోల్ లో అద్భుతమైన కథ ఒకటి రాసుకున్నా. అది చేద్దాం అని శ్యామ్ ప్రసాద్ రెడ్డికి చెప్పా. లేదు.. చిరంజీవి గారికి నేను మాట ఇచ్చేశాను. మనం గ్రాఫిక్స్ మూవీనే చేయాలి అని అన్నారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డికి తెలియకుండా చిరంజీవిని కలిశా. గ్రాఫిక్స్ మూవీ అంటే చాలా కష్టం అవుతుంది. మీరు గంటలు గంటలు సెట్స్ లో నిలబడాలి. ఒక కొత్త ఆర్టిస్ట్ లాగా చేయాలి. మీ ఇమేజ్ ని మరిచిపోవాలి. ఇది చాలా కష్టం, మనం వేరే మంచి కథతో సినిమా చేద్దాం అని రిక్వస్ట్ చేశా. అమ్మోరు సినిమా ప్రభావంతో చిరంజీవి గారు కూడా గ్రాఫిక్స్ మూవీ కోసమే పట్టుబట్టారు. నేను కొత్త ఆర్టిస్ట్ లాగే చేస్తాను అని హామీ ఇచ్చారు.

అంజి చిత్రానికి సింగపూర్, మలేషియా, అమెరికా లాంటి దేశాల్లో గ్రాఫిక్స్ వర్క్ జరిగింది అని కోడి రామకృష్ణ తెలిపారు. అంజిపై విపరీతమైన అంచనాలు ఉండేవి. ఆ అంచనాలని సినిమా అందుకోలేకపోయింది. కానీ ఏళ్ళు గడిచే కొద్దీ అంజి అద్భుతమైన మూవీ అని అంతా ప్రశంసించినట్లు కోడి రామకృష్ణ తెలిపారు.

మొత్తం మీద, ‘అంజి’ చిత్రం అద్భుతమైన కథ, గ్రాఫిక్స్ ఉన్నప్పటికీ, ప్లానింగ్ లోపాలు, ఆలస్యం కారణంగా భారీ నష్టాలు చవిచూసింది. ఈ అనుభవం చిరంజీవి, కోడి రామకృష్ణ ఇద్దరికీ ఒక గుణపాఠం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.