|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: స్పిరిట్‌లో ప్రభాస్ తండ్రిగా మెగాస్టార్? ఫ్యాన్స్ కి పూనకాలే!

Published: 26-01-2026, 8:05 AM
షాకింగ్: స్పిరిట్‌లో ప్రభాస్ తండ్రిగా మెగాస్టార్? ఫ్యాన్స్ కి పూనకాలే!
  • స్పిరిట్‌లో ప్రభాస్ తండ్రిగా మెగాస్టార్ చిరంజీవి! ఇది నిజంగా బ్లాక్ బస్టర్ కాంబో అంటున్న సినీ విశ్లేషకులు.
  • సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ.. ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అదరగొట్టేందుకు సిద్ధం!
  • పాన్ ఇండియా స్థాయిలో విడుదల.. తెలుగు, తమిళం, హిందీ సహా పలు భాషల్లో స్పిరిట్ సంచలనం సృష్టించనుంది.
  • వచ్చే ఏడాది మార్చి 5న స్పిరిట్ విడుదల.. బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ రికార్డులు కొల్లగొట్టడం ఖాయం!

ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ మూవీ గురించి ఒక సంచలన వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఒక ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారట. ఈ వార్తతో ప్రభాస్ అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి.

స్పిరిట్ మూవీలో చిరు ఎంట్రీ.. ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే!

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా స్పిరిట్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గెటప్ లో ప్రభాస్ కనిపించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ మూవీలో ప్రభాస్ హీరోగా చేస్తుండగా తృప్తి డిమ్రి ( Tripti Dimri) హీరోయిన్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ, జపానీస్, కొరియన్ భాషలో కూడా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. వచ్చే సంవత్సరం మార్చి 5వ తేదీన ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా ప్రకటించేశాడు.

ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ పాత్ర దాదాపు 15 నిమిషాల పాటు ఉంటుందట. ఫ్లాష్ బ్యాక్ లో మెగాస్టార్ చిరంజీవి కనిపిస్తాడని టాక్ నడుస్తోంది. అందులో ప్రభాస్ తండ్రిగా మెగాస్టార్ చిరంజీవి కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. దీనిపై అతి త్వరలోనే ప్రకటన కూడా రానుందట. కాగా ది రాజా సాబ్ సినిమాతో ప్రభాస్ సంక్రాంతికి వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు. యావ‌రేజ్ టాక్ తెచ్చుకుంది.

15 నిమిషాల పాటు చిరంజీవి సందడి.. ఫ్లాష్ బ్యాక్ లో మెగా మ్యాజిక్!

సందీప్ రెడ్డి వంగా మార్క్.. స్పిరిట్ తో ప్రభాస్ మరో సంచలనం!

స్పిరిట్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారనే వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ కాంబినేషన్ ఎలా ఉండబోతుందో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.