
📌 Key Points
- చిరంజీవి, బాలకృష్ణ కలిసి నటించిన ఏకైక చిత్రం ‘త్రిమూర్తులు’!
- 1987లో విడుదలైన ఈ సినిమాలో అప్పటి టాప్ హీరోలంతా గెస్ట్ పాత్రల్లో మెరిసారు.
- వెంకటేష్, అర్జున్, రాజేంద్రప్రసాద్ హీరోలుగా నటించిన ఈ సినిమా హిందీ రీమేక్.
- భారీ తారాగణం ఉన్నా, సినిమా పరాజయం చెందడానికి కారణం విషయం లేకపోవడమే!
మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ.. ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించారంటే నమ్మగలరా? టాలీవుడ్‌లో అదొక అరుదైన సంఘటన. ఆ సినిమా గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం.
చిరంజీవి, బాలకృష్ణ కాంబినేషన్ మూవీ ఒకటేనా?
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ కలిసి నటిస్తే చూడాలని వారిద్దరి అభిమానులే కాదు, చిత్ర పరిశ్రమతోపాటు కామన్ ఆడియెన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ ఇద్దరు కలిసి నటిస్తే నిజంగానే అదొక అరుదైన చిత్రం. అదే సమయంలో సంచలనాత్మక మూవీ అవుతుంది. ఆ మధ్య బాలయ్య 50ఏళ్ల సెలబ్రేషన్ సమయంలో తనకు, బాలయ్య కాంబినేషన్ ఒక సినిమా ప్లాన్ చేయాలని ఇండస్ట్రీకి పిలుపునిచ్చారు చిరంజీవి. పలువురు దర్శకులకు కూడా చెప్పారు. ఆయన సరదాగానే చెప్పినా, అది నిజం అయితే మాత్రం సెన్సేషనల్ మూవీ అవుతుందని, చూడ్డానికి రెండు కళ్లు చాలవని చెప్పొచ్చు.
అయితే ఈ ఇద్దరు కలిసి నటించడం సాధ్యమా అంటే చెప్పలేం. భవిష్యత్‌లో జరిగినా జరగొచ్చు. ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. కానీ ఇలాంటి అరుదైన సంఘటన, ఇలాంటి అరుదైన మూవీ ఒకటి ఇప్పటికే వచ్చింది. చిరంజీవి, బాలకృష్ణ కలిసి ఒక సినిమాలో నటించారు. ఈ ఇద్దరు కాసేపు తళుక్కున మెరిశారు. వీరిద్దరే కాదు, అప్పటి టాప్ హీరోలంతా ఇందులో కనిపించడం విశేషం. ఇలాంటి అరుదైన సంఘటన దాదాపు 39ఏళ్ల క్రితమే చోటు చేసుకుంది. స్టార్ హీరోలు, హీరోయిన్లు ఒకే సినిమాలో మెరిశారు.
త్రిమూర్తులు సినిమాలో స్టార్ కాస్ట్ చూస్తే షాక్!
చిరంజీవి, బాలకృష్ణతోపాటు విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు, చంద్రమోహన్, మురళీ మోహన్, పరుచూరి బ్రదర్స్, గొల్లపూడి, పద్మనాభం, విజయశాంతి, రాధ, భాను ప్రియ, రాధికతోపాటు శారద, జయమాలిని, అనురాధ, వై విజయ వంటి వారు గెస్ట్ లుగా మెరిశారు. ఆ సినిమానే `త్రిమూర్తులు`. వెంకటేష్, అర్జున్, రాజేంద్రప్రసాద్ హీరోలుగా చేశారు. కె మురళీ మోహన్‌రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా 1987లో విడుదలైంది.
ఇన్నేళ్ల కెరీర్‌లో టాప్ స్టార్స్ నటించిన ఒకే ఒక సినిమా `త్రిమూర్తులు`గా చెప్పొచ్చు. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున వంటి టాప్ హీరోలు కలిసి నటించిన మూవీ కూడా ఇదొక్కటే. కానీ ఇది పెద్దగా ఆడలేదు. భారీ కాస్టింగ్ ఉన్నా సినిమాలో విషయం లేకపోవడంతో పరాజయం చెందింది. ఇది హిందీలో వచ్చిన `నసీబ్` చిత్రానికి రీమేక్. అక్కడ మంచి విజయం సాధించింది. కానీ తెలుగులో డిజాస్టర్‌గా నిలిచింది.
ఆ సినిమా ఎందుకు ఆడలేదో తెలుసా?
ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే, ఆయన ఈ ఏడాది సంక్రాంతికి `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఇది బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఇది ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. మరోవైపు బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ముంబాయి మాఫియా నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని తెలుస్తోంది. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటించనుంది.
చిరంజీవి, బాలకృష్ణ కలిసి నటించిన ఈ అరుదైన సినిమా గురించి తెలుసుకున్నారు కదా. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


