|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మమ్ముట్టి సాహసం: చిరు, బాలయ్య ఆ దారిలో ఎందుకు వెళ్లడం లేదు? టాలీవుడ్‌లో సంచలనం!

Published: 17-01-2026, 9:00 AM
మమ్ముట్టి సాహసం: చిరు, బాలయ్య ఆ దారిలో ఎందుకు వెళ్లడం లేదు? టాలీవుడ్‌లో సంచలనం!
  • మమ్ముట్టి నెగటివ్ రోల్ లో నటించిన ‘కలం కవల్’ చిత్రం 80 కోట్లకు పైగా వసూలు చేసింది.
  • వినాయకన్ పోలీస్ అధికారి పాత్రలో నటించడం సినిమాకు ప్లస్ అయింది.
  • తెలుగు ప్రేక్షకులు మాస్ ఎలిమెంట్స్, హీరోయిజం కోరుకుంటారు.
  • చిరంజీవి, బాలకృష్ణలు మమ్ముట్టిలా విలన్ పాత్రలు ఎందుకు చేయరని కొందరు ప్రశ్నిస్తున్నారు.

మమ్ముట్టి నెగటివ్ రోల్ లో నటించిన ‘కలం కవల్’ చిత్రం భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో చిరంజీవి, బాలకృష్ణ వంటి తెలుగు హీరోలు ఇలాంటి విలన్ పాత్రలు ఎందుకు చేయలేకపోతున్నారనే ప్రశ్న తలెత్తుతోంది.

మమ్ముట్టి ‘కలం కవల్’ సక్సెస్

Chiranjeevi and Balakrishna: గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైన మలయాళ చిత్రం కలం కవల్ ప్రేక్షకులను ఊహించని విధంగా ఆకట్టుకుంది. తక్కువ బడ్జెట్‌లో.. తక్కువ సమయంలో పూర్తైన ఈ సైకాలజికల్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. థియేటర్లలో ఈ సినిమా మొత్తం కలెక్షన్లు రూ.80 కోట్లకు పైగా రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో విడుదలై, తెలుగులో డబ్బింగ్ వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది.

ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ నటీనటుల ఎంపికే. సీనియర్ నటుడు మమ్ముట్టి ఇందులో పూర్తిగా నెగటివ్ పాత్రలో కనిపించారు. చల్లని మనసుతో..చాలా తెలివిగా నేరాలు చేసే సీరియల్ కిల్లర్‌గా ఆయన చేసిన నటన ప్రేక్షకులను భయపెట్టేలా ఉంది. ఇక పోలీస్ అధికారిగా వినాయకన్ నటించడం మరో విశేషం. సాధారణంగా వినాయకన్ చేసే పాత్రలకు ఇది భిన్నంగా ఉండటంతో, ఈ పాత్రల మార్పు సినిమాకు పెద్ద ప్లస్‌గా మారింది. హీరో ఇమేజ్ ఉన్న మమ్ముట్టి విలన్‌గా కనిపించడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.

నెగటివ్ రోల్స్‌లో మమ్ముట్టి సాహసం

కథ విషయానికి వస్తే ఇది పూర్తిగా కొత్త కథ కాదు. ఒక ప్రత్యేక విభాగానికి చెందిన అధికారి మహిళలను మోసం చేసి హత్యలు చేస్తూ..ఎలాంటి ఆధారాలు మిగల్చకుండా తప్పించుకుంటాడు. బయటకు మాత్రం సాధారణ కుటుంబ వ్యక్తిలా జీవిస్తాడు. ఈ పాత్రలో మమ్ముట్టి పూర్తిగా లీనమై నటించారు. ట్విస్టులు పెద్ద షాక్ ఇవ్వకపోయినా. కథనం ఆసక్తిగా సాగుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ప్రేక్షకులపై బలమైన ప్రభావం చూపుతుంది.

ఇంత వయసులో కూడా మమ్ముట్టి ఇలాంటి రిస్క్ ఉన్న పాత్రలను ఎంచుకోవడం నిజంగా ప్రశంసనీయం. ఇమేజ్ గురించి ఆలోచించకుండా కొత్త ప్రయోగాలు చేయడమే ఆయన ప్రత్యేకత. ఇదే కారణంగా సోషల్ మీడియాలో పోలికలు మొదలయ్యాయి. కొందరు ఇలాంటి పాత్రలను చిరంజీవి లేదా బాలకృష్ణ ఎందుకు చేయరని ప్రశ్నిస్తున్నారు.

తెలుగు హీరోల ఇమేజ్ భయం?

అయితే ప్రతి సినిమా ఇండస్ట్రీకి ప్రేక్షకుల అభిరుచులు వేరు. మలయాళ ప్రేక్షకులు లోతైన కథలు, మానసిక సంఘర్షణలు ఉన్న సినిమాలను ఆదరిస్తారు. తెలుగులో మాత్రం మాస్ ఎలిమెంట్స్, హీరోయిజం, వినోదం ఎక్కువగా కోరుకుంటారు. అందుకే మమ్ముట్టి చేసిన ‘కలం కవల్’ ఆయన ప్రేక్షకులకు బాగా సరిపోతుంది. థియేటర్ల తర్వాత ఓటీటీలో కూడా ఈ సినిమా అన్ని భాషల్లో మంచి స్పందన పొందే అవకాశం ఉంది.

మొత్తానికి మమ్ముట్టి చేసిన సాహసం చిరంజీవి, బాలకృష్ణ వంటి తెలుగు హీరోలు చేయడానికి వెనుకాడుతున్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. భవిష్యత్తులో మార్పు వస్తుందో లేదో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.