|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఫోకస్‌తో ఫిట్‌నెస్‌.. యోగాతో రెండూ వస్తాయి.. యోగాడేను సెలబ్రేట్‌ చేద్దామని చిరంజీవి పిలుపు

Published: 10-06-2025, 4:04 AM
ఫోకస్‌తో ఫిట్‌నెస్‌.. యోగాతో రెండూ వస్తాయి.. యోగాడేను సెలబ్రేట్‌ చేద్దామని చిరంజీవి పిలుపు

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, మెగాస్టార్ చిరంజీవి యోగా ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ, జూన్ 21న యోగా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుందామని పిలుపునిచ్చారు. ఫోకస్‌తో ఫిట్‌నెస్, యోగాతో రెండూ వస్తాయని ఆయన అన్నారు.

Key Points

1

చిరంజీవి యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

2

ఫోకస్‌తో ఫిట్‌నెస్, యోగాతో రెండూ సాధ్యమని చిరంజీవి అభిప్రాయం.

4

యోగా దినోత్సవం నాడు రికార్డు సృష్టించాలని ఏపీ ప్రభుత్వ లక్ష్యం.

చిరంజీవి యోగా పిలుపు

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (Yoga Day Celebrations) విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. (Yogandhra-2025) ‘యోగాంధ్ర-2025’ థీమ్‌తో మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మాసంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ ప్రముఖ నటుడు, మెగస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తన ఎక్స్ ఖాతా వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. యోగాడేను సెలబ్రేట్‌ చేసుకోవాలని పిలుపునిచ్చిన నటుడు పిలుపునిచ్చారు. ప్రపంచానికి భారత్‌ ఇచ్చిన బహుమతి యోగా.. అని కొనియాడారు. ఫోకస్‌తో ఫిట్‌నెస్‌ వస్తుందని, యోగాతో ఫోకస్, ఫిట్‌నెస్ రెండూ వస్తాయంటూ పేర్కొన్నారు. లోతుగా ఊపిరి పీల్చుకుందాం, పైకి ఎదుగుదాం.. జూన్ 21న యోగా దినోత్సవాన్ని కలిసి సెలబ్రేట్‌ చేసుకుందామని పోస్ట్ చేశారు. కాగా, ఏపీ ప్రభుత్వం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రికార్డు సృష్టించేలా నిర్వహించాలని ప్లాన్ చేసింది.

యోగా దినోత్సవం నాడు దాదాపు 5 లక్షల మందితో ఆర్‌కే బీచ్ నుంచి శ్రీకాకుళం బీచ్ వరకు అనుకూల ప్రాంతాలన్నింట్లో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆర్‌కే బీచ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ హజరవనున్నారు. విశాఖపట్నంలో సుమారు 2.5 లక్షల మంది యోగాలో పాల్గొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోడీ (Narendra Modi) చొరవతో జూన్‌ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి గుర్తించిన విషయం తెలిసిందే. 2015లో తొలిసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు 36 వేల మందితో ఒకే వేదికపై నిర్వహించిన కార్యక్రమం గిన్నిస్‌ రికార్డుగా నిలిచింది. 2023లో సూరత్‌లో 1,53,000 మందితో నిర్వహించి మరోసారి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుకు ఎక్కింది. ఈ సారి ఏపీ ఆ రికార్డును తిరగరాయాలని ప్లాన్ చేసింది.

యోగా దినోత్సవ వేడుకలు

ఏపీ ప్రభుత్వం యోగా ప్రణాళికలు

చిరంజీవి యోగా ప్రాముఖ్యతను తెలియజేస్తూ, యోగా దినోత్సవాన్ని అందరూ జరుపుకోవాలని కోరారు. ఏపీ ప్రభుత్వం విశాఖపట్నంలో నిర్వహించే వేడుకలు గిన్నిస్ రికార్డు సాధించాలని ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.