|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరు సంచలన వ్యాఖ్యలు: ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందా? లేదా? నిజం చెప్పిన మెగాస్టార్!

Published: 25-01-2026, 1:05 PM
చిరు సంచలన వ్యాఖ్యలు: ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందా? లేదా? నిజం చెప్పిన మెగాస్టార్!
  • మన శంకర వరప్రసాద్ గారు సినిమా 300 కోట్లకు పైగా వసూలు చేసిన సందర్భంగా సక్సెస్ సెలబ్రేషన్స్.
  • సినిమా ఇండస్ట్రీ అద్దం లాంటిది, మనం కష్టపడితే విజయం వరిస్తుందని చిరంజీవి వ్యాఖ్య.
  • తన కుమార్తె సుస్మిత నిర్మాతగా రాణించడం పట్ల చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు.
  • ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉండదని, మన ప్రవర్తనపైనే అన్నీ ఆధారపడి ఉంటాయని చిరు తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీ గురించి, క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆయన తన కూతురు సుస్మిత గురించి కూడా మాట్లాడారు.

‘మన శంకర వరప్రసాద్ గారు’ సక్సెస్ సెలబ్రేషన్స్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఉన్నారు. చాలా రోజుల తర్వాత చిరంజీవి ఇలాంటి సూపర్ సక్సెస్ అందుకోవడంతో మెగా అభిమానులతో పాటు చిత్ర బృందం కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి, నయనతార జంటగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ విడుదల అయిన సంగతి తెలిసిందే.. ఈ సినిమా ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకోవడమే కాకుండా 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టడంతో చిత్ర బృందం సెలబ్రేషన్స్ నిర్వహించారు. తాజాగా ఈ సినిమా సక్సెస్ ఈవెంట్లో భాగంగా చిరంజీవి సినిమాల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

ఇక ఈ సినిమా ద్వారా తన పెద్ద కుమార్తె సుస్మిత నిర్మాతగా ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇదే అంశం గురించి చిరంజీవి మాట్లాడుతూ .. సినిమా ఇండస్ట్రీ అనేది అద్భుతమైన ప్రపంచం ఇక్కడికి ఎంతమంది అయినా రావచ్చు అయితే ఇండస్ట్రీలో మనం సక్సెస్ అవుతామా లేదా అనేది మనం కష్టపడే దానిపైన ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిది ఇక్కడ మనం ఎలా అయితే ప్రవర్తిస్తామో మనకొచ్చే ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. మనం ఎంత కష్టపడి పనిచేస్తామో అంతే విజయాన్ని మనకు ఇండస్ట్రీ అందిస్తుందని చిరంజీవి తెలియచేశారు.

ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మనం కెరియర్ పై దృష్టి పెట్టకుండా చూసుకుందాంలే అనే ఆలోచనలో ఉంటే సక్సెస్ కూడా ఆమడ దూరంలో ఉంటుందని చిరు తెలిపారు. ఇందుకు తన కూతురి సుస్మితను ఉదాహరణగా చూపించారు తను అనుకుంటే ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సినిమా చేయొచ్చు కానీ తనకంటూ ఒక అనుభవం రావడం కోసం వెబ్ సిరీస్ లు చేస్తూ పట్టు సాధించి నిర్మాతగా నాతో సినిమా చేసింది. ఇప్పుడు ఫలితం కూడా అంతే మంచిగా అందుకు ఉంటుందని తెలిపారు. ఇండస్ట్రీ చాలా గొప్పది మనం కష్టపడితే సక్సెస్ వస్తుంది. కష్టపడకుండా మాపై నెగెటివిటీ ఉందనీ చాలామంది భావిస్తుంటారు. అలాంటి ఆలోచనలు ఉన్నారంటే అది కేవలం వారి తప్పిదం మాత్రమేనని చిరంజీవి తెలిపారు.

ఇండస్ట్రీపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు

నీ బిహేవియర్ పై ఆధారపడి ఉంటుంది..

ప్రతి ఒక్క విషయంలో నువ్వు ఎంతో నిబద్దతతో ఉంటే ఏ ఒక్కరు కూడా దానిని అడ్వాంటేజ్ గా తీసుకోరని, ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లాంటివి కూడా ఉండవని తెలిపారు. ఏదైనా నీ బిహేవియర్ మీదే ఆధారపడి ఉంటుందని తెలిపారు. మీ గుండె అభద్రతాభావంతో అలాగే ఉండాలేమో అనుకోవద్దు నువ్వు ఎంత ప్రొఫెషనల్ గా ఉంటావో అవతల వాళ్ళు కూడా అలాగే ఉంటారని, ఎవరైతే ఇండస్ట్రీలోకి రావాలి అనుకుంటారో అలాంటివారు దృఢ నిశ్చయంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టండి ఖచ్చితంగా మీకు విజయాలను అందిస్తుంది అంటూ చిరంజీవి ఈ సందర్భంగా ఇండస్ట్రీలో వచ్చే నెగెటివిటీ గురించి అలాగే కాస్టింగ్ కౌచ్ గురించి కూడా మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

క్యాస్టింగ్ కౌచ్ గురించి మెగాస్టార్ ఏమన్నారంటే?

youtube.com/live/jhCZDh17SPI

చిరంజీవి గారి మాటల్లో సినిమా ఇండస్ట్రీ కష్టపడేవారికి ఎప్పుడూ అండగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ తమ ప్రవర్తనతో మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.