|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శేఖర్‌ కమ్ముల అభిమానంపై చిరంజీవి ఎమోషనల్‌ నోట్‌.. గిఫ్ట్‌ గా ఏం ఇచ్చారో తెలుసా?

Published: 03-06-2025, 9:11 AM
శేఖర్‌ కమ్ముల అభిమానంపై చిరంజీవి ఎమోషనల్‌ నోట్‌.. గిఫ్ట్‌ గా ఏం ఇచ్చారో తెలుసా?

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన 25 ఏళ్ల సినీ జర్నీని మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో జరుపుకున్నారు. చిరంజీవిపై తన అభిమానాన్ని వ్యక్తపరిచిన శేఖర్ కమ్ములకు చిరంజీవి ఎమోషనల్ నోట్‌తో స్పందించారు.

Key Points

1

శేఖర్ కమ్ముల 25 ఏళ్ల సినీ ప్రస్థానం.

2

చిరంజీవిపై శేఖర్ కమ్ముల అభిమానం.

4

కుబేర సినిమా విడుదలకు సమీపిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమం.

శేఖర్ కమ్ముల 25 ఏళ్ల సినీ ప్రస్థానం

దర్శకుడు శేఖర్‌ కమ్ముల సెన్సిబుల్‌ దర్శకుడు. మంచి హార్ట్ టచ్చింగ్‌ పాయింట్‌తోపాటు వినోదాన్ని అందించడంలో ఆయనకు ఆయనే సాటి. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.

సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. చివరగా `లవ్‌ స్టోరీ`తో ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు `కుబేర` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ నెల 20న ఈ చిత్రం విడుదల కానుంది.

శేఖర్‌ కమ్ముల సినిమాల్లోకి వచ్చి 25ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 2000లో `డాలర్‌ డ్రీమ్స్` అనే చిత్రంతో ఆయన దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇప్పుడు `కుబేర`తో రాబోతున్నారు.

ఇందులో ధనుష్‌, నాగార్జున, రష్మిక మందన్నా నటిస్తున్నారు. సినిమా రిలీజ్‌కి దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆయన తన 25ఏళ్ల కెరీర్‌ని సెలబ్రేట్‌ చేసుకున్నారు.

అయితే అది మెగాస్టార్‌ చిరంజీవి సమక్షంలోనే కావడం విశేషం. ఇటీవలే చిరంజీవిపై తన అభిమానం చాటుకున్నారు శేఖర్‌ కమ్ముల. తాను సినిమాల్లోకి రావడానికి ఆయనే కారణమని తెలియజేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్ పెట్టారు.

చిరంజీవితో శేఖర్ కమ్ముల అనుబంధం

చిరంజీవిని కలిసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. తన ఫ్యాన్‌ మూమెంట్‌ని పంచుకున్నారు. ఈ సందర్భంగా శేఖర్‌ కమ్ముల చిరంజీవితో కలిసి దిగిన ఫోటోలను పంచుకుంటూ ఎమోషనల్‌ నోట్‌ని పంచుకున్నారు. ఇందులో ఆయన చెబుతూ,

`టీనేజ్‌లో ఒక్కసారి చిరంజీవిగారిని దగ్గరగా చూశాను. ఈయనతో సినిమా తీయాలి అనే ఫీలింగ్‌ కలిగింది. అంతే నేను ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లు అయ్యింది. ఈ జర్నీని సెలబ్రేట్‌ చేసుకోవాలని మా టీమ్‌ అంటే నాకు గుర్తొచ్చింది చిరంజీవి గారే.

కొన్ని జనరేషన్స్ ని ఇన్ స్పైర్‌ చేసిన పర్సనాలిటీ ఆయన. కలల వెంట పరిగెత్తు, సక్సెస్‌ మనల్ని ఫాలో అయి తీరుతుంది అన్న నమ్మకం ఇచ్చింది చిరంజీవి గారే.

నా 25ఏళ్ల జర్నీ సెలబ్రేషన్‌ అంటే ఆయన సమక్షంలోనే చేసుకోవాలి అనిపించింది. థ్యాంక్యూ సర్‌, ఈ మూమెంట్‌లోనే కాదు, నా టీనేజ్‌ నుంచి మీరు నా ముందు ఇలానే ఉన్నారు` అని పేర్కొన్నారు శేఖర్‌ కమ్ముల.

తాజాగా చిరంజీవి స్పందించారు. శేఖర్‌ కమ్ముల తనపై చూపిస్తున్న అభిమానానికి ముగ్దుడైన మెగాస్టార్‌ ఒక హార్ట్ టచ్చింగ్‌ నోట్‌ని పంచుకున్నారు. `మై డియర్‌ శేఖర్‌ కమ్ముల. మీలాంటి ఒక అభిమాని ఉండటం నాకు ఆనందకరం.

చిరంజీవి హృదయపూర్వక స్పందన

మీ ప్రస్థానానికి స్ఫూర్తినిచ్చానని తెలిసి మరింత సంతోషించాను. మీ 25ఏళ్ల జర్నీలో ఈ విధంగా నేనూ ఒక భాగమైనందుకు గర్వంగా ఉంది. సున్నితమైన వినోదంతోపాటు ఒక సోషల్‌ కామెంట్‌ని జత చేసి ఆలోచనాత్మకంగా తీసే మీ సినిమాలంటే నాకు ఎంతో ఇష్టం.

ఫిల్మ్ మేకింగ్‌లో మీకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని క్రియేట్‌ చేసుకున్న మీరు ఇలానే మరో 25ఏళ్లు మరెన్నో జనరంజకమైన సినిమాలు వ్రాస్తూ, తీస్తూ, మరెన్నో ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తున్నాను` అని పేర్కొన్నారు చిరంజీవి.

ఈ సందర్భంగా శేఖర్‌ కమ్ములతో దిగిన ఫోటోలను పంచుకున్నారు చిరు. ఇందులో దర్శకుడు శేఖర్‌ కమ్ములుకి ఆయన ఒక రేర్‌ పెన్‌ని గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ పెన్‌ బాక్స్ పై విషెస్‌ తెలియజేస్తూ నోట్‌ ని పంచుకున్నారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మెగా అభిమానులను ఆకట్టుకుంటుంది.

ప్రస్తుతం చిరంజీవి `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీగా ఈ మూవీ రూపొందుతుంది. త్రిష ఇందులో హీరోయిన్‌. వీఎఫ్‌ఎక్స్ వర్క్ కారణంగా సినిమా విడుదల డిలే అవుతుంది. గ్రాఫిక్స్ విషయంలో టీమ్‌ సంతృప్తి చెందిన తర్వాతనే మూవీ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించే అవకాశం ఉంది.

దీంతోపాటు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు చిరు. ఇటీవలే ఈ చిత్రం రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. అనిల్‌ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో, `గ్యాంగ్‌ లీడర్‌`, `ఘరానా మొగుడు` స్టయిల్‌ కామెడీతో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నట్టు తెలుస్తుంది.

చిరంజీవి మరియు శేఖర్ కమ్ముల మధ్య అభిమానం, గౌరవం ప్రేరణాత్మకం. శేఖర్ కమ్ముల 25 ఏళ్ల సినీ ప్రస్థానం మరియు కుబేర సినిమా విజయం కోసం శుభాకాంక్షలు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.