|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

48 ఏళ్ల సినీ ప్రస్థానం: ‘పునాదిరాళ్లు’ రోజులను గుర్తు చేసుకుని చిరు ఎమోషనల్!

Published: 11-02-2026, 8:05 AM
48 ఏళ్ల సినీ ప్రస్థానం: 'పునాదిరాళ్లు' రోజులను గుర్తు చేసుకుని చిరు ఎమోషనల్!
  • చిరంజీవి తన సినీ ప్రవేశానికి 48 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.
  • ‘పునాదిరాళ్లు’ సినిమాతో కెమెరా ముందుకు వచ్చిన తొలిరోజును గుర్తు చేసుకున్నారు.
  • దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రేక్షకుల ఆదరణకు ధన్యవాదాలు తెలిపారు.
  • చిరంజీవి పోస్ట్ వైరల్ కాగా, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి సినీ రంగంలోకి అడుగుపెట్టి 48 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన ‘పునాదిరాళ్లు’ సినిమాతో కెమెరా ముందుకు వచ్చిన రోజును గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

చిరంజీవి ఎమోషనల్ ట్వీట్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటే మహావృక్షం. ఎంత స్టార్‌డమ్ ఉన్నప్పటికీ, ఎంత మెగాస్టార్ అయినప్పటికీ.. తన పునాదిని మరిచిపోకుండా ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఆయన సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి 48 వసంతాలు పూర్తయిన సందర్భంగా, తను ఫస్ట్ టైమ్ కెమెరా ముందుకు వచ్చిన రోజు ఇదని (11-02-78) మెగాస్టార్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నారు. నా ప్రయాణానికి పునాది రాళ్లు పడిన రోజు ఇదని, జీవితంలో కెమెరా ముందు నిలిచిన తొలి రోజు.. ఇప్పటికీ నిన్న, మొన్న జరిగినట్లే అనిపిస్తుందని ఎమోషనల్ అయ్యారు. ఇదంతా ఒక చందమామ కథలాంటి అనుభూతిని ఇస్తుందని చెప్పుకొచ్చారు. చిరంజీవి చేసిన ఈ ట్వీట్‌కు నెటిజన్లు ‘జై చిరంజీవా’ అంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తన ట్వీట్‌లో ఏం చెప్పారంటే..

‘‘ఈరోజు ‘పునాదిరాళ్లు’ (Punadhirallu) సినిమా కోసం జీవితంలో కెమెరా ముందు నిలిచిన తొలి రోజు. ఆ రోజు నాలో కలిగిన ఆత్రుత, ఆనందం, బాధ్యత, భావోద్వేగం మాటల్లో వర్ణించలేనిది. ఆ క్షణం ఇప్పటికీ నిన్న, మొన్న జరిగిందేమో అన్నట్టు అనిపిస్తుంది. ఒక అందమైన చందమామ కథ లాంటి అనుభూతి. ఈ ప్రత్యేక సందర్భంలో, నాకు ఆ తొలి అవకాశం ఇచ్చిన ఆ చిత్ర దర్శక, నిర్మాతలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారి నమ్మకం, ప్రోత్సాహంతో వచ్చిన అవకాశంతో నటనలో నా ప్రయాణానికి పునాది రాళ్లు పడ్డాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ నన్ను ఆదరిస్తూ, ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు’’ అని చిరంజీవి (Chiranjeevi) తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. మెగా ఫ్యాన్స్ ఈ పోస్ట్‌కు ఆసక్తికరంగా కామెంట్స్ చేస్తున్నారు.

‘పునాదిరాళ్లు’ సినిమా జ్ఞాపకాలు

‘ఆ తొలి అడుగు, ఈ రోజు ఒక మహాయాత్రగా మారింది అన్నయ్య. ‘పునాదిరాళ్లు’తో మొదలైన మీ ప్రయాణం కోట్ల మందికి ప్రేరణ.. ఎప్పటికీ మా మెగాస్టార్ మీరు’, ‘ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ.. నీ నుంచి ఎప్పుడూ అదే కష్టం, కమిట్మెంట్..! అందుకే, నీ మీద అభిమానం మొదలైనప్పటినుంచి నువ్వంటే మాకు ఎప్పుడూ అదే ఇష్టం..!’, ‘నీ కష్టమే నిన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది’ అంటూ నెటిజన్లు, అభిమానులు కామెంట్లలో అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇక చిరంజీవి విషయానికి వస్తే, ఈ సంక్రాంతికి వచ్చిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) చిత్రంలో రీజనల్ ఫిల్మ్స్ కేటగిరీలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ ఉత్సాహంలో ఆయన తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేయనున్నారు.

ఈరోజు “పునాదిరాళ్లు” సినిమా కోసం జీవితంలో కెమెరా ముందు నిలిచిన తొలి రోజు.

ఆ రోజు నాలో కలిగిన ఆత్రుత, ఆనందం, బాధ్యత, భావోద్వేగం మాటల్లో వర్ణించలేనిది. ఆ క్షణం ఇప్పటికీ నిన్న, మొన్న జరిగిందేమో అన్నట్టు అనిపిస్తుంది.

ఒక అందమైన చందమామ కథ లాంటి అనుభూతి.

అభిమానుల స్పందన

ఈ ప్రత్యేక సందర్భంలో, నాకు… pic.twitter.com/Rsc6UYmgiK

— Chiranjeevi Konidela (@KChiruTweets) February 11, 2026

చిరంజీవి తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ చేసిన ఈ పోస్ట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఆయన మరిన్ని విజయాలు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆయన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.