|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరంజీవి సినిమాకి అలా చేస్తే ప్రొడ్యూసర్ చచ్చినట్లే, కథ పాడైపోతుందని తప్పుకున్న డైరెక్టర్

Published: 27-10-2025, 9:33 AM
చిరంజీవి సినిమాకి అలా చేస్తే ప్రొడ్యూసర్ చచ్చినట్లే, కథ పాడైపోతుందని తప్పుకున్న డైరెక్టర్

తెలుగులో మలయాళం తరహా కాన్సెప్ట్ చిత్రాలు ఎందుకు రాలేవో చిరంజీవి వివరించారు. తన బ్లాక్‌బస్టర్ ‘ఠాగూర్’ సినిమాకు సంబంధించిన ఆసక్తికర సంఘటనను పంచుకున్నారు. కథకు కీలకమైన మార్పులు, పాటలు చేర్చమని నిర్మాత పట్టుబట్టడంతో, దర్శకుడు మురుగదాస్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలిపారు.

Key Points

1

తెలుగులో కాన్సెప్ట్ చిత్రాలు రాకపోవడానికి కారణం చిరంజీవి వివరణ.

2

"రమణ" కథలో హీరో చనిపోతే నిర్మాతలకు నష్టమని చిరంజీవికి సూచన.

4

కథ మార్పులు, పాటలు ఇష్టం లేక మురుగదాస్ "ఠాగూర్" నుండి తప్పుకున్నారు.

తెలుగులో కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు ఎందుకు రాలేవు?

మలయాళం తరహాలో కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు తెలుగులో కూడా రావాలి అనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. మన తెలుగు సినిమాల్లో పాటలు, ఫైట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. వాటిని నిర్మాతలు కమర్షియల్ ఎలిమెంట్స్ గా పరిగణిస్తారు. తెలుగులో మలయాళం తరహా కథాంశం బలంగా ఉండే చిత్రాలు ఎందుకు రావడం లేదు అనే ప్రశ్నకు చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చారు.

చాలా ఏళ్ళ నుంచి బాలీవుడ్ తర్వాత అత్యధిక మార్కెట్ తెలుగు సినిమాకే ఉంది. తెలుగు సినిమాకి జరిగే బిజినెస్ ఎక్కువ. ఆడియన్స్ ప్రపంచ స్థాయిలో ఉన్నారు. మన దగ్గర థియేటర్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. వీరందరినీ పోషించాలి అంటే సినిమా బిజినెస్ ఎక్కువ జరగాలి. పెట్టిన బడ్జెట్ వెనక్కి రావాలి అంటే పాటలు, ఫైట్స్ లాంటివి తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితి. 30 రోజుల్లో సినిమా అయిపోతుంది, తక్కువ బడ్జెట్ పెడితే చాలు.. లాభాలు ఎక్కువగా ఆశించనక్కర్లేదు అని భావిస్తే తప్పకుండా చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. నాతోటి హీరోలంతా ముందుకు వస్తాయి.

చిరంజీవి ఠాగూర్ సినిమా వెనుక కథ

కానీ మనదగ్గర ఉన్న పరిస్థితి అది కాదు. ఉదాహరణకి తమిళంలో రమణ అనే చిత్రం తీసుకుందాం. ఈ మూవీకి ముందుగా దర్శకుడిగా మురుగదాస్ నే అనుకున్నాం. నా సినిమా అంటే ఆడియన్స్ తప్పనిసరిగా డ్యాన్సులు, పాటలు ఆశిస్తారు. రమణ మూవీ గురించి తెలుసుకున్న ఒక నిర్మాత నాతో.. సార్ ఆ సినిమాలో హీరో చనిపోతాడు. మిమ్మల్ని చనిపోయినట్లు చూపిస్తే నిర్మాతలం మేము చచ్చినట్లే. చాలా రిస్క్ అని అన్నారు.

దీనితో రమణ కథని క్లైమాక్స్ లో మార్చాం. కేవలం జైలు శిక్ష మాత్రమే పడేటట్లు చేశాం అని చిరంజీవి అన్నారు. కానీ దానికి మురుగదాస్ ఒప్పుకోలేదు. సార్ ఈ కథలో హీరో త్యాగమూర్తి సార్. ఉరికంబం ఎక్కి ప్రాణాలు అర్పిస్తాడు అని అన్నారు. అదే విధంగా పాటలు పెట్టి కథని పాడు చేయవద్దు సార్ అని చెప్పాడు. మేము దానికి అంగీకరించలేదు. దీనితో మురుగదాస్ ఠాగూర్ మూవీ చేయలేనని తప్పుకున్నారు. అప్పుడు మురగదాస్ స్థానంలోకి వివి వినాయక్ వచ్చారు.

మురుగదాస్ తప్పుకోవడం, వినాయక్ ప్రవేశం

ఠాగూర్ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఠాగూర్ మూవీలో చిరంజీవి డైలాగులు, మణిశర్మ సంగీతం హైలైట్ గా నిలిచాయి. ఈ చిత్రంలో శ్రీయ, జ్యోతిక హీరోయిన్లుగా నటించారు.

చిరంజీవి ‘ఠాగూర్’ వెనుక ఉన్న ఈ సంఘటన, తెలుగు సినిమాపై వాణిజ్య ఒత్తిళ్లను స్పష్టం చేస్తుంది. మురుగదాస్ తప్పుకున్నా, వి.వి.వినాయక్ దర్శకత్వంలో ‘ఠాగూర్’ ఘన విజయం సాధించి, బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.