|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కాజల్, తమన్నా ఎవరో తెలీదన్న చిరు! ఒక్కసారిగా షాక్ తిన్న ఫ్యాన్స్!!

Published: 29-01-2026, 12:35 PM
కాజల్, తమన్నా ఎవరో తెలీదన్న చిరు! ఒక్కసారిగా షాక్ తిన్న ఫ్యాన్స్!!
  • చిరంజీవి రాజకీయాల వల్ల హీరోయిన్ల పేర్లు మరిచిపోయానని అన్నారు.
  • ఖైదీ నెంబర్ 150 సమయంలో కాజల్ ఎవరు అని చిరంజీవి అడిగారు.
  • తమన్నా పేరు చెప్పినా ఆమె ఎవరని చిరంజీవి ప్రశ్నించారు.
  • చిరంజీవి వ్యాఖ్యలపై కాజల్, తమన్నా అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేశారు.

మెగాస్టార్ చిరంజీవి హీరోయిన్ల పేర్లు మర్చిపోయానని చెప్పడం సంచలనంగా మారింది. కాజల్ అగర్వాల్, తమన్నా పేర్లను ఆయన గుర్తుపట్టలేకపోయారు. రాజకీయాల్లో గ్యాప్ రావడం వల్లే ఇలా జరిగిందని ఆయన అన్నారు.

హీరోయిన్ల పేర్లు మరిచిపోయిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండరు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో నిలతొక్కుకొని ఇండస్ట్రీ పెద్దగా మారడం అంటే ఆశమాషీ విషయం కాదు. అలా సినీ నేపథ్యం లేకపోయినా ఇండస్ట్రీలోకి వచ్చి అంచలంచలుగా ఎదుగుతూ నేడు తెలుగు చిత్ర పరిశ్రమను శాసించే స్థాయిలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ఉన్నారు. ఆరు పదుల వయసులో కూడా చిరంజీవి ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈయన మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా చిరంజీవికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

దాదాపు నాలుగున్నర దశాబ్ద కాలం పాటు ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న చిరంజీవి హీరోయిన్ల పేర్లు మర్చిపోయాను అంటూ చెప్పడంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న తర్వాత ప్రజారాజ్యం అనే పార్టీని స్థాపించి రాజకీయాలలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇలా కొంతకాలం పాటు రాజకీయాలలో ఉన్న ఈయన తనకు రాజకీయాలు సెట్ కావని తెలుసుకొని తిరిగి సినిమాలలోకి వచ్చారు. ఇలా రీ ఎంట్రీ ఇచ్చిన ఈయన ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

రాజకీయాలే కారణమా?

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఖైదీ నెంబర్ 150 అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) నటించారు. అయితే ఈ సినిమా సమయంలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ అంటే ఎవరని అడిగేసాను .పూర్తిగా హీరోయిన్ల పేర్లను తాను మరిచిపోయానని తమన్నా పేరు చెప్పిన ఆమె ఎవరని అడిగానని చిరంజీవి తెలిపారు. రాజకీయాలలోకి వెళ్ళటం వల్లే కాస్త గ్యాప్ రావడంతో హీరోయిన్ల పేర్లు మర్చిపోయినట్టు చిరు ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేయడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.

ఇలా తమన్నా, కాజల్ ఎవరు అంటూ చిరంజీవి అడగారనే విషయం తెలిసిన వీరిద్దరి అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అయితే చిరంజీవి తమన్నా కాజల్ ఇద్దరితో కలిసి సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఖైదీ నెంబర్ 150 సినిమాతో కాజల్ అగర్వాల్ సందడి చేయగా తమన్నా(tamannaah) సైరా నరసింహారెడ్డి సినిమాతో పాటు భోళా శంకర్ సినిమాలో కూడా చిరంజీవితో కలిసి నటించిన సంగతి తెలిసిందే.

నిరుత్సాహంలో కాజల్, తమన్నా ఫ్యాన్స్

మొత్తానికి చిరంజీవి హీరోయిన్ల పేర్లు మర్చిపోవడం వారి అభిమానులను నిరాశకు గురిచేసింది. రాజకీయాల వల్ల వచ్చిన గ్యాప్ దీనికి కారణమని ఆయన తెలిపారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.