
📌 Key Points
- గ్యాంగ్ లీడర్ సినిమాతో చిరంజీవి కెరీర్ ట్రెండ్ సెట్టర్ అయింది, యూత్ లో భారీ క్రేజ్!
- విజయశాంతి, చిరంజీవి డ్యాన్స్ స్టెప్స్ కు ప్రేక్షకులు ఫిదా, పాటలు ఇంకా ట్రెండింగ్!
- మురళీ మోహన్ గారు గ్యాంగ్ లీడర్ లో చిరంజీవికి అన్నయ్యగా నటించారు, గుర్తుండిపోయే పాత్ర!
- బొమ్మరిల్లు కథనే గ్యాంగ్ లీడర్ గా విజయ బాపినీడు తెరకెక్కించారు, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఒక సంచలనం సృష్టించిన చిత్రం గ్యాంగ్ లీడర్. ఈ సినిమా వెనుక ఒక ఆసక్తికరమైన కథ దాగి ఉంది. ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం!
గ్యాంగ్ లీడర్ వెనుక అసలు కథ ఏంటో తెలుసా?
చిరంజీవి కెరీర్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన మూవీస్ అంటే.. మందుగా వెంటనే గుర్తుకు వచ్చేది గ్యాంగ్ లీడర్ .అప్పటి యూత్ ను ఉర్రూతలూగించిన ఈ సినిమా .. మెగా అభిమానులకు పూనకాలు తెప్పించింది. విజయ బాపినీడు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మాస్ సినిమా.. మంచి మ్యూజిక్ హిట్ గా కూడా నిలిచింది. ఈసినిమా పాటలు ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ ను అలరిస్తూనే ఉన్నాయి.
చిరంజీవి విజయశాంతి డ్యాన్స్ కు అభిమానులు ఫిదా అయ్యారు. సెంటిమెంట్ తో ప్యామిలీ ఆడియన్స్ ను ఏడిపించింది గ్యాంగ్ లీడర్ మూవీ. ఇక ఈసినిమా కథ వెనుక మరో పెద్ద కథ ఉంది. అదేంటి అనేది ఆమధ్య కాలంలో స్టార్ నటుడు మురళీ మోహన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
చిరంజీవి కెరీర్ లో గ్యాంగ్ లీడర్ ఒక ట్రెండ్ సెట్టర్!
గ్యాంగ్ లీడర్ కథను ఇంతకు ముందే బొమ్మరిల్లు సినిమాగా తెరకెక్కించాడు దర్శకుడు రాజాచంద్ర. ఆసినిమాలో శ్రీధర్ , మురళీ మోహన్, మాధవి లాంటి స్టార్ నటుడు యాక్ట్ చేశారు. ఈసినిమా ను హిట్ సినిమాల దర్శకుడు విజయబాపినీడు నిర్మించారు. అయితే ఇదే టైమ్ లో ఎన్టీఆర్ యమగోల రిలీజ్ అయ్యింది. ఈ రెండు సినిమాలకు గట్టి పోటీ నడిచింది. ఎన్టీఆర్ లాంటి పెద్ద స్టార్ సినిమాకు పోటీగా వెళ్లి.. హిట్ అయ్యింది సినిమా. అటువంటి సినిమా కథను మరోసారి తెరకెక్కిస్తానని విజయబాపినీడు నటుడు మురళీ మోహన్ తో ముందే చెప్పారట.
బొమ్మరిల్లు సినిమా కథను మళ్లీ తెరకెక్కిస్తానని దర్శకుడు విజయబాపినీడు మురళీమోహన్ దగ్గర ప్రస్తావించారట. ఈ సినిమా తీస్తే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని బాపినీడు మురళీ మోహన్ దగ్గర అన్నారట. మళ్లీ తీస్తే జనాలు చూస్తారా.. అని మురళీ మోహన్ సందేహం వ్యక్తం చేశారట. కావాలంటే చూడు.. చిరంజీవి లాంటి మాస్ హీోతో కథను కాస్త మార్పులు చేసి తీస్తాను.. అంది ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడు అని బాపినీడి అన్నారు. అన్నట్టుగానే చిరంజీవితో గ్యాంగ్ లీడర్ సినిమాను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసి.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు .
ఎన్టీఆర్, చిరంజీవి మధ్య పోటీ.. గెలిచింది ఎవరు?
బొమ్మరిల్లు.. గ్యాంగ్ లీడర్ రెండు సినిమాల్లో మురళీ మోహన్ నటించారు. బొమ్మరిల్లు సినిమాలో అందరికంటే చిన్నవాడైన తమ్ముడి పాత్రలో మురళీ మోహన్ నటిస్తే.. ఎన్నో ఏళ్ళ తరువాత రిలీజ్ అయిన గ్యాంగ్ లీడర్ సినిమాలో మాత్రం చిరంజీవికి పెద్దన్నయ్య పాత్రలో నటించారు. ఈసినిమా తరువాత మురళీ మోహన్ ను అందరు.. చిరంజీవి అన్నయ్య.. చిరంజీవికి అన్నయ్య అని పిలిచేవారట. చాలా కాలం తాను ఆడియన్స్ కు అలాగే గుర్తుండిపోయాను.. ఆ పాత్ర అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. గ్యాంగ్ లీర్ కు ఉన్న క్రేజ్ కూడా అలాంటిదే అని మురళీ మోహన్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. 70 ఏళ్ల వయసులో కూడా ఏమాత్రం తగ్గడంలేదు స్టార్ హీరో. రీసెంట్ గా మన శంకర వరప్రసాదుగారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు చిరంజీవి. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ సంక్రాంతి హిట్ గా నిలిచింది. ఇక ఈసమ్మర్ లో విశ్వంభర సినిమాతో సందడి చేయబోతున్న చిరంజీవి.. బాబీ డైరెక్షన్ లో మరో సినిమా చేస్తున్నారు. ఈమూవీ షూటింగ్ స్టార్ట్ కావాల్సి ఉంది.
గ్యాంగ్ లీడర్ సినిమా వెనుక ఇంత కథ ఉందా? ఇది నిజంగా షాకింగ్ కదా! మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

