|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరు నుండి అనిల్ రావిపూడికి లగ్జరీ గిఫ్ట్! మెగాస్టార్ మనసు దోచుకున్న డైరెక్టర్!!

Published: 25-01-2026, 11:35 AM
చిరు నుండి అనిల్ రావిపూడికి లగ్జరీ గిఫ్ట్! మెగాస్టార్ మనసు దోచుకున్న డైరెక్టర్!!
  • అనిల్ రావిపూడి దర్శకత్వంలో తొమ్మిది సినిమాలు విజయవంతమయ్యాయి.
  • చిరంజీవి హీరోగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ అయింది.
  • సినిమా సక్సెస్ మీట్‌లో అనిల్ రావిపూడికి చిరంజీవి రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చారు.
  • చిరంజీవితో సరదాగా గిఫ్ట్ గురించి అడిగినట్లు అనిల్ రావిపూడి తెలిపారు.

డైరెక్టర్ అనిల్ రావిపూడికి చిరంజీవి ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ఈ ఘటన సినిమా సక్సెస్ మీట్‌లో జరిగింది.

అనిల్ రావిపూడికి చిరు బహుమతి

Anil Ravipudi: డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకుడుగా ఇండస్ట్రీలో ఇప్పటివరకు తొమ్మిది సినిమాలకు దర్శకత్వం వహించగా ఈ తొమ్మిది సినిమాలో అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇక ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా అనిల్ రావిపూడి (Anil Ravipudi)దర్శకత్వంలో చిరంజీవి (Chiranjeevi) హీరోగా మన శంకర వరప్రసాద్ గారు(MSVPG) అనే సినిమాని చేశారు. ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కేవలం వారం రోజులలోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాటలో దూసుకుపోయింది. ఈ సినిమా 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో చిత్ర బృందంతో పాటు మెగా అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఇంతటి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో నేడు సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఇన్ని రోజులు చిరంజీవి దుబాయ్ లో ఉన్న నేపథ్యంలో ఈ వేడుక ఆలస్యమైంది ఇటీవల దుబాయ్ నుంచి చిరంజీవి రావడంతో మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి ముందుగానే చిరంజీవి అనిల్ రావిపుడికి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో డైరెక్టర్ కోసం చిరంజీవి రేంజ్ రోవర్ కారును (Range Rover Car)బహుమతిగా అందజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.

సక్సెస్ మీట్‌లో రేంజ్ రోవర్ గిఫ్ట్

ఇక చిరంజీవి గారు తనకు కారును బహుమతిగా ఇవ్వడం గురించి ఈ సినిమా సక్సెస్ కార్యక్రమంలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ తన ఆనందాన్ని తెలియజేశారు. సినిమా షూటింగ్ సమయంలో తాను చిరంజీవి గారితో గారాబం చేస్తూ ఉండేవాడిని సర్ నేను మీకు మంచి హిట్ ఇస్తే మీరు నాకు ఏమి ఇస్తారు అంటూ సరదాగా మాట్లాడేవాడిని అప్పుడు చిరంజీవి గారు నువ్వు హిట్ ఇవ్వవయ్యా అప్పుడు చెప్తాను అనేవారు. చిరంజీవి గారు అలా చెప్పడంతో ఓ రేంజ్ లో గిఫ్ట్ ఇస్తారనుకున్నాను కానీ ఏకంగా రేంజ్ రోవర్ ఇస్తారని ఊహించలేదు అంటూ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.

సంతోషం వ్యక్తం చేసిన అనిల్ రావిపూడి..

చిరంజీవి మనసు దోచుకున్న అనిల్

చిరంజీవి గారు ఫోన్ చేసి ఇంటికి రావయ్యా అంటూ పిలిచారు అదేంటి సాయంత్రం ఫంక్షన్ ఉంది కదా ఇక్కడికి పిలుస్తున్నారని అనుకున్నాను. ఇంటికి వెళ్ళగానే షాక్ అయ్యానని, ఇలా తనకు అద్భుతమైన కానుక ఇచ్చినందుకు చిరంజీవి గారికి అనిల్ రావిపూడి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ కారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్వయంగా ఈ కారు తాళాలు చిరంజీవి అనిల్ రావిపూడికి అందించారు. ఇక గతంలో కూడా ఈయన సినిమాలు మంచి సక్సెస్ కావడంతో పలువురు నిర్మాతలు అనిల్ రావిపూడికి కారు బహుమతిగా అందించిన సంగతి తెలిసిందే.

చిరంజీవి తనకు రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇవ్వడం పట్ల అనిల్ రావిపూడి సంతోషం వ్యక్తం చేశారు. సినిమా షూటింగ్ సమయంలో సరదాగా అడిగిన ప్రశ్నకు చిరంజీవి ఈ బహుమతి ఇచ్చారని ఆయన అన్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.