
మెగాస్టార్ చిరంజీవి గారు, డైరెక్టర్ శేఖర్ కమ్ముల 25వ వార్షికోత్సవాన్ని విశేషంగా జరుపుకున్నారు. చిరంజీవి గారు శేఖర్ కమ్ములకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి సోషల్ మీడియాలో తన అభిమానాన్ని వ్యక్తం చేశారు.
Key Points
చిరంజీవి గారు డైరెక్టర్ శేఖర్ కమ్ములకు స్పెషల్ పెన్ గిఫ్ట్ ఇచ్చారు.
శేఖర్ కమ్ముల 25 ఏళ్ల సినీ జర్నీని చిరంజీవి గారు అభినందించారు.
మెగాస్టార్ తన అభిమాన దర్శకుడితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
చిరంజీవి గారి ప్రోత్సాహం శేఖర్ కమ్ములకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలుస్తోంది.
శేఖర్ కమ్ముల 25వ వార్షికోత్సవం
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు రాష్ట్రాల్లో కోట్లాదిమందికి ఆయనే అభిమాన హీరో. ఆయన్ని ప్రేరణగా తీసుకొని సినీ పరిశ్రమలోకి వచ్చినవాళ్లు వేలల్లో ఉన్నారు. చాలా మంది దర్శకులు కూడా అయన ప్రేరణతోనే వచ్చి ఆయనతో కలిసి పనిచేసారు కూడా. అయన అభిమానుల్లో డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఒకరు.
ఇటీవల శేఖర్ కమ్ముల డైరెక్టర్ అయి 25 ఏళ్ళు అయిన సందర్భంగా మెగాస్టార్ ని కలిసి స్పెషల్ సెలబ్రేషన్ చేసుకున్నారు. ఈయనతో సినిమా తీయాలి అనుకున్నాను. నేను ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్ళు అయింది అని చెప్పడంతో కొన్ని జనరేషన్స్ ని ఇన్స్పైర్ చేసిన చిరంజీవి గారి దగ్గర సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాను అని చెప్పి మెగాస్టార్ ని కలిసిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు శేఖర్ కమ్ముల.
చిరంజీవి గారి స్పెషల్ గిఫ్ట్
Also See : ‘రానా నాయుడు’ సీజన్ 2 ట్రైలర్ చూశారా? మరోసారి బాబాయ్ – అబ్బాయి ఫైట్..
తాజాగా చిరంజీవి శేఖర్ కమ్ములకు స్పెషల్ పెన్ గిఫ్ట్ ఇచ్చారు. శేఖర్ కమ్ములతో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. మై డియర్ శేఖర్.. మీలాంటి ఒక అభిమాని వుండటం నాకూ అంతే ఆనందకరం. మీ ప్రస్థానానికి స్ఫూర్తి ఇచ్చానని తెలిసి మరింత సంతోషించాను. మీ 25 ఏళ్ళ జర్నీలో ఆ విధంగా నేనూ ఒక భాగమైనందుకు గర్వంగా ఉంది. సున్నితమైన వినోదంతో పాటు, ఒక సోషల్ కామెంట్ ని జత చేసి ఆలోచనాత్మకంగా తీసే మీ సినిమాలంటే నాకు ఎంతో ఇష్టం. ఫిలిం మేకింగ్ లో మీ కంటూ ఒక ప్రత్యేక శైలిని క్రియేట్ చేసుకున్న మీరు ఇలాగే మరో 25 ఏళ్ళు మరెన్నో జనరంజకమైన సినిమాలు వ్రాస్తూ, తీస్తూ, మరెన్నో ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తున్నాను. ఒక మైల్ స్టోన్ ని చేరుకున్నందుకు అభినందనలు. ఇంకో 25 ఏళ్ళు కూడా ఇలాగే ముందుకువెళ్లాలి అని రాసుకొచ్చారు.
సోషల్ మీడియాలో చిరంజీవి పోస్ట్
మెగాస్టార్ డైరెక్టర్ కి పెన్ గిఫ్ట్ ఇవ్వడమే కాకుండా ఆయన్ని అభినందిస్తూ అభిమాని అంటూ పోస్ట్ చేయడంతో చిరుని ఫ్యాన్స్, నెటిజన్లు అభినందిస్తున్నారు.
చిరంజీవి గారి అభినందనలు, గిఫ్ట్ శేఖర్ కమ్ములకు ప్రేరణగా నిలిచాయి. తెలుగు సినీ ప్రేక్షకులు ఈ మంచి సంబంధాన్ని ఆదరిస్తున్నారు.


