
📌 Key Points
- చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు మూవీ: ఫస్ట్ హాఫ్ కు సూపర్ హిట్ టాక్!
- చిరు ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, కామెడీ టైమింగ్ అదిరింది అని ఫ్యాన్స్ కామెంట్స్!
- మ్యూజిక్ హైలైట్, సినిమా మొదట్లో కాస్త స్లో అయినా తర్వాత పిచ్చెక్కిచింది!
- సంక్రాంతికి చిరు హిట్ కొట్టినట్టేనా? రేపటి రివ్యూ కోసం ఎదురుచూపులు!
మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా జనవరి 12న విడుదల కాబోతోంది. ఇప్పటికే ప్రీమియర్ షోలు పడ్డాయి. సినిమా చూసిన అభిమానులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. సినిమా ఎలా ఉందో చూద్దాం!
ఫస్ట్ హాఫ్ టాక్: ట్విట్టర్ రివ్యూస్!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా జనవరి 12 థియేటర్లలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు సినిమా ప్రీమియర్స్ షోలు వేశారు. అయితే ఇప్పటికే సినిమా ఫస్ట్ ఆఫ్ చూసిన అభిమానులు తమ అభిప్రాయాలను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు. సినిమా ఫస్ట్ ఆఫ్ బాగుందని చెబుతున్నారు. సినిమా మొదట్లో కాస్త అటు ఇటుగా ప్రారంభమైనా తరవాత బాగుందని అంటున్నారు.
సినిమాలో మ్యూజిక్ బాగుందని, చిరంజీవి పర్ఫామెన్స్ ఎనర్జిటిక్ గా ఉందని కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా చిరు కామెడీ టైమింగ్ చాలా బాగుందని చెబుతున్నారు. ఇక ఇప్పటికే రాజాసాబ్ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వస్తోంది. హారర్ర కామెడీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక మనశంకర వరప్రసాద్ గారు సినిమా పూర్తి రివ్యూ రేపు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే ఈ సంక్రాంతికి చిరు హిట్ కొట్టినట్టే.
చిరు కామెడీ టైమింగ్ కి ఫ్యాన్స్ ఫిదా!
సంక్రాంతికి మెగాస్టార్ బ్లాక్ బస్టర్ హిట్టేనా?
మన శంకర వరప్రసాద్ గారు సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రేపు సినిమా పూర్తి రివ్యూ రానున్న నేపథ్యంలో, సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి!


