
మెగాస్టార్ చిరంజీవి ఆసియా కప్ హీరో తిలక్ వర్మను ప్రత్యేకంగా సన్మానించారు. తమ సినిమా సెట్‌లో ఈ టీమిండియా క్రికెటర్ చేత కేక్ కట్ చేయించారు. ఈ అద్భుత ఘట్టంలో నయనతార, అనిల్ రావిపూడి వంటి ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Key Points
మెగాస్టార్ చిరంజీవి ఆసియా కప్ హీరో తిలక్ వర్మను ప్రత్యేకంగా సన్మానించారు.
చిరు తన సినిమా సెట్‌లో తిలక్ వర్మతో కేక్ కట్ చేయించారు.
నయనతార, అనిల్ రావిపూడి, సుష్మిత కొణిదెల వంటి ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
దుబాయ్‌లో పాకిస్తాన్‌తో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో తిలక్ వర్మ కీలక ప్రదర్శన చేశాడు.
మెగాస్టార్ చిరంజీవి సన్మానం
ఆసియా కప్ హీరో తిలక్ వర్మను మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా సన్మానించారు. ప్రస్తుతం మనశంకరవరప్రసాద్‌గారు మూవీలో నటిస్తోన్న చిరు.. ఈ టీమిండియా క్రికెటర్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా మూవీ సెట్‌లో కేక్ కట్ చేసిన తిలక్ వర్మకు.. ఆసియా కప్ ఫైనల్ నాటి ఫోటోను బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో నయనతార, అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి, సుష్మిత కొణిదెల పాల్గొన్నారు.
కాగా..ఇటీవల దుబాయ్‌లో పాకిస్తాన్‌తో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ అదరగొట్టాడు. ఈ విజయం కీలకమైన సమయంలో రాణించాడు. దీంతో తిలక్ వర్మపై పలువురు క్రీడా ప్రముఖులు, రాజకీయ నాయకులు ప్రశంసలు కురిపించారు. కాగా.. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల మీసాల పిల్ల అంటూ సాగే పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
సినిమా సెట్‌లో కేక్ కటింగ్ సందడి
తిలక్ వర్మ అద్భుత ప్రదర్శన
తిలక్ వర్మ ప్రదర్శనను మెచ్చుకుంటూ చిరంజీవి చేసిన ఈ సన్మానం క్రికెట్, సినిమా రంగాల మధ్య బంధాన్ని మరింత పెంచింది. అభిమానులకు ఆనందాన్ని పంచుతూ, ఈ సంఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.


