
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తండ్రి శివశక్తి దత్తా కన్నుమూశారు. ఈ విషాద వార్త తెలుసుకున్న చిరంజీవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఎమోషనల్ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
Key Points
ఎం.ఎం. కీరవాణి తండ్రి శివశక్తి దత్తా కన్నుమూశారు.
చిరంజీవి శివశక్తి దత్తా మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
శివశక్తి దత్తా పలు చిత్రాలకు పాటలు రచించారు.
శివశక్తి దత్తా కన్నుమూత
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు విన్నర్ ఎం.ఎం కీరవాణి(M.M. Keeravani) ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన తండ్రి శివశక్తి దత్తా (94) మణికొండలోని ఆయన నివాసంలో సోమవారం రాత్రి కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తూ పలు పోస్టులు పెడుతున్నారు. అయితే శివశక్తి దత్తా(Shiva Shakti Datta) కూడా ఇండస్ట్రీకి చెందినవారే కావడం విశేషం. ఆయన పలు చిత్రాలకు పాటలు రాశారు.
శివశక్తి విజయేంద్ర ప్రసాద్‌కు స్వయంగా అన్న కావడంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇప్పటికే శివశక్తి మరణంపై పవన్ కళ్యాణ్ భావోద్వేగ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ట్విట్టర్ ద్వారా కీరవాణి మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. ‘‘చిత్రకారుడు, సంస్కృత భాషా సంపన్నుడు , రచయిత, కథకుడు,బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన శ్రీ శివ శక్తి దత్తా గారు శివైక్యం చెందారన్న వార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తూ .. మిత్రుడు కీరవాణి గారికి వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’’ అని రాసుకొచ్చారు.ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త వైరల్‌గా మారింది.
చిరంజీవి సంతాపం
వైరల్ ట్వీట్
చిరంజీవి వంటి ప్రముఖులు కూడా శివశక్తి దత్తా మరణంపై తమ సంతాపాన్ని తెలియజేయడం ద్వారా ఆయనకున్న ప్రాముఖ్యతను చాటుకున్నారు. తెలుగు సినీ రంగానికి తీరని లోటు.


