|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఈ నగరానికి ఏమైంది: 8 ఏళ్లుగా తెలుగు యువతను ఊపేస్తున్న సినిమా! ఈ కల్ట్ క్లాసిక్ వెనుక అసలు రహస్యం ఇదే!

Published: 30-05-2026, 5:31 AM
ఈ నగరానికి ఏమైంది: 8 ఏళ్లుగా తెలుగు యువతను ఊపేస్తున్న సినిమా! ఈ కల్ట్ క్లాసిక్ వెనుక అసలు రహస్యం ఇదే!
  • “ఈ నగరానికి ఏమైంది” విడుదలైన 8 ఏళ్లు పూర్తి, ఇప్పటికీ యువతలో చెక్కుచెదరని క్రేజ్!
  • తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్, సుశాంత్, అభినవ్, వెంకటేష్ నటించిన కల్ట్ క్లాసిక్.
  • ప్రతి ఫ్రెండ్‌షిప్ గ్రూప్‌కి కనెక్ట్ అయ్యే వివేక్, కార్తీక్, కౌశిక్, ఉప్పి పాత్రలు – నిజంగా మన కథే!
  • బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినా, తెలుగు సినిమా చరిత్రలో ఓ ప్రత్యేక స్థానం.

టాలీవుడ్ లో కొన్ని సినిమాలు చరిత్ర సృష్టిస్తాయి, కొన్ని కల్ట్ క్లాసిక్స్ గా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన చిత్రమే “ఈ నగరానికి ఏమైంది”. విడుదలైన 8 ఏళ్లు గడిచినా, ఈ సినిమాపై యువతలో క్రేజ్ రవ్వంత కూడా తగ్గలేదు. అసలు ఈ సినిమా స్పెషల్ ఏంటి? రండి చూద్దాం!

కల్ట్ క్లాసిక్ గా ఎందుకు నిలిచింది?

EE Nagaraniki Emayindi : ఈ నగరానికి ఏమైంది? ఈ సినిమా ఒక కల్ట్​ క్లాసిక్ అనడంలో సందేహమే లేదు. 8ఏళ్లు గడిచినా ఇప్పటికీ మనలో చాలా మంది దాదాపు ప్రతి నెల ఈ సినిమాను ఎందుకు చూస్తున్నారు? ఇందులో ఉన్న మ్యాజిక్ ఏంటి? అసలెందుకు ఈ సినిమాకి ఇంత క్రేజ్?

2018 జూన్ 29.. థియేటర్లలోకి ఒక చిన్న సినిమా వచ్చింది. పెద్దగా స్టార్ కాస్టింగ్ లేదు, కమర్షియల్ హంగులు లేవు, అప్పటివరకు ఇండస్ట్రీ చూసిన ఏ పాత ఫార్ములాకూ అది సరిపోలేదు. కానీ, ఈరోజు.. అంటే 2026లో కూడా.. టాలీవుడ్‌లో బెస్ట్ ‘ఫ్రెండ్‌షిప్’ మూవీ ఏది? అని ఎవరిని అడిగినా.. క్షణం ఆలోచించకుండా చెప్పే పేరు: “ఈ నగరానికి ఏమైంది” (ఈఎన్​ఈ).

నేను ఈ సినిమాకి పెద్ద ఫ్యాన్! ఫ్యాన్ అనడం కంటే.. ఈ మూవీ నా లైఫ్​లో ఒక భాగమైపోయింది అనడం కరెక్ట్. సంతోషం వచ్చినా, బాధొచ్చినా, సక్సెస్​ వచ్చినా, ఫెయిల్​ అయినా.. సందర్భం ఏదైనా, సమయం ఏదైనా, చూసే సినిమా ఈ ఈఎన్​ఈ. (ఆ సినిమా ఎన్నిసార్లు చూస్తావురా అని మా నాన్న చాలాసార్లు అడిగారు కూడా!)

వాస్తవానికి నా ఒక్కడికే కాదు, నాలాంటి చాలా చాలా చాలా మందికి ఈ సినిమా ఒక అడిక్షన్! బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు కొల్లగొట్టిన సినిమాలు ఎన్నో వస్తాయి, వెళతాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే కాలపరీక్షను తట్టుకుని ‘కల్ట్ క్లాసిక్’గా మిగిలిపోతాయన్నది నా అభిప్రాయం.

అసలు ఈ నగరానికి ఏమైంది సినిమాను ప్రతి ఒక్కరూ తమ సొంత సినిమాగా ఎందుకు ఓన్ చేసుకున్నారు? తరుణ్ భాస్కర్ క్రియేట్ చేసిన ఆ మ్యాజిక్ ఏంటి?

లెట్స్ డూ ఏ డీప్ అనాలసిస్!

వివేక్ (విశ్వక్ సేన్): ఇతను ప్రతి గ్యాంగ్‌లో ఉండే ఆ ‘యాంగ్రీ యంగ్ మ్యాన్’. లోపల విపరీతమైన టాలెంట్, ఎనలేని సెన్సిటివిటీ ఉంటుంది.. కానీ బయటికి మాత్రం ఈగో, కోపం, ఫ్రస్ట్రేషన్‌తో రౌడీలా బిల్డప్ ఇస్తాడు. బ్రేకప్ పెయిన్‌ని తట్టుకోలేక తనని తాను నాశనం చేసుకునే క్యారెక్టర్.

కథలో ఉన్న స్పెషల్ మ్యాజిక్ ఏంటి?

కార్తీక్ (సాయి సుశాంత్): గ్యాంగ్‌లో ఉండే ప్రాక్టికల్ గై. లైఫ్‌లో సెటిల్ అవ్వాలి, లగ్జరీగా బతకాలి అనే కోరికతో.. నచ్చని ఉద్యోగం, నచ్చని పెళ్లికి కూడా కాంప్రమైజ్ అయిపోయే మిడిల్ క్లాస్ మైండ్‌సెట్.

కౌశిక్ (అభినవ్ గోమఠం): ప్రతి గ్యాంగ్‌కు ఇతనే ప్రాణం! యాక్టింగ్ అంటే పిచ్చి, నాన్న తిడుతున్నా లైట్ తీసుకునే కేర్‌లెస్ ఆటిట్యూడ్. సిట్యుయేషన్ ఎంత సీరియస్‌గా ఉన్నా తన వన్-లైనర్స్‌తో నవ్వించగలడు.

ఉప్పి (వెంకటేష్ కాకుమాను): ఎక్కువ మాట్లాడడు, గొడవల్లో దూకడు. కానీ ఫ్రెండ్స్ అంటే ప్రాణం. కెమెరా పట్టుకుని వెనుక నడిచే ఆ సైలెంట్ సపోర్టర్.

స్క్రీన్ మీద ఈ నలుగురిని చూస్తున్నప్పుడు.. “అరేయ్! వీడు అచ్చం మా కార్తీక్ లాగే ఉన్నాడురా”, “ఆ కౌశిక్ గాడు మా గ్యాంగ్ లోని ఫలానా గాడేరా”, “ఈ సినిమా ఏంటి నా స్టోరీలా ఉంది,” అని ఆడియన్స్ కనెక్ట్ అయిపోయారు.

అభినవ్ గోమఠం డైలాగ్ డెలివరీ ఒక ట్రెండ్ సెట్టర్.

“ఛీ ఏం టార్చర్​ రా”, “అసలు ఏందిరా మీ రెక్లెస్​ బిహేవియర్”, “మస్తు షేడ్స్​ ఉన్నాయిరా నీలో.. అట్​ కమల్​ హాసన్”, “అరె ఏంట్రా ఇది జేఎన్​టూయూ క్వశ్చన్ పేపర్​లా ఇంత ఉంది?” లాంటి డైలాగులు కేవలం సినిమా సీన్స్ లా మిగిలిపోలేదు. ఈరోజుకీ తెలుగు రాష్ట్రాల్లో యూత్ తమ డైలీ కాన్వర్జేషన్స్‌లో ఈ డైలాగులను వాడుతున్నారు. మీమ్ పేజీలకు ఇప్పటికీ ఈ సినిమానే ఒక పెద్ద అక్షయపాత్ర!

గోవాను అంతకుముందు చాలా సినిమాల్లో చూశాం, కానీ ఈ నగరానికి ఏమైందిలో చూపించిన గోవా.. చాలా రా గా, అంతే బ్యూటిఫుల్‌గా ఉంటుంది.

8 ఏళ్లైనా తగ్గని క్రేజ్ వెనుక రహస్యం!

ఈ సినిమాకు ప్రాణం పోసింది ఎవరంటే.. వివేక్ సాగర్ అనే చెప్పుకోవాలి. ఆయన అందించిన ఆల్బమ్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఒక మాస్టర్‌పీస్. ఆగి ఆగి, పరదా జరుపుకొని, మారే కలలే, వీడిపోనిది ఒకటేలా వంటి పాటలు మన ‘గో టూ’ సాంగ్స్​ అయిపోయాయి. బాధగా ఉన్నప్పుడు ఇవి వింటే చాలు! ఫుల్​ ఎనర్జీ వచ్చేస్తుంది కదా.

ఈ నగరానికి ఏమైంది కేవలం గోవా ట్రిప్ గురించో, మందు తాగడం గురించో, కామెడీ గురించో కాదు.. దీని అంతర్లీనంగా ఒక బలమైన ఎమోషన్ ఉంది. అది.. “లైఫ్‌లో సెటిల్ అవ్వడం కోసం మన కలలను చంపేసుకోవాలా? లేక రిస్క్ అయినా సరే మనకు నచ్చిన దారిలో వెళ్లాలా?” అనే ట్వంటీస్​లో ఉండే ప్రతి యువకుడి కన్‌ఫ్యూజన్.

అంతే కాదు.. డైరక్టర్ తరుణ్​ భాస్కర్ ఫిలాసఫీ కూడా మనందరికి ఎక్కేస్తుంది. పోలీస్ స్టేషన్​లో ఉన్నప్పుడు “లైఫ్​ అంటే నలుగురు నచ్చినోళ్లతో ఉంటూ, నాలుగు మెతుకుల అన్నం తింటూ, నచ్చిన పనిచేసుకోవడం. దాంట్లో ఉంటది సుకూన్” అని వివేక్ అనే మాటలతో మనలో ఎక్కడో ఒక తెలియని ఫీలింగ్​ స్టార్ట్​ అవుతుంది. “అరే! నేనేం చేస్తున్నా రా అనిపిస్తుంది.”

నిజమే కదా! అదే కదా జీవితం అంటే!

గెలిచామా ఓడామా అనేది పక్కన పెడితే.. మనకు నచ్చిన దానికోసం ప్రయత్నించడంలోనే అసలైన కిక్ ఉంటుందని చెప్పడమే ఈ సినిమా అంతిమ సందేశం. ఆ ప్రయాణంలో మనల్ని నమ్మి, మనతో పాటు నిలబడే నలుగురు స్నేహితులు ఉంటే చాలు.. ఎలాంటి నగరానికైనా, ఎలాంటి లైఫ్‌కైనా మనం రెడీ అయిపోవచ్చు!

అందుకే గురు.. ఈఎన్​ఈ ఎప్పటికీ ఒక ఎమోషన్!

మరి మీ ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో వివేక్ ఎవరు? కౌశిక్ ఎవరు?

“ఈ నగరానికి ఏమైంది” కేవలం ఒక సినిమా కాదు, ఒక ఎమోషన్. 8 ఏళ్లైనా ఈ సినిమా మ్యాజిక్ తగ్గలేదంటేనే దీని గొప్పదనం అర్థమవుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం మా ఛానెల్‌ని చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.