|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరంజీవికి బిగ్ షాక్! 24 గంటల్లోనే ‘MSVPG’ లీక్..ఫ్యాన్స్ ఆగ్రహం!

Published: 13-01-2026, 2:05 AM
చిరంజీవికి బిగ్ షాక్! 24 గంటల్లోనే 'MSVPG' లీక్..ఫ్యాన్స్ ఆగ్రహం!
  • మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విడుదలైన 24 గంటల్లోనే పైరసీ!
  • ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ. 84 కోట్ల వసూళ్లు రాబట్టిన ‘MSVPG’ సినిమా.
  • చిరంజీవి సరసన నయనతార, వెంకటేష్ ప్రత్యేక పాత్రలో అదరగొట్టారు.
  • అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు నెటిజన్స్ నుండి ప్రశంసలు.

మెగాస్టార్ చిరంజీవికి ఊహించని షాక్! ఆయన నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విడుదలైన 24 గంటల్లోనే పైరసీకి గురైందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్త మెగా అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

24 గంటల్లోనే పైరసీ కలకలం!

మెగాస్టార్ చిరంజీవికి ఊహించని షాక్ తగిలింది. ఆయన నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఆన్లైన్ లో ప్రత్యక్షమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ అయి 24 గంటలు అయ్యేలోపు పైరసీ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఈ న్యూస్ బయటకు రాగానే మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైరసీ చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చిరంజీవి అంటే పడని వాళ్ళు ఈ పని చేసి ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా కలెక్షన్స్ లో దూసుకు వెళ్తోంది. ఈ సినిమా ఒక్కరోజులోనే ప్రీమియర్లతో కలిపి ఏకంగా 84 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసిందట. ఈ మేరకు చిత్ర బృందం కూడా పేర్కొంది. కాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేయగా, విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ చేశారు. అటు హీరోయిన్ గా నయనతార మెరిసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవిని దర్శకుడు అనిల్ బాగా వాడుకున్నాడ‌ని.. దీంతో సినిమా బంపర్ హిట్ కాబోతోందని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.

‘MSVPG’ కలెక్షన్ల సునామీ!

ఫ్యాన్స్ ఆగ్రహం.. చర్యలకు డిమాండ్!

చిరంజీవి గారి సినిమా పైరసీకి గురవడం అభిమానులను కలవరానికి గురిచేసింది. దీనిపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.