
📌 Key Points
- తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో చిరంజీవి ప్రసంగం ఆలస్యంగా ముగిసింది.
- సమయం తక్కువ ఉండటంతో అవార్డు గురించి చిరంజీవి తొందరగా మాట్లాడారు.
- ఎన్టీఆర్ అవార్డు గురించి సోషల్ మీడియాలో చిరంజీవి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
- ఎన్టీఆర్ అంటే నాట్యం, తాళం, రాగం అని చిరంజీవి నిర్వచించారు.
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేదికపై చిరంజీవి ఎన్టీఆర్ గురించి మాట్లాడారు. సమయం తక్కువగా ఉండటంతో తొందరగా ముగించాల్సి వచ్చింది. అయితే, అవార్డు గురించి ఆయన సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
గద్దర్ అవార్డ్స్‌లో చిరంజీవి స్పీచ్
Chiranjeevi: సభా సమయం మించి పోతున్న సమయంలో కొందరు షార్ట్ స్పీచ్‌లతోనే ముగించాల్సి వస్తుంది. అందులోనూ అధికారులు ఉన్నప్పుడు, ఇంకాస్త తొందర పెడుతుంటారు. ఆ క్రమంలో చెప్పాలనుకున్న నాలుగు ముక్కలు కూడా ఏదేదో చెప్పేసి స్టేజ్ దిగిపోతుంటారు. కొందరికి అయితే అసలు మాట్లాడటానికి కూడా అవకాశం ఉండదు. ఇదే జరిగింది గురువారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ (Telangana Gaddar Film Awards)లో. ఈ అవార్డ్స్ వేదికపై మాట్లాడాలని చాలా మంది అనుకుంటారు. కానీ, అక్కడ కొందరికే అవకాశం ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi), కమల్ హాసన్, ఆర్ నారాయణ మూర్తి వంటి వారికి కాస్త ఎక్కువ సేపు మాట్లాడటానికి సమయమైతే లభించింది కానీ, అప్పటికే చాలా సమయం గడిచిపోయింది. అందుకే చిరంజీవి కూడా త్వరత్వరగానే తన స్పీచ్‌ని ముగించారు. ఈ క్రమంలో ఆయన తను అందుకున్న అవార్డ్ గురించి చెప్పడం మరిచిపోయారు.
అందుకే అవార్డు అందుకుని ఇంటికి వెళ్లిపోయిన తర్వాత తను అందుకున్న అవార్డు గురించి, ఆ అవార్డు ఎవరి పేరు మీద అయితే ఇచ్చారో, ఆ పేరు గల వ్యక్తి గురించి సోషల్ మీడియా వేదికగా తన మనసులోని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనినే యాంటీ ఫ్యాన్స్ బాగానే కవర్ చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారనుకోండి. అయితే సరే, ఇలా చెప్పడం కూడా గొప్ప విషయమే. అవార్డు తీసుకున్నాం కదా.. ఇంకేముందిలే అని చాలా మంది కామ్ అయిపోతారు. కానీ అక్కడుంది చిరంజీవి (Chiranjeevi). అందుకే సోషల్ మీడియా వేదికగా తనకిచ్చిన ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వాస్తవానికి అవార్డుని అందుకున్న అనంతరం మాట్లాడిన స్పీచ్‌లో కూడా.. ‘ఇది సీనియర్స్‌కు గౌరవం ఇచ్చే విధంగానూ, అలాగే యంగ్ స్టర్స్‌ను ఉత్సాహ పరిచే విధంగానూ, చాలా చక్కగా ఈ అవార్డుల ఎంపిక జరిగింది’ అని ఒక్క మాటలోనే అన్నీ కవర్ చేశారు. అయినా సరే సంతృప్తి చెందని చిరంజీవి.. ఎక్స్ వేదికగా తనకు వచ్చిన అవార్డుపై ఓ పోస్ట్ చేశారు.
ఎన్టీఆర్ గురించి చిరంజీవి ఏమన్నారంటే?
‘‘చరిత్ర కర్తగా నిలిచిన నందమూరి తారక రామారావు గారు.. తన పేరుతోనే లలిత కళలను ముందుకు తీసుకుని వెళ్లిన మహా కళాకారుడు. ఎన్టీఆర్ అంటే… N నాట్యం, T తాళం, R రాగం… కళల సమ్మేళనం. తెలుగు సినిమాకు ఉన్న కీర్తిని ఖండాంతరాలకు చేర్చిన మహానుభావుడు. దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియకపోయినా… ఆయన పోషించిన పాత్రల ద్వారా దేవుడిని మన కళ్ల ముందుంచిన అపూర్వ ప్రతిభ. రామారావు గారు జన్మించిందే సినిమాల కోసం అన్నట్టుగా, ఆయన లేని తెలుగు సినిమా ఊహించలేనిది. అలాంటి మహానుభావుని పేరుతో ఉన్న ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’ నాకు లభించడం, నా జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నాను’’ అని మెగాస్టార్ చిరంజీవి తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
చరిత్ర కర్తగా నిలిచిన నందమూరి తారక రామారావు గారు… తన పేరుతోనే లలిత కళలను ముందుకు తీసుకుని వెళ్లిన మహా కళాకారుడు.
ఎన్టీఆర్ అంటే… N నాట్యం, T తాళం, R రాగం… కళల సమ్మేళనం.
తెలుగు సినిమాకు ఉన్న కీర్తిని ఖండాంతరాలకు చేర్చిన మహానుభావుడు.
సోషల్ మీడియాలో చిరంజీవి స్పందన
దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియకపోయినా… ఆయన… pic.twitter.com/YTILoPPlL8
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 20, 2026
చిరంజీవి ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన ఎన్టీఆర్ గొప్పతనాన్ని కొనియాడారు. ఈ సంఘటన సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.


