|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అన్నదమ్ముల అరుదైన కలయిక! ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, పవన్ కళ్యాణ్.. వైరల్ ఫోటో!

Published: 07-03-2026, 4:35 AM
అన్నదమ్ముల అరుదైన కలయిక! ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, పవన్ కళ్యాణ్.. వైరల్ ఫోటో!
  • చిరు, పవన్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధుల్లేవ్
  • అల్లు శిరీష్ వివాహానికి ముఖ్య అతిథులుగా హాజరైన చిరంజీవి, పవన్ కళ్యాణ్
  • చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు రాజకీయాల్లో పవన్
  • పెళ్లి వేడుకలో చిరు, పవన్ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. అల్లు శిరీష్ వివాహ వేడుకలో వీరిద్దరూ కలిసి సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

అల్లు శిరీష్ వివాహంలో మెగా సందడి

Tollywood:సాధారణంగా కొన్ని అరుదైన కలయికలు అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ముఖ్యంగా కొన్ని రేర్ కాంబినేషన్లు తెరపై సందడి చేయడానికి సిద్ధమైతే.. మరికొన్ని రేర్ కాంబినేషన్ లు అప్పుడప్పుడు కెమెరా కంటికి చిక్కి అభిమానులను సంబర పరుస్తూ ఉంటాయి. ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) , ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇద్దరు కలిసి ఒకే చోట కనిపించేది చాలా అరుదు. ఒకవేళ అలా కనిపిస్తే మాత్రం మెగా అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒకవైపు హీరోగా మెగాస్టార్ చిరంజీవి తన వరుస సినిమాలతో బిజీగా ఉండగా.. మరొకవైపు పవన్ కళ్యాణ్ హీరోగా , రాజకీయంగా బిజీగా మారిపోయారు. ఇలాంటి సమయంలో అన్నదమ్ములిద్దరూ కలిసి కనిపించడమే అరుదుగా మారిపోయింది.

అయితే సడన్గా ఒక పెళ్లి వేడుకలో అన్నదమ్ములిద్దరూ కనిపించి అభిమానులకు కన్నుల విందుగా అనిపించారు. అంతేకాదు ఆ ఈవెంట్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. వివరాలలోకి వెళితే.. మెగా మేనల్లుడు అలియాస్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న వారసుడైన అల్లు శిరీష్ (Allu Sirish) వివాహం మార్చి 6 2026న హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ నారా లోకేష్ వంటి రాజకీయ నాయకులతోపాటు పలువురు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు , దర్శకులు, నిర్మాతలు వచ్చి సందడి చేశారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇక ఇదే వేడుకలో మెగాస్టార్ చిరంజీవి కూడా సందడి చేశారు. ఇక వీరిద్దరూ ఒకే చోట కూర్చుని కలిసి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన అభిమానులు దీనిని తెగ షేర్ చేస్తున్నారు. అంతేకాదు “పిక్ ఆఫ్ ది డే” అంటూ కామెంట్ కూడా చేస్తున్నారు.

ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, పవన్ కళ్యాణ్

చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. 7 పదుల వయసులో కూడా వరుస సినిమాలు ప్రకటిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ ఏడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ గారు సినిమా చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకుంది . ఇక ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్ బాబి దర్శకత్వంలో బెంగాల్ మాఫియా నేపథ్యంలో సినిమా చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. ఒకవైపు ఆంధ్ర ప్రదేశ్ కి డీసీఎం గా పనిచేస్తూనే.. మరొకవైపు తన వరుస సినిమా షూటింగ్లతో బిజీగా గడిపేస్తున్నారు. ప్రస్తుతం ఆయన హరీష్ శంకర్ దర్శకత్వంలో మళ్లీ 14 ఏళ్ల తర్వాత నటిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో అప్పుడే ఓవర్సీస్ లో బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఇక ఈరోజు నుంచి పవన్ కళ్యాణ్ తన పాత్రకు డబ్బింగ్ కూడా మొదలుపెట్టారు.

వైరల్ అవుతున్న ఫోటో.. అభిమానుల ఆనందం

చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి ఒకే వేదికపై కనిపించడం అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఈ అరుదైన కలయిక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారి అభిమానులు ఈ ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.