|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరంజీవి, రాజశేఖర్ కలిసి నటించాల్సిన మూవీ ఏంటో తెలుసా? మెగాస్టార్ రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే?

Published: 28-07-2025, 10:46 AM
చిరంజీవి, రాజశేఖర్ కలిసి నటించాల్సిన మూవీ ఏంటో తెలుసా? మెగాస్టార్ రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే?

మెగాస్టార్ చిరంజీవి మరియు రాజశేఖర్ మధ్య ఉన్న విభేదాలు, వారి మధ్య స్నేహం ఉన్నప్పటికీ, ఒక సినిమాలో కలిసి నటించే అవకాశం ఎలా చేజారిపోయిందో ఈ కథనం వివరిస్తుంది. స్నేహంకోసం సినిమా రీమేక్ ద్వారా వారి కలయిక ఎలా అసంభవం అయిందో తెలుసుకుందాం.

Key Points

1

చిరంజీవి మరియు రాజశేఖర్ మధ్య గొడవలు, విమర్శలు.

2

స్నేహంకోసం సినిమా రీమేక్ లో రాజశేఖర్ నటించాలని కోరిక.

4

అరుదైన కాంబినేషన్ మిస్ అవడం.

చిరంజీవి, రాజశేఖర్ మధ్య విభేదాలు

మెగాస్టార్‌ చిరంజీవి, డాక్టర్‌ రాజశేఖర్‌ మధ్య చాలా కాలంగా గొడవలు ఉన్నాయి. రాజకీయపరమైన విమర్శలు గొడవలకు దారితీశాయి. చిరంజీవిని పొలిటికల్‌గా విభేదించారు రాజశేఖర్‌.

అదే సమయంలో చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్ కి సంబంధించిన కూడా ఆయన పలు విమర్శలు చేశారు. ఇది కేసులు, కోర్ట్ వరకు వెళ్లింది. ఈ కేసులో రాజశేఖర్‌ జైలుకు కూడా వెళ్లినట్టు సమాచారం.

ఇదిలా ఉంటే ఇవన్నీ కాకముందు వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది. చిరంజీవి చేయాల్సిన మూవీస్‌ రాజశేఖర్‌ చేశారు. రాజశేఖర్‌ చేయాల్సిన మూవీస్‌ చిరంజీవి కూడా చేశారు.

అంతేకాదు ఓ సినిమా మాత్రం చిరంజీవి, రాజశేఖర్‌ కలిసి చేయాల్సింది. రాజశేఖర్‌ స్వయంగా ఆ మూవీలో నటిస్తానని చెప్పారట. కానీ చిరంజీవి రిజెక్ట్ చేసినట్టు రాజశేఖర్‌ తెలిపారు. ఆ సినిమా ఏంటి? ఆ కథేంటో చూద్దాం.

స్నేహంకోసం రీమేక్ మరియు రాజశేఖర్ ఆశలు

చిరంజీవి కెరీర్‌లో మంచి హిట్‌ చిత్రాల్లో `స్నేహంకోసం` ఒకటి. కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ తమిళంలో ఆయనే రూపొందించిన `నట్పుక్కగా` చిత్రానికి రీమేక్‌.

ఇందులో చిరంజీవి, విజయ్‌కుమార్‌ ప్రధాన పాత్రలు పోషించారు. చిరు ద్విపాత్రాభినయం చేశారు. తండ్రిగా, కొడుకుగా కనిపించారు. మీనా హీరోయిన్‌గా చేసింది. ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్రలో నటించారు. 1999లో వచ్చిన ఈ మూవీ పెద్ద హిట్‌ అయ్యింది.

అయితే ఈ మూవీ రీమేక్‌ చేయాలనుకున్నప్పుడు విజయకుమార్‌ పాత్రకి తాను నటిస్తానని రాజశేఖర్‌ అన్నారట. అదే విషయాన్ని చిరంజీవికి చెప్పారట. కానీ చిరంజీవి రిజెక్ట్ చేశారట.

`రాజశేఖర్‌ నీ ఏజ్‌ చిన్నగైపోతుంది, నువ్వు సూట్‌ కావు` అని అన్నారట చిరంజీవి. దీంతో ఆ మూవీలో నటించలేకపోయారు రాజశేఖర్‌.

చిరంజీవి నిర్ణయం మరియు దాని పర్యవసానాలు

అలా చిరంజీవి, రాజశేఖర్‌ కలిసి నటించే ఛాన్స్ మిస్‌ అయ్యింది. ఈ విషయాన్ని ఐ డ్రీమ్‌కిచ్చిన ఇంటర్వ్యూలో రాజశేఖర్‌ చెప్పారు .

మొత్తంగా ఈ అరుదైన కాంబినేషన్‌ మిస్‌ అయ్యింది. ఆ తర్వాత మళ్లీ ఆ ప్రయత్నాలు జరగలేదు. ఇక ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

ఆయన `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే దీనికి సంబంధించిన సాంగ్‌ షూటింగ్‌ జరిగింది. దీంతోపాటు అనిల్‌ రావిపూడితో మూవీ చేస్తూ బిజీగా ఉన్నారు. ఇది కూడా చిత్రీకరణ దశలో ఉంది.

మరోవైపు రాజశేఖర్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకుంటున్నారు. త్వరలో ఆయన ఓ యంగ్‌ హీరో మూవీతో రాబోతున్నట్టు సమాచారం.

చిరంజీవి, రాజశేఖర్ కలిసి నటించే అవకాశం చేజారిపోవడం తెలుగు సినీ ప్రేమికులకు నిరాశ కలిగించే విషయం. వారిద్దరి కలయిక చూడాలని అభిమానులు ఎంతో ఆశించారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.