|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Chiranjeevi: బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదిగిన హీరో, అతడికి కొడుకు పుట్టగానే జాతకం చెప్పిన చిరంజీవి

Published: 06-12-2025, 10:33 AM
Chiranjeevi: బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదిగిన హీరో, అతడికి కొడుకు పుట్టగానే జాతకం చెప్పిన చిరంజీవి
  • చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదిగిన నానిని ప్రోత్సహిస్తున్నారు.
  • నాని కొడుకు జున్ను పుట్టినప్పుడు చిరంజీవి జాతకం చెప్పి వివరించారు.
  • చిరంజీవి నాని సినిమాలకు మెసేజ్‌లు పంపి అభినందిస్తుంటారు.
  • శ్యామ్ సింగ రాయ్ సినిమాను చూసి చిరంజీవి ఎంతగానో మెచ్చుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో యువ టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ముందుంటారు. నేచురల్ స్టార్ నానిని చిరంజీవి ఎలా ప్రోత్సహించారో ఈ కథనం వివరిస్తుంది. నాని కొడుకు జున్ను పుట్టినప్పుడు చిరంజీవి చెప్పిన జాతకంతో పాటు, ఆయన నాని సినిమాలపై చూపిన అభిమానం ఆసక్తికరంగా ఉన్నాయి.

చిరంజీవి – నాని స్నేహం, ప్రోత్సాహం

మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో కొత్త నటీనటుల్ని, యువ దర్శకులని ప్రోత్సాహించడం చూస్తూనే ఉన్నాం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదిగిన ఓ హీరోని చిరంజీవి ఎంతగానో ప్రోత్సాహిస్తున్నారట. ఈ విషయాన్ని ఆ హీరోనే చెప్పారు. ఇంతకీ  ఆ హీరో ఎవరో కాదు.. నేచురల్ స్టార్ నాని.

నాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా సినిమా విడుదలైన ప్రతి సారీ చిరంజీవి గారు నన్ను అభినందిస్తుంటారు. ఆయనే ప్రత్యేకంగా ఒక లెటర్ లాగా టైప్ చేసి నాకు మెసేజ్ పెడుతుంటాయారు. చిరంజీవి గారితో తొలిసారి ఎక్కువగా మాట్లాడింది మీలో ఎవరు కోటీశ్వరుడు షోలోనే. అప్పటి నుంచి ఆయనతో చనువు పెరిగింది. శ్యామ్ సింగ రాయ్, దసరా ఇలా నా సినిమా ఏది విడుదలైనా చిరంజీవి గారి నుంచి మెసేజ్ వస్తుంది.

నాని కొడుకు జున్ను జాతకం చెప్పిన చిరంజీవి

అన్నింటికంటే ముఖ్యమైన విషయం.. నా కొడుకు జున్ను పుట్టినప్పుడు చిరంజీవి గారు నాకు ఫోన్ చేశారు. అప్పటికి ఇంకా హాస్పిటల్ లోనే ఉన్నాం. చిరంజీవి గారు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారు. బాబు జన్మించిన టైం, నక్షత్రం ఏంటి అని అడిగి తెలుసుకున్నారు. వాటిని బట్టి ఆయనకు తెలిసిన జాతకం చెప్పారు. ఏ నక్షత్రంలో పుడితే ఎలా ఉంటుంది అనేది వివరించారు అని నాని పేర్కొన్నారు.

శ్యామ్ సింగ రాయ్ సినిమాని ఆయన ఇంట్లో హోమ్ థియేటర్ లో వేసుకుని చూశారట. సినిమా చూస్తున్న సమయంలో పనివాళ్ళు స్నాక్స్ తీసుకుని వచ్చారట. చిరంజీవి ఇన్వాల్వ్ అయిపోయి చూస్తున్నారు. వాళ్ళు డిస్టర్బ్ చేయడంతో చిరంజీవి తిట్టి వెనక్కి పంపేశారట. అంతలా ఆయనకు శ్యామ్ సింగ రాయ్ మూవీ నచ్చేసింది.

శ్యామ్ సింగ రాయ్ చూసి చిరంజీవి స్పందన

తన సతీమణి సురేఖ గారితో కలిసి చిరంజీవి గారు శ్యామ్ సింగ రాయ్ మూవీ చూశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం నాని ప్యారడైజ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది భారీ బడ్జెట్ లో దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

చిరంజీవి తన గొప్ప మనసుతో యువ తారలను ప్రోత్సహించడం, వారి వ్యక్తిగత జీవితాల్లో పాలుపంచుకోవడం మెగాస్టార్ గొప్పదనాన్ని చాటిచెప్తుంది. నానితో ఆయనకున్న బంధం తెలుగు సినిమా పరిశ్రమకు ఒక మంచి ఉదాహరణ.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.