
📌 Key Points
- రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు! మెగా ఇంట రెట్టింపు సంబరాలు!!
- ముందుగా బాబు జన్మించాడని తెలిపిన చిరంజీవి గారు – అభిమానుల్లో ఆనందం!!!
- అపోలో వైద్యులకు కృతజ్ఞతలు తెలిపిన మెగాస్టార్ – ఆనందంలో మునిగిన కుటుంబం.
- జూన్ 20, 2023న క్లింకారకు జన్మనిచ్చిన ఉపాసన – ఇప్పుడు కవలలతో మరింత సంతోషం!
మెగా అభిమానులకు పండగే పండగ! రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు జన్మించారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి ఆనందానికి అవధుల్లేవు. ఈ శుభవార్తకు సంబంధించిన మరిన్ని వివరాలు మీకోసం.
కవలలతో మెగా ఇంట సంబరాలు!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), ఉపాసన కొణిదెల (Upasana Konidela)దంపతులకు కవలలు.. ఒక బాబు, ఒక పాప జన్మించడంతో మెగా కుటుంబంలో అపూర్వమైన ఆనందం నెలకొంది. ఈ ప్రసవం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో జరిగింది. ఈ శుభవార్త చిరంజీవి(Chiranjeevi) కుటుంబంలో రెట్టింపు వేడుకలని తీసుకొచ్చింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..‘‘అందరికీ నమస్కారం. మా శ్రేయోభిలాషులు, మా అభిమానులు, మా మంచి కాంక్షించే ప్రతి ఒక్కరికి మా ఇంటి జరిగిన ఈ శుభవార్త మీతో పంచుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇటు కొణిదెల ఫ్యామిలీ అటు కామినేని ఫ్యామిలీ రెండు కుటుంబాలు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాము. రామ్ చరణ్ ఉపాసన రాత్రి కవలలకు జన్మనిచ్చారు. ఉపాసన, బిడ్డలు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఈ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాము. మా ఇంట ఈ మంచి జరగాలని మీరు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు.
భగవంతుడి దయవల్ల, హనుమాన్ కృప వలన ఒక పాప, ఒక బాబు జన్మించారు. ముందుగా బాబు పుట్టాడు. ఇది మా అందరికీ చాలా సంతోషాన్ని కలిగించే విషయం. మమ్మల్ని అభిమానించే వారికి మా మంచి కోరుకునే వారికి ఈ వార్తని పంచుకోవడం అనేది నాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇంత సుఖ ప్రసవం జరిగినందుకు అపోలో వైద్యులకు, వారి సిబ్బందికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా అభిమానులు అందరూ కూడా ఇది మరింత పండుగలాగా జరుపుకుంటూ వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా ఉంది. నేను ఎంత చెప్పినా సరే ఈ ఆనందానికి అవధులు లేవు. అందరికీ థాంక్యు’’ అని అన్నారు. కాగా.. జూన్ 20, 2023న రామ్ చరణ్–ఉపాసన దంపతులు తమ తొలి సంతానంగా కుమార్తె క్లింకారకు జన్మనిచ్చారు. ఇప్పుడు, కవలల రాకతో, కొణిదెల, కామినేని కుటుంబాలలో ఆనందం రెట్టింపు అయింది. అభిమానులు, శ్రేయోభిలాషులందరిలోనూ పండగ వాతావరణం నెలకొంది. దీంతో సోషల్ మీడియా వేదికగా.. శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ముందుగా పుట్టింది ఎవరో చెప్పిన చిరు
వైద్యులకు ధన్యవాదాలు తెలిపిన మెగాస్టార్
రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు పుట్టడం నిజంగా సంతోషకరమైన విషయం. మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


