|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరంజీవి ప్రాణాలకు తెగించారు.. రాజీవ్ కనకాల హార్ట్ బీట్ పెంచేసిన మెగాస్టార్, టాలీవుడ్ లో గ్రూపులపై ఇలా

Published: 21-08-2025, 7:12 AM
చిరంజీవి ప్రాణాలకు తెగించారు.. రాజీవ్ కనకాల హార్ట్ బీట్ పెంచేసిన మెగాస్టార్, టాలీవుడ్ లో గ్రూపులపై ఇలా

టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. చిరంజీవి చేసిన ప్రమాదకరమైన స్టంట్స్ గురించి, తనతో ఉన్న అనుబంధం గురించి వివరించారు. టాలీవుడ్ లోని ఫ్యామిలీ గ్రూపుల గురించి కూడా ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.

Key Points

1

చిరంజీవి ప్రాణాలకు తెగించిన డేర్‌డెవిల్ స్టంట్!

2

రాజీవ్ కనకాలకు చిరంజీవి ప్రేరణ!

4

ఎ ఫిలిం బై అరవింద్ సినిమా చూడటానికి చిరంజీవి వచ్చిన సంఘటన!

చిరంజీవి ప్రాణాలకు తెగించిన ఘటన

రాజీవ్ కనకాల దశాబ్దాలుగా టాలీవుడ్ లో రాణిస్తున్నారు. రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల ఎందరో నటీనటులకు ఓనమాలు చేర్పించిన గురువు. చిరంజీవి కూడా కెరీర్ బిగినింగ్ లో దేవదాస్ కనకాల ఫిలిం స్కూల్ లో నటనలో మెళుకువలు నేర్చుకున్నారు. రాజీవ్ కనకాల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఒకసారి చెన్నైలోని అట్లాంటిక్ హోటల్ వద్ద చిరంజీవి దొంగ సినిమా షూటింగ్ జరుగుతుంటే చూడడానికి వెళ్ళాను. హోటల్ టాప్ పై ఫైట్ సీన్ జరుగుతోంది. చిరంజీవి పిట్టగోడపై నిలబడి బ్యాలెన్స్ చేస్తూ ఫైట్ చేయాలి. అప్పట్లో పెద్దగా సేఫ్టీ ప్రికాషన్స్ కూడా లేవు. కొంచెం తేడా జరిగినా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. అయినా కూడా చిరంజీవి డేర్ గా ఆ సీన్ లో నటించారు. తాను దగ్గరుండి ఆ సీన్ ని చూసినట్లు రాజీవ్ కనకాల తెలిపారు.

రాజీవ్ కనకాలతో చిరంజీవి అనుబంధం

నేను ఆ టైంలో చిన్న పిల్లాడిని. చూస్తుంటేనే టెన్షన్ గా అనిపించింది అని రాజీవ్ కనకాల తెలిపారు. తాను నటించిన ఎ ఫిలిం బై అరవింద్ మూవీ రిలీజ్ అయినప్పుడు చిరంజీవి గారితో మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది అని రాజీవ్ కనకాల తెలిపారు. ఎ ఫిలిం బై అరవింద్ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఒకసారి ఆయన్ని అనుకోకుండా డబ్బింగ్ థియేటర్ లో కలిశాను. ఏవమ్మా రాజీవ్.. నాకు ఎ ఫిలిం బై అరవింద్ మూవీ చూపించవా అని అడిగారు. భలేవారు సార్ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో చెప్పండి.. నేను షో ఏర్పాటు చేస్తాను అని అన్నాను.

వెంటనే ఆయన తన మేనేజర్ నంబర్ ఇచ్చారు. మేనేజర్ ని అడిగితే సార్ బిజీగా ఉన్నారని చెప్పారు. ఆ రోజు రాలేదు. అయినా చిరంజీవి వచ్చి నీ సినిమా ఎందుకు చూస్తాడు అని అంతా అన్నారు. కానీ మరుసటి రోజు లేట్ అయినా సాయంత్రం ఆయనే గుర్తుపెట్టుకుని మరీ వచ్చి తన చిత్రం చూసినట్లు రాజీవ్ కనకాల తెలిపారు.

టాలీవుడ్ లో గ్రూపుల వ్యవహారం

ఇండస్ట్రీలో గ్రూపులు ఉంటాయా ? ఒక ఫ్యామిలీకి చెందిన హీరోలతో నటిస్తే మరో ఫ్యామిలీకి చెందిన హీరోలతో నటించడం కుదరదా అనే ప్రశ్నకి కూడా రాజీవ్ సమాధానం ఇచ్చారు. తాను ఎన్టీఆర్ తో ఎక్కువ సినిమాల్లో నటించినట్లు రాజీవ్ తెలిపారు. అదే విధంగా మెగా ఫ్యామిలిలో అల్లు అర్జున్, రాంచరణ్ లతో కూడా నటించాను. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో నటించే అవకాశం రాలేదు. ఒక ఫ్యామిలీ కి చెందిన హీరోలతో నటిస్తే మరో ఫ్యామిలీతో నటించకూడదు అనేది లేదు. కానీ వారి కింద ఉన్న వారు మాత్రం చాలా హడావిడి చేస్తారు అని రాజీవ్ కనకాల తెలిపారు.

చిరంజీవి సినిమా రంగంపై, తన వృత్తిపరమైన జీవితంపై రాజీవ్ కనకాల చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. టాలీవుడ్ లోని గ్రూపుల గురించి ఆయన అభిప్రాయాలు కూడా చర్చనీయాంశంగా మారాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.