
📌 Key Points
- చిరంజీవి: “చరణ్ గోల్డెన్ స్పూన్‌తో పుట్టాడు, అయినా ‘పెద్ది’ కోసం అసాధారణంగా కష్టపడ్డాడు.”
- “రంగస్థలం, RRR, పెద్ది.. ప్రతి నాలుగేళ్లకో బ్లాక్ బస్టర్!” చరణ్ అదృష్టంపై మెగాస్టార్ ఆనందం.
- దర్శకుడు బుచ్చిబాబు విజన్, నిర్మాత సతీష్ కిలారు భారీ నిర్మాణ విలువలను చిరు కొనియాడారు.
- ‘పెద్ది’ గ్రామీణ నేపథ్యం, మట్టి మనుషుల కథగా చిరంజీవి అభివర్ణన, సుకుమార్ సహకారం ప్రశంసనీయం.
మెగాస్టార్ చిరంజీవి తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ లో చిరు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్. చరణ్ అంకితభావం, కష్టం గురించి మెగాస్టార్ చెప్పిన మాటలు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి.
మెగాస్టార్ గర్వం: చరణ్ నటనకు ఫిదా!
రామ్ చరణ్ ని చూసి తోటి నటుడుగా అభినందిస్తున్నానని, తండ్రిగా గర్వపడుతున్నానని అన్నారు చిరంజీవి . చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ మూవీ మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు చీఫ్ గెస్టుగా హాజరైన చిరు.. తనయుడిపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో చెర్రీ అద్భుతమైన నటన కనబరిచారని.. సినిమా చూసినప్పుడు తాను భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు. చరణ్ గోల్డెన్ స్పూన్‌తో పుట్టాడని, ఇంత కష్టపడాల్సిన అవసరం లేదని, అయినా ఈ సినిమా కోసం కష్టపడ్డాడన్నారు. సోంబేరితనం తమ ఇంటి గుమ్మంలోకి కూడా రాదన్నారు. ‘రంగస్థలం’, RRR , ‘పెద్ది’.. ఇలా ప్రతి నాలుగేళ్లకు ఒక సినిమా రావడం చరణ్ అదృష్టమని చిరు పేర్కొన్నారు. చిరంజీవి మాట్లాడుతూ.. ”మా అభిమానుల్లో ఆనాటి నుంచి ఈనాటి వరకు క్రమశిక్షణలో ఎలాంటి మార్పు లేదు. అదే ఉత్సాహం, అదే ప్రేమతో ఆదరిస్తూ వస్తున్న అభిమానులందరికీ నా హృదయపూర్వక అభివాదాలు. నేను ఇక్కడికి ఒక అతిథిగా, ఒక సీనియర్ నటుడిగా, సినిమాపై అపారమైన ప్రేమ ఉన్న వ్యక్తిగా వచ్చాను. ఈ సినిమాను విజయవంతం చేసిన ప్రతి ప్రేక్షకుడికి, అభిమానికి, చిత్ర బృందానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సినిమాలు రావాలి.. పరిశ్రమ సుభిక్షంగా ఉండాలి. థియేటర్లు కళకళలాడాలి. ఆ దిశగా ‘పెద్ది’ ఒక గొప్ప విజయంగా నిలిచింది” అని అన్నారు. ”పెద్ది’ సినిమా చూస్తున్నంతసేపూ ఒక ట్రాన్స్‌లోకి వెళ్లిపోయిన అనుభూతి కలిగింది. పాత్రలతో మమేకమై వారి పోరాటంలో నేనూ ఒకడినై ప్రయాణించాను. ఇంత పవర్‌ఫుల్, ఎమోషనల్, మోటివేషనల్ కథను ఎంచుకుని, దానికి రామ్ చరణ్ న్యాయం చేస్తాడని నమ్మి ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు బుచ్చిబాబుకు సభాముఖంగా నా అభినందనలు. ఇది మట్టి మనుషుల కథ. బుచ్చిబాబు కూడా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో ఆ భావోద్వేగాలను అద్భుతంగా తెరపై ఆవిష్కరించాడు. ఈ కథకు ఆయన నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. ఇలాంటి దర్శకుడిని తెలుగు సినీ పరిశ్రమకు అందించిన సుకుమార్ కి కూడా నా అభినందనలు. మట్టిలో దాగి ఉన్న మాణిక్యాలను వెలికి తీయగల దార్శనికుడు సుకుమార్” ”నిర్మాత సతీష్ కిలారు.. దర్శకుడి విజన్‌ను ఎక్కడా రాజీ పడకుండా భారీ స్థాయిలో తెరపై ఆవిష్కరించారు. నిర్మాతకు ఎన్నో కష్టాలు వస్తాయి.. బాధలు వస్తాయి. డబ్బులు మిగలొచ్చు.. మిగలకపోవచ్చు. లాభాలు రావొచ్చు రాకపోవచ్చు. ఇలాంటి అత్యద్భుతమైన కథకు నిర్మాత అనిపించుకోవడం కంటే కావాల్సింది ఇంకేముంటుంది. ఆయన ఈ కథను నమ్మారు. అందుకే అంత మంచి పేరొచ్చింది. ఒక తోటి నటుడిగా, పరిశ్రమలో సీనియర్ యాక్టర్ గా చెప్పాలంటే.. యాక్షన్, డ్యాన్స్, ఎమోషన్స్, ఇంటెన్సిటీ, ఇన్వాల్వ్‌మెంట్.. ఒక నటుడికి అవసరమైన అన్ని కోణాల్లో పరిపక్వత సాధించి, దానిని 100 శాతం తెరపై చూపించిన రామ్ చరణ్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక తండ్రిగా గర్వపడుతున్నాను” ”రంగస్థలం’లో చరణ్ ఎంత అద్భుతంగా నటించాడో చూశాం. అలాంటి పాత్ర మళ్లీ రావాలంటే చాలా కాలం పడుతుందని అనుకున్నాం. ‘మగధీర’, ‘రంగస్థలం’, RRR లాంటి చిత్రాలు అరుదుగా వస్తాయి. కానీ మూడేళ్ల వ్యవధిలోనే ‘పెద్ది’లాంటి మరో గొప్ప పాత్ర రావడం ఆశ్చర్యంగా అనిపించింది. ఈ పాత్ర దక్కడం నిజంగా చరణ్ అదృష్టం. సినిమా చూస్తున్నప్పుడు మాకు చరణ్ కనిపించలేదు.. పెద్ది మాత్రమే కనిపించాడు. ఆ పాత్రను పూర్తిగా ఒంటబట్టించుకున్నాడు. దర్శకుడికి ఏం కావాలో దానిని అంకితభావంతో ఇచ్చాడు. పెద్ది పాత్రతో మనందరినీ నవ్వించాడు, ఏడిపించాడు, ఉత్సాహపరిచాడు, భావోద్వేగానికి గురిచేశాడు. చివరిగా విజయం సాధించాడు. కళ్లతోనే భావాలను పలికిస్తూ ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తెప్పించగలిగాడు. అదే పరిపూర్ణ నటన. ఈరోజు ఆ పరిపక్వతను, ఆ సంపూర్ణతను చూపించి చరణ్ నన్ను పూర్తిగా సంతృప్తిపరిచాడు” ”చరణ్ ఒక స్టార్ హీరో కొడుకు. గోల్డెన్ స్పూన్‌తో పుట్టాడు. ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. దర్శకుడు చెప్పింది చేసి వెళ్లిపోవచ్చు. కానీ అతను కష్టాన్ని నమ్ముకున్నాడు. అందుకే ఈరోజు అందరూ అతని నటన నేషనల్ అవార్డు స్థాయిలో ఉందని ప్రశంసిస్తున్నారు. అవార్డు రావచ్చు, రాకపోవచ్చు. కానీ ప్రజల మనసుల్లో ‘అద్భుతంగా నటించాడు’ అనే గుర్తింపు రావడం కంటే గొప్ప అవార్డు మరొకటి లేదు. ప్రజల ప్రేమ, అభిమానం, ఆదరణే గొప్ప అవార్డు. ఈ సినిమా కోసం అతను చేసిన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను నేను ప్రతిరోజూ ఇంట్లో చూశాను. ఉదయం వ్యాయామాలు, షూటింగ్, మళ్లీ సాయంత్రం వ్యాయామాలు.. అతని కష్టాన్ని చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా అనిపించేది” ”షూటింగ్ సమయంలో చరణ్ కంటికి గాయం అయింది. ఆ ఫొటో చూసి నేను చాలా భయపడ్డాను. డాక్టర్లతో మాట్లాడిన తర్వాత ప్రమాదం లేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నాను. ఎనిమిది కుట్లు పడ్డా వెనక్కి తగ్గలేదు. ఆ సమయంలో నాకు ‘గూండా’ సినిమా షూటింగ్ గుర్తొచ్చింది. ట్రైన్ కింద యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు మా నాన్న చాలా భయపడ్డారు. అప్పుడు ప్రేక్షకులను అలరించాలంటే ఇలాంటి రిస్కులు చేయాల్సిందే అన్నాను. ‘నీకు కొడుకు పుట్టి, వాడు హీరో అయి ఇలాంటి కష్టాలు పడితే అప్పుడు ఒక తండ్రి బాధ తెలుస్తుంది’ అని అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. చరణ్ కి గాయమైనప్పుడు మా నాన్న మాట గుర్తుకు వచ్చింది. అయితే తను కష్టాన్ని నమ్ముకోవడం తండ్రిగా నాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది” ”నిన్ననే ప్రధాని నరేంద్ర మోదీ గారితో కలిసి చరణ్ ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు. అక్కడ తనని ‘న్యూ ఏజ్ మెగాస్టార్’ అని పిలిచారు. నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. పిల్లలు ఎదుగుతున్నప్పుడు తండ్రికి కలిగే ఆనందం వర్ణించలేనిది. నేను ఈరోజు ఆ పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నాను. మేము ఎప్పుడూ కష్టాన్ని నమ్ముకున్నాం. ఆ కష్టానికి ప్రతిఫలంగా మీరు మమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు. ‘పెద్ది’ చిత్రాన్ని ఆదరించిన ప్రతి ఒక్కరికీ మా కుటుంబం తరఫున ధన్యవాదాలు. జగపతిబాబు, శివరాజ్ కుమార్ తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. జాన్వీ కపూర్ కూడా ఆకట్టుకుంది. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి నటీనటుడికి, ప్రతి టెక్నీషియన్‌కు అభినందనలు. రెహమాన్ సంగీతానికి అగ్రతాంబూలం ఇవ్వాలి. రత్నవేలు ‘పెద్ది’ ప్రపంచాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. విజువల్ వండర్‌ను సృష్టించారు” అని చిరంజీవి చెప్పుకొచ్చారు.
‘గోల్డెన్ స్పూన్’ సీక్రెట్ వెనుక కష్టం!
‘పెద్ది’ బ్లాక్ బస్టర్: చిరు ప్రశంసలు!
‘పెద్ది’ సినిమా సృష్టించిన ప్రభంజనం, రామ్ చరణ్ అద్భుత నటనపై మెగాస్టార్ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మెగా బ్లాక్ బస్టర్ విజయంపై మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్‌ల కోసం చూస్తూ ఉండండి!


