
📌 Key Points
- మెగాస్టార్ చిరంజీవికి భుజానికి కీహోల్ సర్జరీ విజయవంతం!
- డాక్టర్ నితిన్ నైపుణ్యంతో శస్త్రచికిత్స సజావుగా జరిగింది, చిరు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు.
- రెగ్యులర్ వర్క్స్‌లో పాల్గొంటున్న చిరంజీవి, అభిమానుల ఆందోళనకు తెర దించారు.
- చిరంజీవి ఆరోగ్యంపై అభిమానుల ప్రేమ, ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు తెలిపిన మెగాస్టార్!
మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయనకు భుజానికి సర్జరీ జరిగిందనే వార్త అభిమానులను కలవరానికి గురిచేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!
చిరంజీవికి భుజం శస్త్రచికిత్స
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి షోల్డర్ కు సర్జరీ జరిగిందని సమాచారం. గత రెండు మూడు రోజులుగా ఎడమ చేతికి షోల్డర్ బ్యాగ్ వేసుకొని కనిపిస్తున్నారు. చిరంజీవి షోల్డర్ బ్యాగ్ తో ఉన్న ఫోటో వైరల్ గా మారడంతో అభిమానులు ఆందోళన చెందుతూ ఆయనకు ఏమైంది అని కామెంట్స్ చేస్తున్నారు. (Chiranjeevi)
వైరల్ అవుతున్న ఫోటోలు
తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తన సర్జరీ గురించి తెలుపుతూ పోస్ట్ చేసారు. తనకు సర్జరీ చేసిన డాక్టర్ తో కలిసి దిగిన ఫోటో షేర్ చేసారు.
అభిమానుల ఆందోళన
ఈ ఫోటో షేర్ చేసి.. చేయికి బ్యాగ్ గమనించిన తర్వాత చాలా మంది శ్రేయోభిలాషులు నా ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఇది కేవలం ఒక చిన్న భుజం కీహోల్ సర్జరీ. నేను బాగా కోలుకుంటున్నాను, ఇప్పటికే నా రెగ్యులర్ వర్క్స్ మొదలు పెట్టాను. అత్యుత్తమ ఆర్థ్రోస్కోపీ సర్జన్లలో ఒకరైన డాక్టర్ నితిన్ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన నైపుణ్యంతో ఈ ప్రక్రియను సజావుగా, సౌకర్యవంతంగా చేసారు. మీ అందరి ప్రేమ, ఆందోళన మరియు ఆశీర్వాదాలకు ధన్యవాదాలు అని తెలిపారు. దీంతో చిరంజీవి పోస్ట్ కింద జాగ్రత్త అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
చిరంజీవి గారు త్వరగా కోలుకొని మళ్ళీ సినిమాలతో సందడి చేయాలని ఆశిద్దాం. ఆయన ఆరోగ్యానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


