
📌 Key Points
- నిర్మాత సాహు గారపాటి, సుస్మిత కొణిదల మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు.
- చిరంజీవి థియేటర్లలో పాప్ కార్న్, ఫుడ్ ధరల పెరుగుదలను తీవ్రంగా గమనించారు.
- త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో ఈ విషయంపై చిరంజీవి చర్చించనున్నారు.
- సంక్రాంతి పండుగ తర్వాత ఈ చర్చలు జరిగే అవకాశం ఉందని నిర్మాతలు వెల్లడించారు.
మెగాస్టార్ చిరంజీవి థియేటర్లలో అధిక ఫుడ్ ధరలపై తీవ్రంగా స్పందించారు. ఈ విషయంపై ప్రభుత్వాలతో మాట్లాడతానని నిర్మాతలు వెల్లడించారు. తాజా సినిమా ప్రమోషన్లలో భాగంగా సాహు గారపాటి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ప్రేక్షకులకు భారం తగ్గించడమే చిరంజీవి లక్ష్యం.
చిరంజీవి దృష్టికి థియేటర్ల ధరల సమస్య
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో రాబోతున్నారు. జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదల మీడియాతో మాట్లాడారు.(Chiranjeevi)
అయితే ఇటీవల కొన్ని సినిమాలకు, ప్రీమియర్స్ కి టికెట్ రేట్లు పెంచేస్తున్నారు. అంతే కాకుండా మల్టీప్లెక్స్ లతో పాటు, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో కూడా పాప్ కార్న్, కూల్ డ్రింక్, ఫుడ్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీని మీద ఎప్పట్నుంచో కంప్లైంట్ ఉంది. అసలు ఈ ధరలు ఎక్కువగా ఉండటం వల్లే జనాలు కూడా థియేటర్స్ కి రావడం తగ్గించేశారు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వాలతో చిరంజీవి చర్చలు: నిర్మాత వెల్లడి
అయితే నిర్మాతలు టికెట్ రేట్ల మీద స్పందిస్తున్నా, కేవలం పెద్ద సినిమాలకు, భారీ బడ్జెట్ సినిమాలకే టికెట్ రేట్లు పెంచుతున్నా పాప్ కార్న్, కూల్ డ్రింక్, ఫుడ్ విషయం మాకు సంబంధం లేదు, అది థియేటర్స్ వాళ్ళకే సంబంధం, అది ప్రభుత్వాలే చూసుకోవాలి అని అంటున్నారు. ఈ విషయంపై మన శంకర వరప్రసాద్ గారు నిర్మాతలను ప్రశ్నించారు.
సాహు గారపాటి దీనిపై స్పందిస్తూ.. టికెట్ రేట్లు సంవత్సరం మొత్తం మీద ఓ పది సినిమాలకు మాత్రమే పెంచుతున్నారు. కేవలం భారీ బడ్జెట్, పెద్ద సినిమాలకు మాత్రమే పెంచుతున్నారు. పాప్ కార్న్, కూల్ డ్రింక్స్, ఫుడ్ విషయం మా చేతుల్లో లేదు. కానీ వీటివల్ల జనాలు థియేటర్స్ కి రావడం తగ్గించేశారు అని చిరంజీవి గారు కూడా గమనించారు. త్వరలోనే చిరంజీవి ఫుడ్ రేట్ల విషయంలో రెండు ప్రభుత్వాలతో మాట్లాడతాను అని కూడా చెప్పారు. ఈ సినిమా హడావిడి, సంక్రాంతి అయ్యాక చిరంజీవి ప్రభుత్వాలను కలిసి ఈ విషయం మాట్లాడే అవకాశం ఉంది అని తెలిపారు.
టికెట్ ధరలు vs ఫుడ్ ధరలు: అసలు సమస్య ఏది?
దీంతో త్వరలోనే చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కలవబోతున్నారని తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి, సీఎం చంద్రబాబు లతో చిరంజీవికి మంచి సంబంధాలే ఉన్నాయి. ఏపీలో తమ్ముడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. కాబట్టి చిరంజీవి థియేటర్స్ లో ఫుడ్ రేట్ల విషయం గురించి మాట్లాడితే ప్రభుత్వం స్పందించే అవకాశం ఉంది.
చిరంజీవి ప్రభుత్వాలతో చర్చలు జరిపితే, థియేటర్లలో ఫుడ్ ధరల సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఆయన చొరవతో ప్రేక్షకులకు థియేటర్ అనుభవం మరింత అందుబాటులోకి వస్తుందని సినీ వర్గాలు ఆశిస్తున్నాయి.


