|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Rajamouli : నిజంగా మహేష్ బాబు గ్రేట్.. ఈ రోజుల్లో అసలు అలా ఉండగలరా.. రాజమౌళి వ్యాఖ్యలు వైరల్..

Published: 15-11-2025, 10:41 PM
Rajamouli : నిజంగా మహేష్ బాబు గ్రేట్.. ఈ రోజుల్లో అసలు అలా ఉండగలరా.. రాజమౌళి వ్యాఖ్యలు వైరల్..

రాజమౌళి-మహేష్ బాబు వారణాసి సినిమా లాంచ్ ఈవెంట్‌లో రాజమౌళి మహేష్ బాబు వ్యక్తిత్వం, అంకితభావంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షూటింగ్ సమయంలో ఫోన్ వాడకపోవడం, రాముడి గెటప్‌పై ఆయన ప్రశంసలు వైరల్‌గా మారాయి. ఇది సినిమాపై అంచనాలను పెంచింది.

Key Points

1

మహేష్ బాబు అద్భుతమైన వ్యక్తిత్వం, నిబద్ధతపై రాజమౌళి వ్యాఖ్యలు.

2

షూటింగ్ సమయంలో మహేష్ బాబు ఫోన్‌ను అస్సలు చూడరని రాజమౌళి తెలిపారు.

4

రాజమౌళి వ్యాఖ్యలతో వారణాసి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మహేష్ బాబు అంకితభావం, వ్యక్తిత్వం

Rajamouli : సినిమా స్టార్స్ వర్క్ విషయంలో, ఫుడ్, వ్యాయామం.. ఇలాంటి వాటిల్లో చాలా నిబద్ధతగా ఉంటారని తెలిసిందే. మహేష్ బాబు అయితే మరింత స్ట్రాంగ్ గా ఉంటారు. ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా తింటారు మహేష్. అయితే మరో విషయంలో మహేష్ బాబు చాలా స్ట్రాంగ్ గా ఉంటారని రాజమౌళి చెప్పారు.(Rajamouli)

రాజమౌళి – మహేష్ వారణాసి సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ నిన్న రామోజీ ఫిలిం సిటీ ఘనంగా జరిగింది. ఈ సినిమా ఈవెంట్లో రాజమౌళి మహేష్ గురించి ఆసక్తికర విషయం తెలిపారు.

రాముడి గెటప్‌పై రాజమౌళి ప్రశంసలు

రాజమౌళి మాట్లాడుతూ.. మహేష్ కష్టం గురించి తర్వాత మాట్లాడతాను. కానీ ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడతాను. ఆయన నుంచి మనం నేర్చుకునే లక్షణం ఒకటి ఉంది. మన అందరం సెల్ ఫోన్ లేకుండా ఉండలేము ఈ రోజుల్లో. కానీ మహేష్ బాబు షూటింగ్ కి వస్తే అసలు ఫోన్ చూడరు. ఫోన్ కార్ లో పెట్టేసి వస్తారు. ఏడెనిమిది గంటలు అయినా ఫోన్ జోలికి పోరు. అస్సలు ఫోన్ చూడరు. నేను కూడా మహేష్ లా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఈ విషయం కచ్చితంగా ఆయన నుంచి నేర్చుకోవాలి అని అన్నారు.

వారణాసి సినిమాపై భారీ అంచనాలు

అలాగే.. ఈ సినిమాలో మహేష్ బాబు రాముడి గెటప్ లో కనపడనున్నారు. ఆయనకు రాముడిలా టెస్ట్ లుక్ చేసిన తర్వాత నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఆయన రాముడి ఫోటోని నా ఫోన్ వాల్ పేపర్ గా పెట్టుకున్నాను. కానీ ఎవరైనా చూస్తే లీక్ చేస్తారని తేసేసాను. రాముడి పాత్రలో అద్భుతంగా నటించారు అని అన్నారు రాజమౌళి. దీంతో వారణాసి సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

రాజమౌళి వ్యాఖ్యలు మహేష్ బాబు నిబద్ధతను, వారణాసి సినిమాపై నెలకొన్న భారీ అంచనాలను స్పష్టం చేస్తున్నాయి. రాముడి గెటప్ లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే, రాజమౌళి వ్యక్తం చేసిన ఉత్సాహం సినిమా విజయంపై నమ్మకాన్ని కలిగిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.