|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరంజీవితో అనుకోని వెంక‌టేష్‌తో తీశారు – కృష్ణంరాజు కేసుతో బ్లాక్‌బ‌స్ట‌ర్ కావాల్సిన‌ మూవీ డిజాస్ట‌ర్ – ఆ సినిమా ఏదంటే!

Published: 07-05-2025, 12:46 AM
చిరంజీవితో అనుకోని వెంక‌టేష్‌తో తీశారు - కృష్ణంరాజు కేసుతో బ్లాక్‌బ‌స్ట‌ర్ కావాల్సిన‌ మూవీ డిజాస్ట‌ర్ - ఆ సినిమా ఏదంటే!

ఒక హీరోతో ప్రారంభించి మరో హీరోతో పూర్తయిన సినిమా కథ ఇది. కొండపల్లి రాజా సినిమా చిరంజీవితో ప్రారంభమై వెంకటేష్‌తో విడుదలైంది. కానీ, కృష్ణంరాజు కేసు ఈ సినిమా విధిని మార్చివేసింది.

Key Points

1

చిరంజీవితో ప్రారంభించి వెంకటేష్‌తో పూర్తయిన కొండపల్లి రాజా

2

అన్నామలై రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ డే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

4

కేసు వల్ల సినిమా ప్రింట్స్ సీజ్ అయ్యాయి, భారీ నష్టాలు సంభవించాయి.

కొండపల్లి రాజా: అనుకోని మలుపులు

ఓ హీరోతో సినిమా అనుకొని మ‌రో హీరోతో తీయ‌డం అన్న‌ది ఇండ‌స్ట్రీలో కామ‌న్‌గా క‌నిపిస్తుంది. అలా వ‌చ్చిన చాలా సినిమాలు బ్లాక్‌బ‌స్ట‌ర్స్ అయ్యాయి. డిజాస్ట‌ర్లుగా నిలిచిన‌వి ఉన్నాయి. ఓ స్టార్ హీరో న టించిన మూవీ ఫ‌స్ట్ డే సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకున్నది. కానీ అనూహ్యంగా మ‌రో హీరో పెట్టిన కేసు కార‌ణంగా బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచింది. నిర్మాత‌కు న‌ష్టాలు తెచ్చిపెట్టింది. ఆ సినిమానే కొండ‌ప‌ల్లి రాజా.

వెంక‌టేష్ హీరోగా ర‌విరాజా పినిశెట్టి ద‌ర్శ‌క‌త్వంలో 1993లో కొండ‌ప‌ల్లి రాజా మూవీ రిలీజైంది. త‌మిళంలో ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన అన్నామ‌లై రీమేక్‌గా కొండ‌ప‌ల్లి రాజాను తెర‌కెక్కించారు ర‌విరాజా పినిశెట్టి. తొలుత అన్నామ‌లై రీమేక్‌ను చిరంజీవితో చేయాల‌ని ప్రొడ్యూస‌ర్ అనుకున్నార‌ట‌.

చిరంజీవికి కూడా క‌థ న‌చ్చ‌డంతో ఈ రీమేక్‌లో న‌టించ‌డానికి అంగీక‌రించార‌ట‌. వెంక‌టేష్‌కు కూడా అన్నామ‌లై క‌థ న‌చ్చ‌డంతో ఈ సినిమా చేయ‌డానికి ముందుకొచ్చార‌ట‌. అప్ప‌టికే వెంక‌టేష్‌తో ఓ సినిమా చేస్తోన్న ఆ ప్రొడ్యూస‌ర్‌…కొండ‌ప‌ల్లి రాజాను కూడా చిరంజీవి ని కాద‌ని వెంక‌టేష్‌తోనే రీమేక్ చేయాల‌ని ఫిక్స‌య్యారు.

చిరంజీవి నుండి వెంకటేష్ వరకు

వెంక‌టేష్ మార్కెట్‌కు మించి భారీ బ‌డ్జెట్‌తో కొండ‌ప‌ల్లి రాజాను తెర‌కెక్కించారు. యాక్ష‌న్ డ్రామా మూవీలో సుమ‌న్ మ‌రో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌గా… న‌గ్మా హీరోయిన్‌గా న‌టించింది. భారీ అంచ‌నాల న‌డుమ కొండ‌ప‌ల్లి రాజా రిలీజైంది.

ఫ‌స్ట్ డేనే ఈ సినిమా సూప‌ర్ హిట్ టాక్‌ను తెచ్చుకున్న‌ది. కొండ‌ప‌ల్లి రాజా క‌థ త‌న‌ది అంటూ కృష్ణంరాజు కోర్టును ఆశ్ర‌యించ‌డంతో సీన్ మొత్తం రివ‌ర్స్ అయ్యింది. ఈ సినిమా ప్రింట్స్‌ను సీజ్ చేయాలంటూ కృష్ణంరాజు కేసు వేయ‌డంతో రెండో రోజే చాలా థియేట‌ర్ల‌లో నుంచి సినిమాను తీసేశారు.

కృష్ణంరాజు కేసు ప్రభావం

ర‌జ‌నీకాంత్ అన్నామ‌లై సినిమా హిందీ లో ఖుద్‌గ‌ర్జ్ అనే సినిమాకు రీమేక్‌. ఖుద్‌గ‌ర్జ్ తెలుగు రీమేక్ రైట్స్‌ను కృష్ణంరాజు తీసుకున్నారు. ఈ మూవీ ఆధారంగా ప్రాణ స్నేహితులు అనే సినిమా చేశారు. ఆ ప్రాణం స్నేహితులు క‌థ‌నే మ‌రోసారి వెంక‌టేష్ కొండ‌ప‌ల్లి రాజాగా తీశారు.

తెలుగు రీమేక్ హ‌క్కులు త‌న పేరిట ఉండ‌టంతోనే కృష్ణంరాజు కోర్టులో కేసు వేసిన‌ట్లు అప్ప‌ట్లో వార్త‌లొచ్చాయి. ఆ త‌ర్వాత కృష్ణంరాజు కాంప్ర‌మైజ్ అయిపోయి కేసు వెన‌క్కి తీసుకున్నారు. అప్ప‌టికే కొండ‌ప‌ల్లి రాజాకు జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. హిట్టు టాక్ తెచ్చుకున్న సినిమా యావ‌రేజ్‌గా నిలిచింది. నిర్మాత‌ల‌కు న‌ష్టం తెచ్చిపెట్టింది. ఆ త‌ర్వాత ర‌జ‌నీకాంత్ అన్నామ‌లై సినిమా కూడా తెలుగులోకి డ‌బ్ కావ‌డం గ‌మ‌నార్హం.

చిరంజీవితో ప్రారంభమై వెంకటేష్‌తో విడుదలైన కొండపల్లి రాజా, కృష్ణంరాజు కేసుతో బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. అనుకున్నంత బ్లాక్ బస్టర్ కాకుండా డిజాస్టర్ గా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.