|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పిన అమ్మ అంజనాదేవి వార్నింగ్‌, లేకపోతే మెగాస్టార్‌గా చూసేవాళ్లం కాదా!

Published: 03-11-2025, 7:07 AM
చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పిన అమ్మ అంజనాదేవి వార్నింగ్‌, లేకపోతే మెగాస్టార్‌గా చూసేవాళ్లం కాదా!

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ ప్రారంభంలో విలన్‌ పాత్రలు పోషించారు. అయితే ఆయన తల్లి అంజనాదేవి ఇచ్చిన కీలకమైన వార్నింగ్‌తో చిరంజీవి హీరోగా మారారు. ఆ తల్లి సలహాయే ఆయనను మెగాస్టార్‌గా ఎలా నిలబెట్టిందో ఈ కథనంలో తెలుసుకుందాం.

Key Points

1

చిరంజీవి కెరీర్ ప్రారంభంలో విలన్‌, సెకండ్‌ లీడ్‌ పాత్రలు పోషించారు.

2

నటుడిగా నిరూపించుకోవాలన్నదే ఆయన ప్రధాన లక్ష్యం, దాన్ని సాధించారు.

4

`ఖైదీ` చిత్రంతో చిరంజీవికి బిగ్‌ బ్రేక్‌ వచ్చి మెగాస్టార్‌గా ఎదిగారు.

చిరంజీవి ప్రారంభ కెరీర్: విలన్ పాత్రలు

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌ ప్రారంభంలో సెకండ్‌ లీడ్‌, నెగిటివ్‌ రోల్స్ చేశారు. చాలా సినిమాల్లో విలన్‌ పాత్రలతో మెప్పించారు. అలా విలన్‌గా మెప్పించి ఆ తర్వాత హీరోగా టర్న్ తీసుకున్నారు. కాకపోతే చాలా సినిమాల్లో ఆయన విలన్‌ పాత్రలు పోషించడం గమనార్హం. ఆ తర్వాత హీరోగా టర్న్ తీసుకున్నారు. అయితే ప్రారంభంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని కాదనకుండా చేశారు. తన పాత్రకు ప్రయారిటీ ఉందా లేదా అనేదే చూశారు తప్పితే, పాజిటివ్‌గా ఉందా, నెగటివ్ గా అనేది పట్టించుకోలేదు. నటుడిగా తాను నిరూపించుకోవాలన్నదే చిరంజీవి తాపత్రయం. ఆ విషయంలో సక్సెస్‌ అయ్యారు.

ఆ తర్వాత పూర్తి స్థాయి హీరోగా మారిపోయాయి. దర్శక నిర్మాతలు కూడా ఆయన్ని హీరోగా చూపించేందుకు ఆసక్తి చూపించారు. దీంతో బ్యాక్‌ టూ బ్యాక్‌ హీరోగా సినిమాలు చేస్తూ ఒక్కో మెట్టు ఎదిగారు చిరంజీవి. `రాణికాసుల రంగమ్మ`, `శ్రీరస్తు శుభమస్తు`, `కిరాయి రౌడీ`, `ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య`, `శుభలేఖ` వంటి చిత్రాలతో హీరోగా నిరూపించుకున్నారు. స్టార్‌ అయిపోయారు. 1983లో `ఖైదీ` చిత్రంతో ఆయన బిగ్‌ బ్రేక్‌ అందుకుని తిరుగులేని స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత చిరంజీవి హవా సాగిందని చెప్పొచ్చు. 1980-20 వరకు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేశారు. ఎన్నో బ్లాక్‌ బస్టర్స్ అందుకున్నారు. మెగాస్టార్‌గా ఎదిగారు. అదే క్రేజ్‌తో ఇప్పటికీ రాణిస్తున్నారు. ఆ తర్వాత తరం హీరోలు ఎంత మంది వచ్చినా చిరంజీవి స్థానం పదిలం అని చెప్పొచ్చు.

అంజనాదేవి వార్నింగ్: కెరీర్ మలుపు

ఇదిలా ఉంటే చిరంజీవి హీరోగా టర్న్ తీసుకోవడం వెనుక, మెగాస్టార్‌గా రాణించే విషయం వెనుక వాళ్ల అమ్మ అంజనాదేవి పాత్ర కీలకమట. ప్రారంభంలో చిరంజీవి విలన్‌ రోల్స్, నెగటివ్‌ షేడ్స్ ఉన్న రోల్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇలా వరుసగా చిరంజీవిని విలన్‌ రోల్స్ లో చూసిన అమ్మ అంజనాదేవి విసిగిపోయిందట. ఎందుకు రా ఎప్పుడూ అవే పాత్రలు చేస్తున్నావ్‌, కాస్త మంచిగా ఉండే పాత్రలు చేయోచ్చుగా అని చెప్పిందట. చాలా సార్లు చెప్పినా చిరు వినలేదట. దీంతో కొన్ని రోజులు మాట్లాడలేదట. దీన్ని సీరియస్‌గా తీసుకున్న చిరంజీవి చాలా జాగ్రత్తగా మూవీస్‌ చేసుకుంటూ వచ్చారు. నెగటివ్‌ రోల్స్ తగ్గించి పాజిటివ్‌ రోల్స్ చేశారట. ఆ తర్వాత వచ్చిన సినిమాలే `రాణికాసుల రంగమ్మ`, `శ్రీరస్తు శుభమస్తు`, `కిరాయి రౌడీ`, `ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య`, `శుభలేఖ`. ఇవి నటుడుగా చిరంజీవిని మరో మెట్టు ఎక్కించడంతోపాటు హీరోగానూ గుర్తింపుని తీసుకొచ్చాయి.

అలా ప్రత్యక్షంగానో, పరోక్షంగానే చిరంజీవి కెరీర్‌ మలుపు తిరగడానికి అంజనాదేవి కారణమయ్యిందట. మొత్తంగా చిరంజీవికి హీరోగా అదిరిపోయే సినిమాలు పడ్డాయి. వాటి కోసం ఆయన కూడా కష్టపడ్డారు. నటుడిగానే కాదు, యాక్షన్‌, డాన్సులు, కామెడీ చేస్తూ వచ్చారు. అన్ని వర్గాల ఆడియెన్స్ ని అలరించారు. చిరంజీవి సినిమాకి వెళితే అన్ని వర్గాల ఆడియెన్స్ ఎంజాయ్‌ చేస్తారనే ముద్ర పడిపోయింది. ముఖ్యంగా మాస్‌ ఆడియెన్స్ బాగా ఎంజాయ్‌ చేసేవారు. అది ఆయనకు బాగా కలిసొచ్చింది. మాస్‌ ఫాలోయింగ్‌ పెరిగేలా చేసింది. అదే ఇన్నాళ్లు ఆయన్ని తిరుగులేని స్టార్‌ని చేసిందని చెప్పొచ్చు.

మెగాస్టార్‌గా చిరంజీవి ఎదుగుదల

చిరంజీవి ఇప్పుడు కూడా అదే మెగాస్టార్ ఇమేజ్‌తో రాణిస్తున్నారు. యంగ్‌ హీరోలకు పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కాబోతుంది. దీంతోపాటు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో `మన శంకరవరప్రసాద్‌ గారు` మూవీలో నటిస్తున్నారు. ఇందులో నయనతార హీరోయిన్. ఇది సంక్రాంతికి విడుదల కానుంది. దీంతోపాటు శ్రీకాంత్‌ ఓడెల దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు. అలాగే బాబీ దర్శకత్వంలో మరో సినిమాకి కమిట్‌ అయ్యారు చిరంజీవి.

చిరంజీవి కెరీర్ మలుపులో అమ్మ అంజనాదేవి పాత్ర ఎంతో కీలకం. ఆమె సలహా లేకపోయి ఉంటే, ఈరోజు మనం చూస్తున్న మెగాస్టార్‌ చిరంజీవిని చూసి ఉండేవాళ్లం కాదేమో. ఆ తల్లి ప్రేమ, మార్గదర్శకత్వమే ఆయన్ను శిఖరాగ్రానికి చేర్చింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.