
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొత్త ఇంటి ఫోటోలు షేర్ చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. దసరా పండుగ సందర్భంగా ఈ ‘కొత్త ప్రయాణం’ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఆమె పెళ్లి, ఇల్లు కొనుగోలుపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Key Points
సమంత పండుగ పూట కొత్త ప్రయాణం స్టార్ట్ చేసినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించింది.
కొత్త ఇంటి ఫోటోలు షేర్ చేయగా, గోడపై ఆమె నిక్‌నేమ్ 'సామ్' లోగో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ పోస్ట్ హైదరాబాద్ లేదా ముంబైలో ఇల్లు కొనుగోలుపై నెటిజన్ల మధ్య చర్చకు దారితీసింది.
రాజ్ నిడిమోరుతో ఆమె పెళ్లి చేసుకుని అందులో ఉండబోతుందా అని నెటిజన్లు ఊహాగానాలు చేస్తున్నారు.
సమంత కొత్త ప్రయాణం: దసరా సర్‌ప్రైజ్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గత కొద్ది కాలంగా సినిమాలకు దూరం అయిన విషయం తెలిసిందే. ఓ పాడ్ కాస్ట్ ద్వారా అభిమానులకు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు చెప్తోంది. ఇక ఇటీవల ఆమె నిర్మాతగా మారి ‘శుభం’ (Shubham)చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు రక్త్ బ్రహ్మండ్:ది బ్లడీ కింగ్‌డమ్, మా ఇంటి బంగారం వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక సమంత పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఆమె గత కొద్ది కాలంగా రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తున్నట్లు పలు పుకార్లు చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరు కలిసి పలు వెకేషన్స్‌కు కూడా వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
రాజ్ నిడిమోరుతో పెళ్లి పుకార్లు
ఇక ఇటీవల జిమ్‌కు వెళ్లిన సామ్, రాజ్ కలిసి ఒకే కారులో వెళ్లడం విశేషం. ఇక వాటిని చూసిన నెటిజన్లు వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకుంటారని చర్చించుకుంటున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, సమంత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ గుడ్ న్యూస్ ప్రకటించింది. దసరా పండుగ వేళ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. కొత్త ప్రయాణం స్టార్ట్ అంటూ కొత్తింటి ఫొటోలను షేర్ చేసింది. ఇంటి గోడపై ఆమె నిక్‌నేమ్ సామ్ లోగో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆమె హైదరాబాద్‌లో ఇల్లు కోనుగోలు చేసిందా? లేక ముంబయిలో తీసుకున్నారా? అని సందేహాలు వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే మరికొందరు మాత్రం అసలు ఈ ఇల్లును ఎందుకు కొన్నట్లు త్వరలో రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకుని అందులో ఉండబోతుందా? అని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.
కొత్త ఇల్లు ఎక్కడ? నెటిజన్ల చర్చ
A post shared by Samantha (@samantharuthprabhuoffl)
సమంత కొత్త ఇంటి ప్రకటన పలు సందేహాలకు తావిచ్చింది. ఆమె కెరీర్, వ్యక్తిగత జీవితంపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. రాజ్ నిడిమోరుతో పెళ్లి పుకార్లకు ఈ కొత్త ఇల్లు మరింత ఆజ్యం పోసింది. దీనిపై త్వరలో క్లారిటీ వస్తుందని ఆశిద్దాం.


