|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి! దేవరకొండ ఫ్యామిలీలో సెలబ్రేషన్స్.. వైరల్ ఫోటోలు!

Published: 26-02-2026, 2:35 PM
షాకింగ్: విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి! దేవరకొండ ఫ్యామిలీలో సెలబ్రేషన్స్.. వైరల్ ఫోటోలు!
  • విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి రాజస్థాన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది! అభిమానుల ఆనందానికి అవధుల్లేవ్!!
  • దేవరకొండ కుటుంబంలోకి రష్మిక అడుగుపెట్టడంతో ఆనంద్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్ వైరల్!!
  • అన్నా వదినల బంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న ఆనంద్!
  • విజయ్, రష్మికల జోడి టాలీవుడ్‌లో ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు!

టాలీవుడ్ మోస్ట్ లవ్డ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వీరి వివాహం రాజస్థాన్‌లో జరిగిందని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రాజస్థాన్‌లో గ్రాండ్‌గా విజయ్, రష్మిక పెళ్లి!

పెళ్లి చేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ – ర‌ష్మిక‌

స‌న్నిహితుల స‌మ‌క్షంలోనే వివాహ వేడుక‌

అన్నా, వదిన అంటూ ఆనంద్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్

వదినతో ఆనంద్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda), రష్మిక ( Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇద్దరు ఇండస్ట్రీలో ఫ్యూచర్ స్టార్స్ గా ఎదుగుతున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు సెలబ్రిటీలు తమ సినిమాలతో సక్సెస్ అయ్యారు. విజయ్ దేవరకొండ కంటే రష్మిక దూకుడు మరింత వేగంగా ఉంది. అయితే అలాంటి విజయ్ దేవరకొండ, రష్మిక మందాన ఇద్దరు పెళ్లి పీటలెక్కారు. చాలా రోజుల నుంచి సీక్రెట్ గా ప్రేమించుకుంటున్న ఈ జంట, నేరుగా పెళ్లి చేసుకొని తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించేసింది. రాజస్థాన్ లోని ఉదయపూర్ లో ఉన్న ఓ ప్రముఖ ప్యాలెస్ లో విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది.

గురువారం ఉదయం 10:10 గంటలకు రష్మిక మెడలో విజయ్ దేవరకొండ మూడు ముళ్ళు వేశాడు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఈ జంట పెళ్లి జరిగింది. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ, రష్మిక జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు. ఇక గురువారం సాయంత్రం కర్ణాటక సంప్రదాయం కొడువ పద్దతిలో కూడా ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ర‌ష్మిక‌ది క‌ర్ణాట‌క అన్న సంగ‌తి తెలిసిందే. ఈ త‌రుణంలోనే తెలంగాణ‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల సంప్ర‌దాయాల ప్ర‌కారం హీరో విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda), రష్మిక ( Rashmika Mandanna) వివాహం జ‌రిగింద‌ని స‌న్నిహితులు చెబుతున్నారు.

విజయ్, రష్మికల క్యూట్ ఫోటోలు వైరల్!

టాలీవుడ్ అగ్ర హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందాన పెళ్లి జరిగిన నేపథ్యంలో ఆనంద్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. వదిన తమ కుటుంబంలో ఇప్పుడు భాగమయ్యారు.. అంటూ విజయ్ దేవరకొండ, రష్మిక తో కలిసి దిగిన ఫోటోను ఆనంద్ దేవరకొండ ( Anand Deverakonda ) పంచుకున్నారు. ఇన్ని రోజుల పాటు మా కుటుంబంలో నలుగురు మాత్రమే ఉండేవారు.. ఇక ఇప్పుడు మరొకరు జాయిన్ అయ్యారు. ఆమెని మా వదినమ్మ రష్మిక అంటూ వెల్లడించాడు ఆనంద్ దేవరకొండ. ఇందులో భాగంగానే కొత్త జంటను హగ్ చేసుకుని మరి ఫోటోను పంచుకున్నాడు ఆనంద్ దేవరకొండ. ఈ రోజు నా సోద‌రుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ పెళ్లి చేసుకున్నాడు. మా వదిన ర‌ష్మిక మూడు ముళ్లు వేశావు. మా వ‌దిన‌ అత్యంత సానుకూల, కరుణ ఉన్న‌ వ్యక్తి, అలాంటి వ్య‌క్తిని నా అన్న విజ‌య్ వివాహం చేసుకున్నాడు. ఇక జీవితాంతం, వారు ఇలాగే నవ్వుతూ ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను అంటూ రాసుకొచ్చాడు ఆనంద్. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

A post shared by Anand Deverakonda (@ananddeverakonda)

విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వారిద్దరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుందాం. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.