|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: సినిమాలకు శ్రీలీల గుడ్ బై? వరుస ఫ్లాప్ లతో సంచలన నిర్ణయం!

Published: 23-03-2026, 2:05 AM
షాకింగ్: సినిమాలకు శ్రీలీల గుడ్ బై? వరుస ఫ్లాప్ లతో సంచలన నిర్ణయం!
  • శ్రీలీల నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది.
  • సోషల్ మీడియా విమర్శలు చూసి సినిమా ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోవాలని అనుకున్నట్లు శ్రీలీల తెలిపారు.
  • ధమాకా సినిమా తర్వాత శ్రీలీలకు సరైన సక్సెస్ రాలేదు.
  • ప్రస్తుతం తమిళంలో శివ కార్తికేయన్ సరసన నటిస్తున్నారు.

శ్రీలీల టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే, ఈ మధ్య ఆమె నటించిన సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో, శ్రీలీల సినిమా ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఆమె స్వయంగా స్పందించారు.

వరుస ఫ్లాప్ లతో శ్రీలీల కెరీర్ పై నీలినీడలు

Sreeleela: శ్రీలీల పరిచయం అవసరం లేని పేరు. నటిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈమె ఇప్పటికీ ఒక డజనుకు పైగా సినిమాలలో నటించి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. అయితే ఇటీవల కాలంలో శ్రీలీల(Sreeleela) నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవడంతో ఈమె కెరియర్ ఇబ్బందులలో పడిందనే చెప్పాలి. ఇలా ఏ ఒక్క సినిమా కూడ శ్రీలీలకు కలిసి రాకపోవడంతో ఈమె అభిమానులు కూడా ఎంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న శ్రీలీలకు మరొకసారి కూడా నిరాశ ఎదురయింది.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను మాత్రం చేరుకోలేకపోయింది దీంతో లీలమ్మకు మరోసారి విమర్శలు తప్పలేదు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన కెరియర్ గురించి అలాగే సోషల్ మీడియాలో వచ్చిన విమర్శల గురించి స్పందిస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. శ్రీలీల కెరియర్ మొదట్లో తన గురించి వచ్చిన విమర్శలు చూసే చాలా భయం వేసిందని తెలిపారు. ఆ సమయంలో తాను సినిమా ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు.

సోషల్ మీడియా విమర్శలపై శ్రీలీల స్పందన

ఇలా సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు చూసి చాలా ఏడ్చాను, భయపడ్డాను, బాధపడ్డాను. అమ్మ దగ్గరకు వెళ్లి ఇదంతా నావల్ల అవుతుందా ? తిరిగి కాలేజీకి వెళ్లిపోనా? అంటూ బాగా ఏడ్చానని శ్రీలీల తెలిపారు. నిజానికి నేను చాలా సెన్సిటివ్ కానీ ఇప్పుడు చాలా ధైర్యం తెచ్చుకున్నానని వాటన్నింటినీ తాను ఎంతో ధైర్యంగా ఎదుర్కోగలుగుతున్నాను అంటూ శ్రీ లీల తనపై వచ్చిన విమర్శలు గురించి ఈ సందర్భంగా మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈమెకు తెలుగులో ఒక ధమాకా సినిమా తప్ప మిగిలిన ఏ సినిమా కూడా సరైన సక్సెస్ అందించలేకపోయింది. వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ నిరాశ మాత్రమే మిగులుతుంది. ఇలా వరుస డిజాస్టర్ సినిమాలు వచ్చినప్పటికీ ఈమెకు మాత్రం అవకాశాలు కూడా కొదువ లేకుండా ఉన్నాయి.

ప్రశ్నార్థకంగా శ్రీలీల కెరియర్..

తమిళంలో అవకాశాలు అందుకుంటున్న శ్రీలీల

ప్రస్తుతం శ్రీలీలకు తెలుగులో మాత్రమే కాకుండా, తమిళంలో కూడా కూడా అవకాశాలను అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల శివ కార్తికేయన్ హీరోగా నటించిన పరాశక్తి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్న ఈమె ప్రస్తుతం ధనుష్ సినిమాలో నటిస్తున్నారు. ఇలా తమిళ సినిమాలు ,బాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నప్పటికీ హిట్లు మాత్రం లేకపోవడంతో ఈమె కెరియర్ ప్రశ్నార్థకంగా మిగిలిందనే చెప్పాలి.

మొత్తానికి శ్రీలీల కెరీర్ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఆమె తీసుకునే నిర్ణయం ఆమె భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆమె అభిమానులు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.