|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరంజీవి కూతురు సుస్మితకు ఇష్టమైన హీరో ఎవరు? ఊహించని పేరు చెప్పిన మెగా డాటర్!

Published: 06-01-2026, 7:00 AM
చిరంజీవి కూతురు సుస్మితకు ఇష్టమైన హీరో ఎవరు? ఊహించని పేరు చెప్పిన మెగా డాటర్!
  • సుస్మిత కొణిదెల తండ్రి చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్ర నిర్మాత.
  • సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన ఫేవరేట్ హీరోను ఆమె రివీల్ చేసింది.
  • మెగాస్టార్, పవర్ స్టార్ కాకుండా ఆమె రజినీకాంత్ పేరును చెప్పింది.
  • పవన్ కళ్యాణ్ తో కూడా సినిమా చేయమని అడిగానని సుస్మిత తెలిపింది.

చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల ఇప్పుడు తండ్రితోనే సినిమా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆమె, తన ఫేవరేట్ హీరో ఎవరో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. మెగాస్టార్, పవర్ స్టార్ కాకుండా ఆమె చెప్పిన పేరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సుస్మిత కొణిదెల: నిర్మాతగా, స్టైలిస్ట్ గా

Sushmita Konidela : మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఆల్మోస్ట్ అందరూ సినీ పరిశ్రమలో ఉన్నారు. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల నిర్మాతగా గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే సంస్థ స్థాపించి సినిమాలు, సిరీస్ లు చేస్తున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే పలు సిరీస్ లు, ఓ సినిమా నిర్మించగా సుస్మిత కొణిదెల ఇప్పుడు తండ్రినే హీరోగా పెట్టి సినిమా చేస్తుంది. మరో వైపు తండ్రికి స్టైలిస్ట్ గా, చిరంజీవి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా వర్క్ చేస్తుంది.(Sushmita Konidela)

అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 రిలీజ్ కానుంది. ఈ సినిమాను సాహు గారపాటి, చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు ఇద్దరు నిర్మాతలు మీడియాతో మాట్లాడారు.

ఫేవరేట్ హీరో ప్రశ్న: సుస్మిత స్పందన

ఈ క్రమంలో సుస్మిత కొణిదెలను సరదాగా మీ ఇంట్లో వాళ్ళు కాకుండా మీ ఫేవరేట్ హీరో ఎవరు అని అడిగారు. దీంతో సుస్మిత చాలా కష్టమైన ప్రశ్నే అడిగారు అంటూ.. రజినీకాంత్ అని చెప్పింది. టాలీవుడ్ హీరోల్లో ఎవరూ లేరా అంటే నవ్వుతూ సమాధానం చెప్పకుండా తప్పించుకుంది. దీంతో చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెలకు తన ఇంట్లో వాళ్ళు కాకుండా ఫేవరేట్ హీరో రజినీకాంత్ అని తెలుస్తుంది.

రజినీకాంత్: ఊహించని మెగా డాటర్ ఛాయిస్

అలాగే.. నాన్నతో సినిమా తీయడమే ఒక గిఫ్ట్, ఇక బాబాయ్ తో సినిమా అంటే వరం లాంటిదే. నేను ఆల్రెడీ పవన్ బాబాయ్ ని అడిగాను నా నిర్మాణంలో సినిమా చేయమని, జరుగుతుందో లేదో తెలియదు అని తెలిపింది సుస్మిత.

నిస్సందేహంగా, సుస్మిత కొణిదెల రజినీకాంత్ పేరు చెప్పడం మెగా అభిమానులలో చర్చకు దారితీసింది. అయితే తన ఇంట్లో వారికి మద్దతుగా నిలుస్తూనే, తన వ్యక్తిగత అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పినందుకు ఆమెను అభినందించాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.