
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినీ పరిశ్రమలో 18 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన కొడుకుపై గర్వంతో ఒక ప్రత్యేక పోస్ట్ చేశారు. నాన్నగా చరణ్ ప్రయాణం, కృషి, విజయాలను గుర్తుచేసుకుంటూ ఆశీర్వదించారు. ఈ పోస్ట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
Key Points
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినీ ప్రస్థానానికి 18 ఏళ్ళు పూర్తి.
తండ్రి చిరంజీవి కొడుకుపై గర్వంతో హృదయాన్ని హత్తుకునే పోస్ట్.
‘చిరుత’తో మొదలైన చరణ్ ప్రయాణం, గ్లోబల్ స్టార్ గా ఎదిగిన వైనం.
చరణ్ క్రమశిక్షణ, కృషి, వినయం, అంకితభావాన్ని మెగాస్టార్ ప్రశంసించారు.
రామ్ చరణ్ 18 ఏళ్ళ సినీ ప్రస్థానం
Chiranjeevi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినీ పరిశ్రమలోకి వచ్చి నేటికి 18 ఏళ్ళు పూర్తయింది. మెగాస్టార్ తనయుడిగా రామ్ చరణ్ మొదటి సినిమా చిరుత తో 2007 సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అప్పట్నుంచి మెగా పవర్ స్టార్ గా ఎదిగి ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా మారి ఎంతోమంది అభిమంబుల్ని సంపాదించుకున్నాడు. నటన, డ్యాన్స్ లలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.(Chiranjeevi)
రామ్ చరణ్ సినీ పరిశ్రమలోకి వచ్చి 18 ఏళ్ళు అవడంతో మెగా ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి తన కొడుకుపై స్పెషల్ పోస్ట్ చేసారు.
కొడుకుపై చిరంజీవి గర్వంతో రాసిన పోస్ట్
చిరంజీవి తన ట్వీట్ లో.. చరణ్ బాబు, 18 ఏళ్ల క్రితం ‘చిరుత’తో మొదలైన నీ సినీ ప్రయాణం, నేడు కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. నిన్ను తెరపై హీరోగా చూసిన ఆ క్షణం.. నాన్నగా నేను ఎప్పటికీ మరచిపోలేను. నీ క్రమశిక్షణ, కృషి, పట్టుదల, వినయం, అంకితభావం నిన్ను ఇండస్ట్రీలో మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. తండ్రిగా నేను నిన్ను చూసి ఎప్పుడు గర్వపడుతుంటా.. తెలుగు ప్రేక్షకుల అభిమానంతో, దేవుని దీవెనలతో మరెన్నో శిఖరాలు నువ్వు అధిరోహించాలి అని కోరుకుంటూ..విజయోస్తు… అని రాసుకొచ్చారు. దీంతో తనయుడిపై చిరంజీవి గర్వంతో రాసిన ఈ మాటలను మెగా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
వైరల్ అవుతున్న మెగాస్టార్ చిరు సందేశం
చిరంజీవి రాసిన ఈ భావోద్వేగ పోస్ట్ మెగా అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. తండ్రి గర్వానికి, కొడుకు కృషికి నిదర్శనంగా నిలిచిన ఈ సందేశం ఇప్పుడు వైరల్ అవుతోంది. రామ్ చరణ్ మరిన్ని విజయాలు సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.


