|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా టైటిల్ ఇదే.. మెగాస్టార్ బర్త్ డే గిఫ్ట్‌గా గ్లింప్స్.. వింటేజ్ మ్యూజిక్‌తో అదుర్స్

Published: 22-08-2025, 3:13 AM
చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా టైటిల్ ఇదే.. మెగాస్టార్ బర్త్ డే గిఫ్ట్‌గా గ్లింప్స్.. వింటేజ్ మ్యూజిక్‌తో అదుర్స్

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మెగా 157’ సినిమా టైటిల్ ‘మన శంకరవరప్రసాద్’ గా ఫిక్స్ అయింది. చిరంజీవి బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ విడుదలై అభిమానులను ఆకట్టుకుంది.

Key Points

1

చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో 'మన శంకరవరప్రసాద్' సినిమా

2

చిరంజీవి బర్త్‌డే గిఫ్ట్‌గా గ్లింప్స్ రిలీజ్

4

సంప్రదాయ రీతిలో చిరంజీవి లుక్ ఆకట్టుకుంటుంది

మన శంకరవరప్రసాద్ టైటిల్ రివీల్

మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోతున్నారు. విశ్వంభర్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా 157 చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇవాళ (ఆగస్ట్ 22) మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా అభిమానులు, హీరోలతోపాటు మూవీ మేకర్స్ విషెస్ తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇదివరకే చిరు పుట్టినరోజుకు ఒకరోజు ముందుగానే అంటే ఆగస్ట్ 21న సాయంత్రం విశ్వంభర గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా నేడు మెగా 157 సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు. మెగాస్టార్ బర్త్ డే గిఫ్ట్‌గా అనిల్ రావిపూడి, చిరంజీవి సినిమా టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

గ్లింప్స్‌లో చిరంజీవి డిఫరెంట్ లుక్స్

చిరు, అనిల్ కాంబినేషన్‌లో వస్తున్న మెగా 157 సినిమాకు ‘మన శంకరవరప్రసాద్ గారు’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఇది రియల్ లైఫ్‌లో చిరంజీవి పేరు అని తెలిసిందే. చిరు రియల్ పేరును సినిమాకు టైటిల్‌గా పెట్టడం కొత్తగా, అభిమానులు మురిసిపోయేలా, ఆడియెన్స్ మెచ్చుకునేలా ఉంది.

అలాగే, మెగాస్టార్ చిరు పుట్టినరోజు సందర్భంగా ఇవాళ రిలీజ్ చేసిన మన శంకరవరప్రసాద్ గ్లింప్స్ మరింత ఆకట్టుకుంటోంది. గ్లింప్స్‌లో చిరంజీవిని డిఫరెంట్ లుక్స్‌తో కొన్ని షాట్స్ చూపించారు. సూట్ వేసుకుని సిగరెట్ తాగుతూ కారులో నుంచి దిగే సీన్, పెద్ద గ్యాంగ్‌తో గ్యాంగ్‌స్టర్‌లా రావడం, మెట్లపై నుంచి గన్ పట్టుకుని స్టైలిష్‌గా నడుచుకుంటూ రావడం అన్ని అదిరిపోయేలా ఉన్నాయి.

వింటేజ్ మ్యూజిక్ హైలెట్

ఇక చివరిలో కొదమ సింహం సినిమా తరహాలో గుర్రం పట్టుకుని చిరంజీవి స్మోక్ చేస్తూ వచ్చే సీన్ హైలెట్ టచ్ ఇచ్చింది. ఇక ఈ సీన్స్‌కు చిరంజీవి పాత సినిమాల్లోని ఓ బీజీఎమ్‌కు రీ టచ్ ఇచ్చారు. ఆ వింటేజ్ మ్యూజిక్ డిఫరెంట్ ఫ్రెష్‌నెస్‌ని తీసుకొచ్చింది.

అలాగే, గ్లింప్స్‌లో “మన శంకరవరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు” అని డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పడం ఆకట్టుకుంది. ఇలా అన్ని రకాలుగా మెగా 157 టైటిల్ గ్లింప్స్ అదిరిపోయేలా ఉంది. ఇకపోతే వచ్చే ఏడాది సంక్రాంతికి మన శంకరవరప్రసాద్ గారు సినిమా రిలీజ్ కానుంది.

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘మన శంకరవరప్రసాద్’ గ్లింప్స్ అభిమానులను అలరించింది. వచ్చే సంక్రాంతికి సినిమా విడుదల కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.