|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దిగ్గజ నటుడు గుమ్మడి కూతురు అడగానే ఆ ఊరికి చిరంజీవి 100 ఏళ్ళు గుర్తుండే గొప్ప సాయం.. అది కదా మెగాస్టార్ అంటే

Published: 18-07-2025, 12:30 AM
దిగ్గజ నటుడు గుమ్మడి కూతురు అడగానే ఆ ఊరికి చిరంజీవి 100 ఏళ్ళు గుర్తుండే గొప్ప సాయం.. అది కదా మెగాస్టార్ అంటే

ప్రముఖ నటుడు చిరంజీవి తన సినిమా జీవితం మాత్రమే కాదు, సమాజ సేవలో కూడా తనదైన ముద్ర వేశారు. లెజెండరీ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు కుమార్తె అభ్యర్థన మేరకు ఆయన చేసిన సహాయం ఇప్పుడు ప్రశంసలు అందుకుంటోంది.

Key Points

1

చిరంజీవి గుమ్మడి కుమార్తె అభ్యర్థన మేరకు ఊరి గుడిని పునర్నిర్మించారు.

2

100 ఏళ్ల చరిత్ర కలిగిన గుడిని చిరంజీవి సహాయంతో పునరుద్ధరించారు.

4

గుమ్మడి కుటుంబం చిరంజీవి సహాయాన్ని ఎప్పటికీ మరచిపోదు.

గుమ్మడి కుటుంబం, చిరంజీవి అనుబంధం

మెగాస్టార్ చిరంజీవి సినిమా రంగంలో మాత్రమే కాదు.. ప్రజా సేవలో కూడా రాణించారు. బ్లడ్ బ్యాంక్, నేత్రదానం లాంటి గొప్ప కార్యక్రమాలని చిరంజీవి నడిపించారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. తన సీనియర్ నటులపై చిరంజీవికి అపారమైన గౌరవం, అభిమానాలు ఉన్నాయి. టాలీవుడ్ లెజెండ్రీ నటుల్లో గుమ్మడి వెంకటేశ్వర రావు ఒకరు.

గుమ్మడి అప్పటి ఎన్టీఆర్, ఏఎన్నార్ తరం నుంచి చిరంజీవి, బాలయ్య, నాగార్జున లాంటి హీరోలు ఇండస్ట్రీకి వచ్చే వరకు నటించి మెప్పించారు. అనేక పౌరాణిక పాత్రలని కూడా గుమ్మడి అద్భుతంగా పోషించారు. బలరాముడిగా, భీష్ముడిగా, దశరథుడిగా, కర్ణుడిగా ఆయన నటించారు. గుమ్మడికి ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కొడుకులు సంతానం.

పాడైన గుడి, చిరంజీవి సహాయం

గుమ్మడి కుమార్తె గుమ్మడి శారద చిరంజీవితో తమకున్న అనుబంధాన్ని, ఆయన తమ ఊరికి చేసిన సహాయాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. గుమ్మడి శారద మాట్లాడుతూ.. మా ఊరిలో గుడి పాడైపోయింది. అది మా అమ్మగారి ముత్తాత కట్టించిన గుడి. సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ గుడి రోడ్డు కంటే బాగా కిందికి వెళ్ళిపోయింది. వర్షం నీరు చేరి భక్తులకి ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఆ గుడిని బాగు చేయించాలని అమ్మా నాన్న ఎంతో ప్రయత్నించారు.

ఆ గుడిని బాగు చేయించడం అమ్మ చివరి కోరిక. కానీ అది నెరవేరకుండానే ఆమె మరణించారు. నాన్న కూడా ప్రయత్నించినప్పటికీ గుడిని బాగు చేయడం కుదర్లేదు. ఇటీవల కొన్నేళ్ల క్రితం తాను చిరంజీవి గారిని కలిశానని తెలిపారు. తమ ఊరిలో ఉన్న గుడి పరిస్థితి గురించి వివరించాను. అప్పటికే ఆయన రాజకీయాల నుంచి బయటకు వచ్చేశారు. ఏ పదవిలోనూ లేరు. నేను గుడి గురించి చెప్పగానే తన పలుకుబడి ఉపయోగించి కేవలం అరగంటలో గుడికి సంబంధించిన ఫైల్ కదిలించి నిధులు మంజూరు అయ్యేలా చేశారు.

100 ఏళ్ళు గుర్తుండే గొప్ప సాయం

ఆ నిధులతో మా ఊరిలో 100 ఏళ్ళు గుర్తుండిపోయేలా గుడి నిర్మాణం జరిగినట్లు శారద తెలిపారు. ఒక గుడికి ఆయుష్షు 100 ఏళ్ళు ఉంటుంది అంటారు. ఆ విధంగా తమ ఊరికి చిరంజీవి మరచిపోలేని సాయం చేశారు అని శారద అన్నారు. చిరంజీవి, గుమ్మడి కలిసి పసివాడి ప్రాణం, ముఠా మేస్త్రి, రక్త సంబంధం లాంటి చిత్రాల్లో నటించారు.

చిరంజీవి చేసిన ఈ గొప్ప కార్యం వల్ల గుమ్మడి కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది. మెగాస్టార్ యొక్క ఈ మానవతా సేవ అందరికీ ఆదర్శం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.