|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Chirubobby2: చిరు-బాబీ మరో సినిమా.. అఫీషియల్ పోస్టర్ రిలీజ్

Published: 22-08-2025, 8:18 AM
Chirubobby2: చిరు-బాబీ మరో సినిమా.. అఫీషియల్ పోస్టర్ రిలీజ్

‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మళ్ళీ చిరంజీవి మరియు బాబీ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోంది. కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘మెగా 158’ అనే వర్కింగ్ టైటిల్ ఉంది. అధికారికంగా పోస్టర్ విడుదలైంది.

Key Points

1

చిరంజీవి మరియు బాబీ కలిసి మరో సినిమా చేస్తున్నారు.

2

కెవిఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

4

రిలీజ్ చేసిన పోస్టర్ ప్రకారం, సినిమా యాక్షన్‌కు సంబంధించినట్లుంది.

చిరు-బాబీ కాంబినేషన్ మళ్ళీ!

‘భోళా శంకర్’ వచ్చి రెండేళ్లు దాటిపోయింది. ఆ సినిమా ఫలితం వల్ల ఆలోచనలో పడిపోయిన చిరంజీవి రూట్ మార్చారు. ‘విశ్వంభర’ మొదలుపెట్టారు. అయితే ఇది భారీ బడ్జెట్ చిత్రం కావడంతో లేట్ అవుతూ వస్తోంది. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలోనూ ఓ చిత్రం చేస్తున్నారు. దీనికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అలానే శ్రీకాంత్ ఓదెలతోనూ ఓ మూవీ కమిట్ అయ్యారు. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది.

‘మెగా 158’ చిత్రం అధికారిక ప్రకటన

రెండో ఇన్నింగ్స్‌లో చిరు సినిమాలు చేస్తున్నారు గానీ సరైన ఫలితాలు రావట్లేదు. ఈ క్రమంలోనే వచ్చి మంచి కమర్షియల్ హిట్ అయిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. ఈ చిత్రానికి బాబీ దర్శకుడు. ఇప్పుడు మరోసారి చిరుని డైరెక్ట్ చేసే ఛాన్స్ బాబీ అందుకున్నాడు. యష్ ‘టాక్సిక్’, దళపతి విజయ్ ‘జననాయగన్’ చిత్రాల్ని నిర్మిస్తున్న కెవిఎన్ ప్రొడక్షన్.. చిరు-బాబీ కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సినిమా

‘మెగా 158’ పేరుని ఈ ప్రాజెక్టుకి వర్కింగ్ టైటిల్‌గా నిర్ణయించారు. నెత్తురు-గొడ్డలిని పోస్టర్‌లో చూపించారు. చూస్తుంటే ఇది యాక్షన్ మూవీలా అనిపిస్తుంది. మరి షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారు. హీరోయిన్, సంగీత దర్శకుడు ఎవరనేది త్వరలో వెల్లడిస్తారేమో?

చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘మెగా 158’ చిత్రం యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండనుందని పోస్టర్ సూచిస్తోంది. హీరోయిన్, సంగీత దర్శకుడు వంటి వివరాలు త్వరలో వెల్లడించబడతాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.