
📌 Key Points
- హీరోయిన్ నిధి అగర్వాల్‌కు ‘రాజాసాబ్’ ఈవెంట్‌లో చేదు అనుభవం!
- సమంతకు కూడా పబ్లిక్ ఈవెంట్‌లో ఎదురైన షాకింగ్ ఘటన!
- జాన్ అబ్రహంతో కలిసి సినిమా ప్రమోషన్స్‌లో చిత్రాంగదకు భయంకరమైన అనుభవం.
- జాగ్రత్తగా ఉండాలని సెలబ్రిటీలకు సూచన చేసిన చిత్రాంగద సింగ్!
తాజాగా బాలీవుడ్ నటి చిత్రాంగద సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. హీరోయిన్లకే కాదు హీరోలకు కూడా భయంకర అనుభవాలు ఎదురవుతాయని ఆమె చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆమె చేసిన కామెంట్స్‌పై ఒక లుక్ వేద్దాం!
నిధి, సమంతలకు ఎదురైన అనుభవాలు
ఇటీవల స్టార్ హీరోయిన్లు పబ్లిక్ ఈవెంట్లు, సినిమా ఫంక్షన్లకు హాజరయ్యే సమయంలో ఎదుర్కొంటున్న అనుభవాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొందరు అభిమానులు హద్దులు దాటి ప్రవర్తిస్తూ సెల్ఫీల కోసం ఎగబడడం, దగ్గరికి వచ్చి ముట్టుకునే ప్రయత్నాలు చేయడం హీరోయిన్లను భయాందోళనలకు గురి చేస్తోంది. ఇక ఇటీవల ‘ది రాజాసాబ్’ ఈవెంట్‌లో నిధి(Nidhi Agarwal)కి ఎదురైన ఘటన ఇందుకు ఉదాహరణగా నిలిచింది. ఆ సంఘటన మరువక ముందే సమంత(samantha)కూ ఇలాంటి చేదు అనుభవమే ఎదురవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వరుస ఘటనలతో హీరోయిన్లు ఏదైనా పబ్లిక్ ఈవెంట్‌కు రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడుతోందని టాక్.
ఈ క్రమంలో తాజాగా.. బాలీవుడ్ హీరోయిన్ చిత్రాంగద సింగ్ (Chitrangada Singh)కూడా తనకు ఎదురైన భయానక అనుభవాలను వెల్లడిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. నిధికి జరిగిన సంఘటనల వీడియోలను చూసిన తర్వాత తాను తీవ్రంగా కలత చెందానని, అలాంటి పరిస్థితుల్లో హీరోయిన్ల భద్రతపై ఎవరు బాధ్యత తీసుకుంటారో అర్థం కావడం లేదని ఆమె వ్యాఖ్యానించింది. ‘‘జాన్ అబ్రహంతో కలిసి చేసిన ‘ఐ, మీ ఔర్ మెయిన్’ సినిమా ప్రమోషన్స్ సమయంలో ఢిల్లీలోని ఓ కాలేజీకి వెళ్లిన ఘటనను వివరించింది. స్టేజ్‌పైకి వెళ్లగానే జనం ఒక్కసారిగా గుమిగూడి పరిస్థితి అదుపు తప్పిందని చెప్పింది.
చిత్రాంగద సింగ్ షాకింగ్ కామెంట్స్
అక్కడి నుంచి బయటపడేందుకు జాన్ తనను రక్షిస్తూ కారువైపు తీసుకెళ్లాడని, ఆ సమయంలో అతని వీపు మొత్తం గీతలతో నిండిపోయిందని తెలిపింది. అతను నన్ను కాపాడటానికి నా వెనక నిలబడ్డాడు. అందుకే అతనికే ఎక్కువ గాయాలయ్యాయి. కారులో కూర్చోగానే అతని వీపు చూసి నేను షాక్ అయ్యాను’’ అని చిత్రాంగద చెప్పుకొచ్చింది. అంతేకాదు, ఇలాంటి ఘటనలు కేవలం మహిళలకే కాదు, పురుష నటులకు కూడా జరుగుతాయని, పండుగలు, ఈవెంట్ల సమయంలో జనాలు అదుపు తప్పి కార్లపై దాడులు చేయడం కూడా తనకు గుర్తుందని పేర్కొంది. ఈ అనుభవాలన్నీ తనను తీవ్రంగా భయపెట్టాయని చిత్రాంగద సింగ్ భావోద్వేగంగా వెల్లడించింది.
సెలబ్రిటీల భద్రత ప్రశ్నార్థకం!
A post shared by Chitrangda Singh (@chitrangda)
చిత్రాంగద సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. సెలబ్రిటీల భద్రతకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి.


