
పృథ్వీ అంబర్ మరియు ధన్యా రమ్యకుమార్ జంటగా నటిస్తున్న ‘చౌకీదార్’ సినిమా నుంచి తాజాగా ఒక ఎమోషనల్ సాంగ్ విడుదలైంది. సాయి కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
Key Points
‘చౌకీదార్’ సినిమా నుంచి ఎమోషనల్ సాంగ్ రిలీజ్
సాయి కుమార్ నటనతో ఆకట్టుకునే పాట
సచిన్ బస్రూర్ సంగీతం, విజయ్ ప్రకాష్ గాత్రం
‘చౌకీదార్’ సినిమా నుంచి కొత్త పాట
Chowkidar : పృథ్వీ అంబర్, ధన్యా రమ్యకుమార్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘చౌకీదార్’. సాయి కుమార్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డా.కల్లహల్లి చంద్ర శేఖర్ నిర్మాణంలో చంద్రశేఖర్ బండియప్ప దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమాను బైలింగ్వల్ గా తెరకెక్కిస్తున్నారు.
తాజాగా చౌకీదార్ సినిమా నుంచి ఓ ఎమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. నాన్న గొప్పదనం చాటి చెప్పేలా ఈ పాట ఉంది. ‘నాన్నా అంటే మొదటి దైవం..’ అంటూ సాగే ఈ పాటను సంతోష్ వెంకీ రచించగా సచిన్ బస్రూర్ సంగీత దర్శకత్వంలో విజయ్ ప్రకాష్ పాడారు. ఈ సినిమాలో పృథ్వీ అంబర్, సాయి కుమార్ మధ్య మంచి తండ్రి కొడుకు ఎమోషనల్ సీన్స్ ఉండేలా తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు.
సాయి కుమార్ కీలక పాత్ర
తండ్రి-కొడుకు భావోద్వేగాలను చూపించే పాట
నాన్న ఎమోషనల్ సాంగ్ మీరు కూడా వినేయండి..
చివరగా, చౌకీదార్ సినిమా నుంచి విడుదలైన ఈ ఎమోషనల్ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని ఆశిద్దాం. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.


