|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శ్రీ విష్ణుపై మండిపడుతున్న క్రైస్తవ మత సంఘాలు.. ఆయన ఏ తప్పు చేయలేదంటూ వెనకేసుకొస్తున్న ఫ్యాన్స్.. అసలు కథ అక్కడే స్టార్ట్…

Published: 15-05-2025, 12:51 PM
శ్రీ విష్ణుపై మండిపడుతున్న క్రైస్తవ మత సంఘాలు.. ఆయన ఏ తప్పు చేయలేదంటూ వెనకేసుకొస్తున్న ఫ్యాన్స్.. అసలు కథ అక్కడే స్టార్ట్...

‘సింగిల్’ సినిమాతో విజయం సాధించిన శ్రీ విష్ణుపై క్రైస్తవ మత సంఘాలు మండిపడుతున్నాయి. ఆయన సినిమాల్లో క్రైస్తవులను కించపరిచారని ఆరోపిస్తున్నారు. అయితే, ఆయన అభిమానులు వేర్వేరుగా వాదిస్తున్నారు.

Key Points

1

శ్రీ విష్ణు సినిమాల్లో క్రైస్తవ మతంపై విమర్శలు ఉన్నాయని క్రైస్తవ సంఘాల ఆరోపణ.

2

శ్రీ విష్ణు సినిమాలను బాయ్‌కాట్ చేయాలని క్రైస్తవ సంఘాల డిమాండ్.

4

సోషల్ మీడియాలో #BoycottSriVishnuMovies ట్రెండ్ చక్కర్లు కొడుతోంది.

క్రైస్తవ సంఘాల ఆరోపణలు

‘సింగిల్’గా వచ్చి హిట్ కొట్టిన హీరో శ్రీ విష్ణును టార్గెట్ చేస్తున్నాయి క్రైస్తవ మత సంఘాలు. ఆయన ప్రతి సినిమాలో క్రిస్టియన్లపై సెటైర్స్ వేస్తున్నాడని.. ఆయన మూవీస్ బాయ్‌కాట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జీసస్‌ను తన సినిమాల ద్వారా కించపరచడాన్ని తట్టుకోలేకపోతున్నామని ఫైర్ అయ్యారు. ఆయన మతంలో తప్పులు లేవా? వాటి గురించి ఎందుకు సినిమాలు తీయడు? అని ప్రశ్నిస్తున్నారు. బాయ్‌కాట్ శ్రీవిష్ణు మూవీస్ పేరుతో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. దీనిపై క్రిస్టియన్స్ మద్దతిస్తున్నారు. రాముడిపై ఇలాంటి జోక్స్ వేస్తే ఊరుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు.

అయితే అది శ్రీ విష్ణు తప్పు ఎలా అవుతుందని వార్‌కు దిగారు హీరో ఫ్యాన్స్. డైరెక్టర్ చెప్పినట్లు హీరో చేస్తాడు కానీ ఆయన సొంత కవిత్వం వాడరని ముందు తెలుసుకోవాలని ఫైర్ అవుతున్నారు. ఆ మాత్రం తెలియకుండా బాయ్ కాట్ ట్రెండ్ ఎలా క్రియేట్ చేస్తారని అడుగుతున్నారు. మొత్తానికి ఈ వార్ ఇలాగే జరుగుతున్నా.. సింగిల్ కలెక్షన్స్ మాత్రం జోరుగానే వస్తున్నట్లు తెలుస్తోంది. అటు సమంత ‘శుభం’ కూడా థియేటర్లలో రన్ అవుతోంది.

అభిమానుల ప్రతిస్పందన

#BoycottSriVishnuMovies ట్రెండ్

ఈ వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. శ్రీ విష్ణు సినిమాల భవిష్యత్తు ఏమిటో చూడాలి. కానీ ప్రస్తుతం సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.