|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

క్రిస్మస్ బాక్సాఫీస్ వార్: ఏ సినిమా గెలిచింది? కలెక్షన్ల తుది లెక్కలు!

Published: 27-12-2025, 9:28 AM
క్రిస్మస్ బాక్సాఫీస్ వార్: ఏ సినిమా గెలిచింది? కలెక్షన్ల తుది లెక్కలు!
  • క్రిస్మస్ కానుకగా ఏడెనిమిది సినిమాలు విడుదలయ్యాయి, బాక్సాఫీస్ వద్ద మంచి సందడి నెలకొంది.
  • `ఛాంపియన్‌` చిత్రం రెండు రోజుల్లో రూ.6.91 కోట్లు వసూలు చేసి కలెక్షన్లలో ముందుంది.
  • `శంబాల` సినిమా రెండు రోజుల్లో రూ.5.4 కోట్లు వసూలు చేసి మంచి వసూళ్లు సాధించింది.
  • `ఈషా` మూవీ కూడా మిశ్రమ స్పందనతో పర్వాలేదనిపించే కలెక్షన్లను రాబట్టింది.

క్రిస్మస్ పండుగ సందర్భంగా విడుదలైన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. వాటిలో కొన్ని అంచనాలను మించి వసూళ్లను రాబట్టగా, మరికొన్ని నిరాశపరిచాయి. ఈ వారం ఏ సినిమా టాప్ కలెక్షన్లతో దూసుకుపోయిందో, ఏ చిత్రాలకు ప్రేక్షకులు పట్టం కట్టారో తెలుసుకుందాం.

క్రిస్మస్ విడుదలైన చిత్రాలు – ఒక పరిశీలన

క్రిస్మస్ కానుకగా ఏడెనిమిది సినిమాలు విడుదలయ్యాయి. మరో సంక్రాంతి పండగని తలపించింది. ఈ వారం చాలా వరకు మిడిల్‌ రేంజ్‌ సినిమాలు, చిన్న సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో కొన్ని సినిమాలు ఆకట్టుకున్నాయి. కొన్ని సినిమాలు డిజప్పాయింట్‌ చేశాయి. ఇంకొన్ని సినిమాలు క్రిటికల్‌గా మెప్పించాయి. మరి కలెక్షన్ల విషయంలో ఏ సినిమా టాప్‌లో ఉంది. ఏ చిత్రాలను ఆడియెన్స్ ఎక్కువగా చూస్తున్నారనేది చూస్తే.

ఈ క్రిస్మస్‌ కానుకగా విడుదలైన చిత్రాల్లో `ఛాంపియన్‌` మూవీకి వసూళ్లు బాగానే ఉన్నాయి. రోషన్‌ మేక హీరోగా, అనస్వర రాజన్‌ హీరోయిన్‌గా నటించిన  ఈ చిత్రానికి ప్రదీప్‌ అద్వైతం దర్శకత్వం వహించారు. స్వప్న సినిమాస్‌ సమర్పణలో జీ స్టూడియోస్‌ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ తో కలిసి ఈ సినిమాని నిర్మించింది. ఈ గురువారం విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. కానీ వసూళ్ల పరంగానే ఇది బాగానే ఉంది. రెండు రోజుల్లో ఈ చిత్రానికి రూ.6.91కోట్లు వసూలు చేసింది. దీనికి డీసెంట్‌గానే వసూళ్లు వస్తుండటం విశేషం. కాకపోతే బడ్జెట్‌, బిజినెస్‌ లెక్కలతో పోల్చితే ఈ కలెక్షన్లు సరిపోవని చెప్పొచ్చు. అయితే లాంగ్‌ వీకెండ్‌,  హాలీడేస్‌ ఉండటంతో అది ఈ చిత్రానికి హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఇక క్రిస్మస్‌కి విడుదలైన చిత్రాల్లో కలెక్షన్ల పరంగా జోరు మీదున్న చిత్రం `శంబాల`. ఆది సాయికుమార్‌ హీరోగా, అర్చన అయ్యర్‌, స్వసిక, రవి వర్మ, మధునందన్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి యుగంధర్‌ దర్శకత్వం వహించారు. రాజశేఖర్‌ అన్నాభిమోజు, మహీధర్‌ రెడ్డి నిర్మించారు. గురువారం విడుదలైన ఈ మూవీకి కూడా మంచి వసూళ్లు వస్తున్నాయి. దీనికి మొదటి రోజు రూ.3.3కోట్లు రాగా రెండు రోజుల్లో ఇది రూ.5.4కోట్లు వసూలు చేసింది. బడ్జెట్‌, బిజినెస్‌ పరంగా చూస్తే ఈ మూవీ కలెక్షన్లు అదిరిపోయేలా ఉండటం విశేషం. చాలా రోజుల తర్వాత ఆది సాయికుమార్‌కి హిట్‌ పడింది.

కలెక్షన్లలో టాప్‌లో నిలిచిన సినిమా ఏది?

మిశ్రమ స్పందన తెచ్చుకున్న `ఈషా` మూవీ కూడా వసూళ్ల పరంగా దుమ్ములేపుతుంది. హర్రర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో `రాజు వెడ్స్ రాంబాయి` ఫేమ్‌ అఖిల్‌ రాజు, త్రిగుణ్‌, హేబా పటేల్‌, సిరి హనుమంతు ప్రధాన పాత్రలు పోషించారు. హెచ్‌వీఆర్‌ ప్రొడక్షన్స్ పతాకంపై కేఎల్‌ దామోదర ప్రసాద్‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. శ్రీనివాస్‌ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి, బన్నీ వాసు విడుదల చేశారు. ఈ మూవీ రెండు రోజుల్లో ఏకంగా రూ.3.61 కోట్లు రాబట్టడం విశేషం.

క్రిస్మస్‌ కానుకగా విడుదలైన మూవీస్‌లో శివాజీ నటించిన `దండోరా` కూడా ఉంది. విమర్శకుల ప్రశంసలందుకున్న ఈ మూవీ కలెక్షన్ల పరంగా మాత్రం కాస్త డల్‌గానే ఉంది. అయితే ఇలాంటి సబ్జెక్ట్ జనానికి కనెక్ట్ కావడానికి టైమ్‌ పడుతుంది. ఆశించిన స్థాయిలో వసూళ్లు లేకపోయినా, చూసిన వాళ్లు మాత్రం అభినందిస్తున్నారు. ఇలాంటి సినిమాలు రావాల్సిన అవసరం ఉందంటున్నారు.

మంచి వసూళ్లు సాధించిన మిగిలిన చిత్రాలు

ఇదే కోవలో ఉన్న మరో మూవీ `పతంగ్‌` ఉంది. ప్రీతి పగడాల, ప్రణవ్‌ కౌశిక్‌, వంశీ పూజిత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రణీత్‌ ప్రత్తిపాటి దర్శకత్వం వహించారు. డి సురేష్‌ బాబు సమర్పణలో విజయ్‌ శేఖర్‌ అన్నే, సంపత్‌, సురేష్‌ కొత్తింటి, నాని బండ్రెడ్డి కలిసి నిర్మించారు. ఈ మూవీకి పాజిటివ్ టాక్‌ వచ్చింది. ప్రమోషన్స్ లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్‌. బాగా ప్రమోషన్స్ చేస్తే సినిమా పెద్ద రేంజ్‌ హిట్‌ అయ్యేది. అయితే లిమిటెడ్‌ థియేటర్లలో విడుదల చేయడంతో మూవీ వసూళ్ల పరంగా డల్‌గానే ఉంది. లక్షల్లోనే కలెక్షన్లు ఉన్నట్టు సమాచారం.

మలయాళ మూవీ `వృషభ` కూడా చాలా డల్‌గా ఉంది. ఈ చిత్రానికి నెగటివ్‌ టాక్‌ వచ్చింది. మలయాళంతోపాటు తెలుగులోనూ ఈ మూవీ విడుదలైన విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ తెలుగులో డిస్ట్రిబ్యూట్‌ చేసింది. కానీ ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా కోటి రూపాయల షేర్‌ కూడా సాధించలేదని సమాచారం. మోహన్‌ లాల్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ఈ చిత్రం నిలవబోతుంది. వీటితోపాటు తెలుగులో విడుదలైన ఇతర చిత్రాలు కూడా ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి.

క్రిస్మస్ సినిమాల్లో కొన్ని ఆశించిన విజయం సాధించగా, మరికొన్ని మిశ్రమ స్పందనతో పర్వాలేదనిపించాయి. ఈ కలెక్షన్ల రేసులో `ఛాంపియన్‌`, `శంబాల`, `ఈషా` చిత్రాలు మంచి వసూళ్లతో నిలిచాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.