|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Varun Sandesh : వరుణ్ సందేశ్ సినిమా.. ఎమోషనల్ సాంగ్ పాడిన ఆస్కార్ లిరిసిస్ట్..

Published: 28-09-2025, 6:47 AM
Varun Sandesh : వరుణ్ సందేశ్ సినిమా.. ఎమోషనల్ సాంగ్ పాడిన ఆస్కార్ లిరిసిస్ట్..

వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కుతున్న “కానిస్టేబుల్” సినిమా నుండి తాజాగా ఓ ఎమోషనల్ సాంగ్ విడుదలైంది. ఆస్కార్ లిరిసిస్ట్ చంద్రబోస్ పాడిన ఈ పాటను ఆర్. నారాయణమూర్తి ఆవిష్కరించారు. ఈ సినిమా అక్టోబర్ 10న విడుదల కానుంది.

Key Points

1

వరుణ్ సందేశ్, మధులిక వారణాసి నటించిన "కానిస్టేబుల్" సినిమా నుండి ఎమోషనల్ సాంగ్ రిలీజ్.

2

ఈ పాటను ఆస్కార్ లిరిసిస్ట్ చంద్రబోస్ పాడగా, ప్రముఖ నటుడు ఆర్. నారాయణమూర్తి ఆవిష్కరించారు.

4

"కానిస్టేబుల్" సినిమా అక్టోబర్ 10న విడుదల కానుంది; ట్రైలర్‌కు ఇప్పటికే 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

“కానిస్టేబుల్” సినిమా నేపథ్యం

Varun Sandesh : వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా తెరకెక్కుతున్న సినిమా కానిస్టేబుల్. జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఆర్యన్ సుభాన్ ఎస్.కె దర్శకత్వంలో బలగం జగదీష్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా ఓ ఎమోషనల్ సాంగ్ రిలీజ్ చేసారు.(Varun Sandesh)

కానిస్టేబుల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా ఈ పాటను ఆర్.నారాయణమూర్తి ఆవిష్కరించారు. ఈ పాటను రామారావు రాయగా సుభాష్ ఆనంద్ సంగీత దర్శకత్వంలో ఆస్కార్ విన్నింగ్ లిరిసిస్ట్ చంద్రబోస్ పాడటం గమనార్హం. మీరు కూడా ఈ ఎమోషనల్ సాంగ్ వినేయండి..

Also See : CM Chandrababu Naidu : జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్.. పరామర్శించిన సీఎం చంద్రబాబు.. ఫొటోలు..

ఎమోషనల్ సాంగ్ ఆవిష్కరణ విశేషాలు

ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. సమాజంలో పోలీసులు పోషిస్త్తున్న పాత్ర, చట్టాన్ని కాపాడుతూ నిజాయితీగా పనిచేసే పోలీసులు సమాజానికి స్ఫూర్తిదాయకం. నిజాయితీ కలిగిన ఓ కానిస్టేబుల్ కథతో ఈ సినిమా తీయడం అభినందనీయం. ఇవాళ నేను ఆవిష్కరించిన ఎమోషనల్ పాట మనసును ఎంతగానో హత్తుకుంటోంది. నా కళ్ళు చమర్చాయి అని అన్నారు.

హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. నేను ఇంతవరకు నటించిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమాలో పాత్ర ఉంటుంది అని అన్నారు. నిర్మాత బలగం జగదీశ్ మాట్లాడుతూ.. కానిస్టేబుల్ సినిమా అక్టోబర్ 10న ఏషియన్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజ్ కాబోతుంది అని తెలిపారు.

సినిమా విడుదల తేదీ, ట్రైలర్ స్పందన

డైరెక్టర్ ఆర్యన్ సుభాన్ మాట్లాడుతూ.. ట్రైలర్ కి ఇప్పటికే 5 లక్షలకు పైగా వ్యూస్, లక్షకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ ఎమోషనల్ పాటను చిత్రీకరిస్తున్నప్పుడు లొకేషన్ లో ప్రజలు నిజమైన సన్నివేశం అనుకుని కన్నీరు కార్చారు అని తెలిపాడు.

“కానిస్టేబుల్” సినిమాలోని ఈ ఎమోషనల్ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని, సినిమా విజయానికి ఇది దోహదపడుతుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. అక్టోబర్ 10న సినిమా విడుదల కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.